BigTV English

OTT Movie : భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా… ఈ అరాచకం చూస్తే కన్నీళ్లు ఆగవు భయ్యా

OTT Movie : భార్యాభర్తలు ఏకాంతంగా ఉండగా… ఈ అరాచకం చూస్తే కన్నీళ్లు ఆగవు భయ్యా

OTT Movie : గ్రామీణ నేపథ్యంలో, ఒక తమిళ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ సినిమా, ఆడియన్స్ చేత కంటతడి పెట్టిస్తోంది.  ఒక వృద్ధురాలి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆమె మరణం తరువాత ఆమెకు చెందిన ఇయర్‌ రింగ్స్ తో అసలు కథ మొదలవుతుంది. క్లైమాక్స్ వరకు ఆసక్తికరంగా సాగే ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌

‘Thandatti’ రామ్ సంగయ్య దర్శకత్వం వహించిన తమిళ కామెడీ థ్రిల్లర్ సినిమా. ఇందులో పసుపతి, రోహిణి, వివేక్ ప్రసన్న, అమ్ము అభిరామి, దీపా శంకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2023 జూన్ 23న థియేటర్లలో విడుదలై, 2023 జులై 14 నుండి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. 2 గంటల 8 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా Imdbలో 6.7/10 రేటింగ్ పొందింది.

స్టోరీలోకి వెళ్తే

సుబ్రమణి పది రోజుల్లో రిటైర్మెంట్‌ అవ్వబోయే ఒక సాదా సీదా కానిస్టేబుల్. ఈ సమయంలో తన సహోద్యోగులు ఎంత చెప్పినా వినకుండా ఒక కేసును తీసుకుంటాడు. కిదారిపట్టి గ్రామంలో, తంగపొన్ను అనే వృద్ధ మహిళ కనిపించకుండా పోవడంతో వెతకడం మొదలు పెడతాడు. కానీ ఈ గ్రామంలో ఎప్పుడూ గొడవలు జరుగుతుంటాయి. కనికరం లేని మనుషులే ఎక్కువగా ఉంటారు. తంగపొన్ను, కాస్త శాంతంగా ఉండే వృద్ధ మహిళ. ఆమె తన చెవి దిద్దులను (ఇయర్‌ రింగ్స్) అమితంగా ప్రేమిస్తుంటుంది. ఆమె కొడుకు షోపండి ఒక ఆల్కహాలిక్. ఆమె తన కొడుకుతో పాటు, ఆస్తి కోసం ఆరాటపడే నలుగురు కుమార్తెల చేతిలో బాధలు పడుతోంది. ఒక చిన్న గోడవతో ఇంట్లో నుంచి బయటికి వచ్చి, ఒక రోడ్డు పక్కన సొమ్మసిల్లి పడిపోతుంది. సుబ్రమణి ఆమెను చూసి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. అయితే అంతలోనే ఆమె చనిపోతుంది.


తంగపొన్ను మరణం తర్వాత, సుబ్రమణి ఆమె అంత్యక్రియల కోసం గ్రామానికి వెళ్తాడు. కానీ ఆ రాత్రి ఆమె చెవి దిద్దులు కనిపించకుండా పోతాయి. వీటిని తంగపొన్ను యవ్వనంలో ఉన్నప్పుడు, ఆమె ప్రేమికుడు బహుమతిగా ఇచ్చినవి. వీటికోసం ఆమె కుమార్తెలు ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటూ, జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు. ఆ గ్రామంలో హంగామా సృష్టిస్తారు. ఈ గొడవల మధ్య, ఒక ఇన్సూరెన్స్ ఆఫీసర్ ఎంట్రీతో, తంగపొన్ను లైఫ్ పాలసీ ద్వారా ఆమె పిల్లలకు భారీ డబ్బు వస్తుందని తెలుస్తుంది. చెవి దిద్దుల విషయం పక్కన పెట్టి, ఇక ఈ డబ్బు గురించి వాటాలు వేసుకుంటారు. ఈ సమయంలో ఆమె ప్రియుడు ఎవరో ఒక షాకింగ్ ట్విస్ట్ తో బయటకి వస్తుంది. క్లైమాక్స్ ఒక ఎమోషనల్ టచ్ తో ముగుస్తుంది. తంగపొన్ను ప్రియుడు ఎవరు ? తంగపొన్ను చెవి దిద్దుల గత స్టోరీ ఏమిటి ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్‌ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

Related News

OTT Movie : ఒంటరిగా ఉండే అమ్మాయి ఇంటికి రోజూ వచ్చే స్ట్రేంజర్… అర్ధరాత్రి అదే పని… వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్

OTT Movie : పాపం పసికూన… తల్లి శవంతో 2 రోజులు ఇంట్లోనే రెండేళ్ల పాప… టెన్షన్ తోనే పోతారు భయ్యా

Madharaasi OTT: మదరాసి ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది… ఎప్పుడంటే?

OTT Movie : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : అమ్మాయంటే పడి చచ్చే సోఫా… అబ్బాయిలు చెయ్యేస్తే చావే… ఇదెక్కడి దిక్కుమాలిన చేతబడి భయ్యా ?

OTT Movie : అమ్మాయిని వదలకుండా… సొంత తండ్రి నుంచి అద్దెకిచ్చిన ఓనర్ దాకా… క్లైమాక్స్ కి పిచ్చోళ్ళయిపోతారు మావా

OTT Movie : భార్య ఉండగా పెళ్ళైన మాజీ గర్ల్ ఫ్రెండ్ తో సీక్రెట్ గా… పక్క అపార్ట్మెంట్లోకి మారి ఆమె చేసే పనికి దిమాక్ ఖరాబ్

Big Stories

×