OTT Movie : రియల్ సంఘటనలతో తెరకెక్కే కొన్ని సినిమాలు సోషల్ మెస్సేజ్ ని ఇస్తుంటాయి. వీటిలో కొన్ని స్టోరీలు గుండె తరుక్కుపోయేలా చేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, గ్రేటర్ నోయిడాలో ఉండే ఒక అపార్ట్మెంట్ లో రూపొందింది. ₹45 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రెండేళ్ల చిన్న పాప చుట్టూ తిరుగుతుంది. తల్లి చనిపోయాక, రెండురోజుల పాటు ఆ పాప పడ్డ నరకయాతన ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘Pihu’ వినోద్ కప్రీ దర్శకత్వం వహించిన హిందీ థ్రిల్లర్ సినిమా. ఇందులో మైరా విశ్వకర్మ, ప్రెర్ణా విశ్వకర్మ, హృషితా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2018 నవంబర్ 16న థియేటర్‌లలో విడుదలైంది. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్, జియో సినిమా, యూట్యూబ్ లలో ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డును గెలుచుకుంది.
పీహు అనే చిన్నారికి తన రెండవ పుట్టినరోజు ఘనంగా జరుగుతుంది. ఆ పార్టీ తర్వాత బంధువులు కూడా వెళ్ళిపోతారు. ఆమె తండ్రి గౌరవ్ కూడా ఒక కాన్ఫరెన్స్ కోసం కోల్‌కతాకు వెళ్తాడు. పీహు మరుసటి రోజు ఉదయం నిద్ర లేస్తుంది. కానీ తన తల్లి పూజాని చాలా సేపు లేపుతుంది. కానీ ఆమె మంచం మీద స్పందన లేకుండా పడి ఉంటుంది. పీహు తల్లి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే పీహు తన తల్లి నిద్రపోతున్నట్లు భావించి, ఆమెను లేపడానికి ప్రయత్నిస్తుంది. కానీ తల్లి ఉలుకు, పలుకు లేకుండా ఉంటుంది. ఆకలితో ఉన్న పీహు ఇంట్లో తిరుగుతూ, రోజువారీ ఉపయోగించే వస్తువులను వెతుకుతుంది. ఇవి ఆ చిన్న పాపకు ప్రమాదకరంగా మారతాయి. ఓవెన్‌లో రొట్టెలు కాల్చడానికి ప్రయత్నించి వేళ్లు కాల్చుకుంటుంది. రిఫ్రిజిరేటర్‌లో చిక్కుకుంటుంది. బాల్కనీ నుండి బొమ్మ కోసం వేలాడుతూ ప్రమాదకర స్థితిలో ఉంటుంది. ఈ సన్నివేశాలు ప్రేక్షకులకు ఉత్కంఠను కలిగిస్తాయి. ఈ చిన్న పాప ప్రతి సన్నివేశంలో ప్రమాదంలో పడుతుంది.
గౌరవ్ ఫోన్ చేసినప్పుడు పీహు మాట్లాడుతుంది. కాని ఆమె మాటలు అతనికి అర్థం కావు. తన భార్యతో జరిగిన చిన్నపాటి గొడవ కోసం క్షమాపణ చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆమె స్పందన లేకపోవడంతో అతనికి ఏదో తప్పు జరిగిందని అనుమానం కలుగుతుంది. ఇంతలో పీహు ఇంట్లో గీజర్‌ను ఆన్ చేస్తుంది, ఇది పేలడానికి కారణమవుతుంది. నీళ్ళు కూడా ఇంటి బయటకు వస్తాయి. రాత్రి సమయంలో, పొరుగు వాళ్ళు పొగ రావడం గమనించి ఇంటిని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తారు. గౌరవ్ చివరకు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఇల్లు గజిబిజిగా, కాలిపోయిన స్థితిలో ఉంటుంది. తన భార్య చనిపోయి, పీహు మంచం కింద బొమ్మలతో ఆడుకుంటూ బలహీనంగా కనిపిస్తుంది. ఈ సినిమా ఒక ఎమోషనల్ డెప్త్ తో ముగుస్తుంది. చివరికి పీహు తల్లి ఎందుకు చనిపోయింది ? చిన్న పాప అక్కడ ప్రమాదాలను తప్పించుకుంటూ ఎలా బతికింది ? అనే విషయాలను, ఈ సినిమాని చూసి తెలుసుకోండి.
Read Also : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ