OTT Movie : ఈ మధ్య హారర్ కామెడీ సినిమాలను ఆడియన్స్ బాగా ఆదరిస్తున్నారు. సినిమాని మొదలు పెడితే ఇక ఆపకుండా చూస్తూనే ఉంటున్నారు. వీటిని డిజిటల్ స్ట్రీమింగ్ లో అస్సలు మిస్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఒక పంజాబీ హారర్ కామెడీ సినిమా ఓటీటీలో ఆడియన్స్ ని ఆకట్టుకుంటోంది. ఫ్యామిలీతో ఎంచక్కా చూసి ఆనందిస్తున్నారు ప్రేక్షకులు. ఈ కథ ఆత్మహత్యకు ప్రయత్నించే ఒక వ్యక్తికి నాలుగు దెయ్యాలు కనిపిస్తాయి. ఆ దెయ్యాలు తమ కోరికలను తీర్చమని అతన్ని బలవంతం చేస్తాయి. ఈ క్రమంలో స్టోరీ కామెడీ ట్రాక్ లో వెళ్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
2024లో విడుదలైన ఈ పంజాబీ హారర్ కామెడీ చిత్రం పేరు “మిస్టర్ షుడై” (Mr. Shudai). హర్జోత్ సింగ్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇందులో హర్సిమ్రన్, మ్యాండీ థాకర్, కరంజిత్ అన్మోల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 2024జూన్ 21న థియేట్రికల్ గా విడుదలైన ఈ సినిమా, 2025 అక్టోబర్ 30 నుంచి JioTV, Amazon Prime Video, Chaupal ఓటీటీ ప్లాట్ ఫామ్‌లలో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా ప్రస్తుతం పంజాబీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది.
షుదాయ్ అనే పంజాబీ యువకుడు, ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్‌లో ఉంటాడు. ప్రస్తుతం అతని జీవితం కష్టాల్లో ఉంటుంది. ఉద్యోగం లేదు, భార్యతో గొడవలతో ఒక రోజు అతను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. రాత్రి సమయంలో ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్లి, గొంతు కోసుకోవడానికి బ్లేడ్ తీసుకుంటాడు. కానీ అక్కడే అతని జీవితం మలుపు తిరుగుతుంది. నాలుగు భూతాలు అతని ముందు కనిపిస్తాయి.
ఈ నలుగురు భూతాలలో ఒక సింగర్ భూతం, ఒక పాత బామ్మ, ఒక యువకుడు, ఒక చిన్న పిల్ల ఉంటారు. అందరూ వేర్వేరు కారణాలతో చనిపోయారు. అయితే వాళ్లకి ఒక్కొక్క కోరిక మిగిలిపోయి ఉంది. సింగర్ భూతానికి తన పాట రికార్డ్ అవ్వాలి, బామ్మకి తన మనవడు కాలేజీలో చేరాలి, యువకుడికి ప్రేమికురాలని చూడాలి, పిల్లకి ఒక ఆట బొమ్మ కావాలి. షుదాయ్ ఈ కోరికలు నెరవేర్చకపోతే, అతను చనిపోవడానికి ఈ భూతాలు అవకాశం ఇవ్వవు. అతన్ని ఇకపై టార్చర్ కూడా చేస్తాయి. దీంతో షుదాయ్ భయపడి, ఆ కోరికలను నెరవేర్చడానికి ఒప్పుకుంటాడు.
Read Also : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ