OTT Movie : టీచర్, స్టూడెంట్ ల కథలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఒక బాగా డబ్బున్న అమ్మాయి, సాహిత్యం మీద పట్టు పెంచుకోవాలని, ఒక స్కూల్ లో జాయిన్ అవుతుంది. అంతటితో ఆగకుండా, అక్కడ టీచర్ తో ఎఫ్ఫైర్ కూడా నడుపుతుంది. ఆతరువాత స్టోరీ ఒక రేంజ్ లో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘మిల్లర్స్ గర్ల్’ (Miller’s girl) 2024లో వచ్చిన ఒక అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమా. దీన్ని జేడ్ హ్యాలీ బార్ట్‌లెట్ డైరెక్ట్ చేశారు. ఇందులో జెన్నా ఒర్టెగా, మార్టిన్ ఫ్రీమాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. లయన్స్‌గేట్ ద్వారా 2024 జనవరి 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, 2024 ఫిబ్రవరి 16 నుండి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, HBO మ్యాక్స్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది. ఇది IMDbలో 5.2/10 రేటింగ్ ని పొందింది.
కైరో స్వీట్ అనే 18 ఏళ్ల యువతి బాగా రిచ్. ఒక మాన్షన్‌లో ఒంటరిగా నివసిస్తుంటుంది. ఆమె తల్లిదండ్రులు న్యాయ వాదులుగా ఎప్పుడూ బయటే సమయం గడుపుతుంటారు. సాహిత్యం పట్ల ఆమెకున్న మక్కువ, ఆమెను హైస్కూల్‌లో క్రియేటివ్ రైటింగ్ క్లాస్‌లో చేరేలా చేస్తుంది. అక్కడ ఆమెకు ఉపాధ్యాయుడిగా జోనాథన్ మిల్లర్ ఉంటాడు. కైరో సాహిత్య జ్ఞానం, మిల్లర్ రాసిన “అపోస్ట్రోఫీస్ అండ్ ఆంపర్‌సాండ్స్” పుస్తకం పట్ల ఆమెకున్న మక్కువ అతన్ని ఆకట్టుకుంటాయి. మిల్లర్ తన వివాహం తర్వాత రచనలు చేయడం మానేస్తాడు. అతని భార్య బీట్రిస్ కూడా ఒక విజయవంతమైన రచయిత్రి. అయితే మిల్లర్ ని ఎప్పుడూ కించ పరుస్తూ, అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తుంటుంది. దీని వల్ల అతను రచనలపై దృష్టి పెట్టలేక పోతాడు.
ఈ సమయంలో కైరో యేల్ యూనివర్శిటీ అడ్మిషన్ కోసం ఒక ఎస్సే రాయాల్సి ఉంటుంది. కానీ ఆమెకు తన జీవితంలో గొప్ప విజయం గురించి రాయడానికి ఏమీ దొరకదు. అయితే ఆమె స్నేహితురాలు విన్నీ, టీచర్ తో సంబంధం పెట్టుకోమని చెప్తుంది. కైరో మిల్లర్‌ను ఫాలో అవ్వాలని నిర్ణయించుకుంటుంది. వారిద్దరూ క్లాస్ బయట ఎక్కువ సమయం గడపడం మొదలెడతారు. సాహిత్యం, కవితలు, సంస్కృతిపై చర్చిస్తూ ఒకరినొకరు దగ్గరవుతారు. ఒక సందర్భంలో మిల్లర్ పొరపాటున కైరో ఫోన్‌ను తీసుకుంటాడు. ఇక్కడి నుంచి కథ ఊహించని మలుపులు తీసుకుంటుంది.
ఆమె అతన్ని తన ఇంటికి రమ్మని కోరుతుంది. కైరో సెక్సీ డ్రెస్‌లో అతనికి ఇంట్లో వెల్కమ్ చెప్తుంది. అదే సమయంలో అక్కడ వర్షం కూడా పడుతుంది. ఇక ఆగలేక ముద్దు కూడా పెట్టుకుంటారు. ఇక జరగాల్సిన కర్యక్రమాలు పూర్తవుతాయి. ఈ సంఘటనతో కైరో ఒక టీచర్, స్టూడెంట్ మధ్య సంబంధం గురించి ఒక ఎరోటిక్ కథ రాస్తుంది. ఇది చదివిన మిల్లర్ ఆశ్చర్యపోతాడు. కానీ ఈ కథ అకాడమిక్ కు సరిపోదని తిరస్కరిస్తాడు. కైరో అతని పై కోపంతో, ఆ కథను స్కూల్ వైస్ ప్రిన్సిపల్ జాయ్స్ మానర్‌కు పంపిస్తుంది. ఇక వీళ్ళ సంబంధం గురించి అనుమానాలు వస్తాయి. ఈ సంఘటన మిల్లర్ సస్పెన్షన్‌కు దారితీస్తుంది. కైరో మిల్లర్ ని మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆమె అతని హెడ్ కి ఏకాంతంగా గడిపిన ఫొటోలు కూడా పంపిస్తుంది. చివరికి ఈ పరిస్థితి నుంచి మిల్లర్ బయట పడతాడా ? ఆమె చేతిలో నలిగిపోతాడా ? అనే ప్రశ్నలకు సమాధానాలను, ఈ అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : ఊరికి దూరంగా విల్లా… యవ్వనాన్ని కాపాడుకోవడానికి మంత్రగత్తె అరాచకం… గుండె ధైర్యం ఉంటేనే చూడండి