Nindu Noorella Saavasam Serial Today Episode: మనోహరి, రణవీర్ దగ్గరకు వెళ్లి సరస్వతి వార్డెన్ భాగీకి నిజం చెప్పిందని చెప్తుంది. దీంతో రణవీర్ షాక్ అవుతాడు. ఏంటి మనోహరి నువ్వు మాట్లాడేది అంటూ రణవీర్ అడగ్గానే.. అవును రణవీర్ అరుంధతిని చంపింది నేనే అని చెప్పింది అంటుంది. అంతా తెలిసినా కూడా భాగీ అమరేంద్రతో ఈ విషయం చెప్పలేదా..? ఎందుకు అంటూ ప్రశ్నిస్తాడు. నేనే నీ వైఫ్ అని మన బిడ్డను వదిలేశానని కూడా చెప్పింది అని మను చెప్పగానే.. నా వైఫ్ నువ్వే అని భాగీకి కూడా తెలిసిపోయిందా…? అని అడుగుతాడు.
దీంతో అవును నా చరిత్ర మొత్తం రివీల్ అయిందని చెప్తున్నాను కదా..? నేనేంటో వాళ్లకు తెలిసిపోయింది. అని చెప్పగానే.. ఇంత తెలిసినా కూడా భాగీ.. అమరేంద్రతో ఏ విషయం చెప్పలేదా..? ఏం ఎందుకు అంటాడు రణవీర్. తెలియదు అంటుంది మనోహరి. ఒకపక్క అమరేంద్ర నా వైఫ్ ఎవరా అని నీ గురించి జల్లెడ పడుతున్నాడు. వేట కుక్కలా ఆధారాల కోసం వెతుకుతున్నాడు. ఇంకో పక్క భాగీకి నువ్వే నా వైఫ్ అని తెలిసిపోయింది. అయినా కూడా భాగీ అమరేంద్రకు నిజం చెప్పకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటూ రణవీర్ అడగ్గానే…?
అదీ నాకు అర్థం కావడం లేదు. అమరేంద్రకు అంతా చెప్పేస్తుందని చాలా భయపడ్డాను.. కానీ భాగీ ఏమీ చెప్పలేదు. అలా చూస్తూ ఉండిపోయింది. నేను అరుంధతిని చంపిన విషయం చెప్తుంది అనుకున్నాను కానీ చెప్పలేదు.. నేనే నీ వైఫ్ అని చెప్తుంది అనుకున్నాను.. కానీ అది కూడా చెప్పలేదు. భాగీ మన గురించి అమరేంద్రకు చెప్పకపోవడానికి కారణం మన బిడ్డే అయ్యుంటుందా..? దీనికి మన బిడ్డకు లింక్ ఏమైనా ఉండుంటుంది అంటావా..? అసలు భాగీ ఎందుకు చెప్పలేదు.. అంటూ అనుమాన పడుతుంది మనోహరి. నువ్వే నా వైఫ్ అని భాగీ చెప్పనందుకు సంతోషించు.. కారణాలు వదిలేయ్ అంటాడు రణవీర్. దీంతో మనోహరి లేదు రణవీర్.. అరుంధతి నాకు ఏదో ఫేవర్ చేసిందని ఇందాక భాగీ ఏదో చెప్తూ ఆగిపోయింది అనగానే.. అరుంధతి నీకు చాలా హెల్ఫ్ చేసింది కదా..? అంటాడు రణవీర్. కాదు వాటిని మించి అరుంధతి ఏదో చెప్పబోయిందని ఆగిపోయింది.
ఏదో నిజం దాని గొంతులో ఆగిపోయింది. ఆ నిజమే నాకు గురించి అమర్‌కు చెప్పనివ్వకుండా ఆగిపోయిందా..? అసలు ఆ నిజం ఏంటి..? దానికి నాకు సంబంధం ఏంటి..? అంటూ మనోహరి ప్రశ్నిస్తుంటే.. ఎక్కువ ఆలోచించకు మనోహరి.. ఈ రోజు నీ టైం చాలా బాగుంది అనుకో.. నీకు గురించి అమర్‌కు తెలియలేదు.. అంటాడు రణవీర్. ఈ గుడ్ టైం రోజు ఉండదు రణవీర్ ఏదో ఒక రోజు భాగీ నోరు తెరచి అమర్‌కు నా గురించి అంతా చెప్పేస్తుంది. ఆ రోజు నా టైం బ్యాడ్ అవుతుంది. ఆలోపే నువ్వు దాని నోరు మూయించాలి అని చెప్తుంది. ఆ పని నేను ఎలాగూ చేస్తాను.. మన గురించి నిజం తెలిసిన వాళ్లను ఎలా బతకనిస్తాను.. అంటాడు.
త్వరలోనే అమరేంద్ర ఆరు అస్థికలను గంగలో కలుపబోతున్నాడు. ఆ తర్వాత అరుంధతి ఆత్మ కూడా మనల్ని ఇబ్బంది పెట్టదు. అది ఆత్మ కాదు మనిషి అని భాగీ అనుకుంటుంది అని చెప్పగానే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ ఇంట్లో ఎవ్వరికీ కనిపించని ఆత్మ ఒక్క భాగీకే ఎందుకు కనిపిస్తుంది అంటూ రనవీర్ అడగ్గానే.. భాగీ అరుంధతికి తోడబుట్టిన చెల్లెలు కదా..? అని చెప్తుంది. మరి అమరేంద్ర, పిల్లలతో కూడా అరుంధతికి అంతే రిలేషన్ ఉంది కదా..? మరి వాళ్లకు ఎందుకు కనిపించడం లేదు అని రణవీర్ అడగ్గానే.. ఆ విషయం పక్కన పెడితే.. తన కనిపిస్తుంది మనిషే కాదు ఆత్మ అని భాగీకి తెలిసిన రోజు మొత్తం తలకిందులైపోతుంది అని మనోహరి చెప్పగానే.. ఆ రోజు వస్తుందా…? అని రణవీర్ అడుగుతాడు. ఎందుకు రాదు తప్పకుండా వస్తుంది అంటూ మనోహరి చెప్తుంది.
తర్వాత రూంలోకి వెళ్లి అరుంధతి ఫోటో చూసిన మిస్సమ్మ షాక్ అవుతుంది. వెంటనే రూంలోంచి బయటకు వచ్చి ఆరు గురించి ఆలోచిస్తూ.. గార్డెన్ లోకి వెళ్తుంది. ఆరు తనతో మాట్లాడిన విషయాలు గుర్తు చేసుకుంటుంది. ఇంతలో ఆరు వెనక నుంచి భాగీ అని పిలుస్తుంది. ఆ పిలుపునకు మిస్సమ్మ షాక్ అవుతుంది. మెల్లగా వెనక్కి తిరిగి చూడగానే ఆరు కనిపిస్తుంది. ఆరును చూసిన మిస్సమ్మ భయంతో వణికిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.