Gundeninda GudiGantalu Today episode November 4th: నిన్నటి ఎపిసోడ్ లో..మీనా చేసిన చేపల పులుసుని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. చాలా బాగుంది ఇలాంటి చేపల పులుసుని నేను ఎప్పుడూ తినలేదు అని అందరూ పొగుడుతూ తింటారు. బాలు చాలా బాగా చేసింది అని మీనా పై ప్రశంసలు కురిపిస్తాడు.. అందరూ కూడా చాలా సంతోషంగా అన్నం తింటూ ఉంటారు. అప్పుడే ఇంట్లో కూర్చున్న మనోజ్ చూసి ప్రభావతి వచ్చావా నీతో మాట్లాడాలి రా అని పక్కకు తీసుకొని వెళుతుంది. డబ్బులు తీసుకొచ్చావా అంతా బాగానే జరిగింది కదా.. ఇదే నా సమస్య ఉందా అని ప్రభావతి అడుగుతుంది ఏమీ లేదమ్మా ప్రస్తుతానికైతే నేను బయటపడినట్టే అని మనోజ్ అంటాడు. మీనా ఏదో జరుగుతుంది తల్లి కొడుకులు ఏదో చేస్తున్నారు అని అంటుంది. ఇక రోహిణి చాలా సంతోషంగా మనోజ్ లక్షల సంపాదిస్తున్నాడని మురిసిపోతూ ఉంటుంది.. మనోజ్ ని వెధవ పార్కులో పడుకునేవాడు ఇలా చాలా మాటలు అన్నారు.. కానీ మనోజ్ ఇవాళ నాలుగు లక్షల అమ్మేసి ఒక లక్ష ని ఇంటికి తీసుకొచ్చాడు అంటుంది. అయితే ప్రభావతి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. బాలు ఏదో బాధ పడుతూ కనిపిస్తాడు. అయితే ఏమైందండీ ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంది మీనా. షీలా డార్లింగ్ వస్తుంది కదా అందుకే అని అనగానే అమ్మమ్మ వస్తే బాధ ఎందుకు సంతోషమే కదా అని అంటుంది. చిన్నప్పటినుంచి నాకు మా బామ్మ కి పుట్టినరోజుకి ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని కోరుకునేది. అయితే అప్పుడు డబ్బులు లేక కుదరలేదు ఇప్పుడు డబ్బులు కుదురుతాయో లేదో అని బాధపడుతూ ఉంటాడు.. ఒక బంగారు చైను కొనిద్దామని నేను అనుకుంటున్నాను నువ్వు ఏమంటావు మీనా అని అంటాడు. అమ్మమ్మకి కొనివ్వడం మంచిదే. నేను కోడలుగా అడుగు పెట్టిన తర్వాత నాకు భయాన్ని పోగొట్టింది అమ్మమ్మ అని మీనా కూడా బాలుకు సపోర్ట్ చేస్తుంది.
మీనా అమ్మమ్మకు ఇప్పటివరకు మనం ఏమీ చేయించలేదు కదా నాకు చాలా బాధగా ఉందండి.. ముగ్గురు మనవల్లుండి కూడా ఆమెకు ఒక బంగారు నగ కూడా చేయించుకోవడం నిజంగా బాధాకరం అనేసి మీనా అంటుంది.. నానమ్మకి అలాంటి ఆశలు ఏమీ లేవు కానీ మనం చేయిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని బాలు అంటాడు. ఈ విషయాన్ని వెళ్లి సత్యంతో చెప్తారు. మీనా నగలు ఉన్నాయి కదా నాన్న అవి ఎట్లా ఇప్పుడు వేసుకోవట్లేదు కదా వాటిని తాకట్టు పెట్టి శీల డార్లింగ్ కి గొలుసు కొందామని అంటాడు..
ఆ నగలను మీరు వద్దని అన్నారుగా అని అంటాడు.. ఇప్పుడు కావాలి అని అడుగుతారు. బాగానే ఉంది రా మీ అమ్మ రాని వచ్చిన తర్వాత ఆ నగలను తీసుకొని వెళ్లి తాకట్టు పెట్టి చైన్ కొనుక్కొని వద్దామని సత్యం అంటాడు.. బాలు నగలు కావాలని అడగడం మనోజ్ వింటాడు. ఈ విషయాన్ని వెంటనే కామాక్షి ఇంట్లో ఉన్న ప్రభావతికి చెప్పడానికి వెళ్తాడు.. కామాక్షి నువ్వు నీ కొడుకుని కవర్ చేసుకోవడానికి ఆ నగలను ఇచ్చావు. రేపు కావాలని వాళ్ళ అడిగితే ఏం చేస్తావో అని అంటుంది. వాళ్ళిప్పుడేం అడగట్లే ఆరు నెల తర్వాత మనోజ్ ఎలాగో తీసుకొచ్చేస్తారు అన్నాడు కదా అప్పుడు ఇచ్చేస్తాను అని ప్రభావతి అంటుంది..
మనోజ్ పరిగెత్తుకుంటూ ఆవేశపడుతూ వస్తాడు. అమ్మ నాన్నని నేను నగలు కావాలని అడుగుతుంది అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి షాప్ కొంచెం తేరుకొని అడుగుతుంది. దేవుడా ఇలా ఇరుక్కున్న ఏంట్రా బాబు అని ప్రభావతి అనుకుంటుంది. ఆ నగలను తీసుకురాకపోతే మనం కచ్చితంగా ఇరుక్కుంటాము అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అనగలు ఎక్కడ పెట్టావో వెళ్లి తీసుకురా అర్జెంటుగా లేకపోతే ఈ రోజు ఇవాళ మీ నాన్న చేతిలో నా పని అయిపోయినట్లే అని అంటుంది.
ఆ నగలనే నేను తాకట్టు పెట్టలేదమ్మా అమ్మేశాను అని మనోజ్ అనగానే ప్రభావతి ఫ్యుజులు ఎగిరిపోతాయి.. ఏంట్రా నువ్వు చెప్పేది ఏం మాట్లాడుతున్నావ్ రా కొంచమైనా బుద్ధుని మాట్లాడుతున్నావా అని ప్రభావతి అంటుంది.. అంతేకాదు మనోజ్ ని కొడుతుంది కూడా.. సరిపోయారు ఇద్దరు ఇద్దరే ఇప్పుడు ఏం చేస్తారు అని ప్రభావతి అడుగుతుంది. ముందు వెళ్లి ఆ నగలను తీసుకురా.. అప్పుడే నేను ఇంటికి వెళ్తాను అని ప్రభావతి అంటుంది. మనోజ్ నగల కోసం అని గోల్డ్ షాప్ కి వెళ్తాడు అక్కడ సేటు ఉన్నాడో లేదో తెలుసుకోవాలని ఫోన్ చేసి ఆ నగలు కావాలి నేను వస్తున్నాను అని అంటాడు.
Also Read :పెళ్ళై 20 ఏళ్లు.. అమ్మ పిలుపు లేదు..కన్నీళ్లు తెప్పిస్తున్న స్టోరీ..
ఎక్కడ నగలు వాటిని కరిగించేసాం కదా అని ఆ స్టేట్ అంటాడు. ఇప్పుడు చచ్చాను అని ప్రభావతి దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని చెప్తాడు. ఆ నగలు సేటు కరిగించేసాడంటమ్మా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని మనోజ్ అంటారు.. ప్రభావతి ఒక్కసారిగా షాప్ లోకి వెళ్లి పోతుంది. ఏదో ఒక విధంగా నగలను ఇద్దాం అనుకుంటుంది. ఎంత పని చేసావ్ రా నీ వల్ల నేను ఇరుక్కున్నాను కచ్చితంగా ఇది విషయం ఇంట్లో తెలిస్తే చంపేస్తారు అని ప్రభావతి టెన్షన్ పడుతూ ఉంటుంది.. వాటి ప్లేస్ లోకి గిల్ట్ వి తీసుకొచ్చి పెడుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో బాలు షాపుకు వెళ్లే అవి గిల్టు నగల అని తెలుసుకొని ఇంటికి ఆవేశంగా వస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..