Harmanpreet Kaur: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 ( ICC Womens World Cup 2025) విజేతగా టీమిండియా గెలిచిన నేపథ్యంలో భారత దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని ఉంటాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ( Harmanpreet Kaur) ఈ విజయాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు. టైటిల్ గెలవగానే ఎగిరి గంతేసిన టీమ్ ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ ను దారుణంగా ట్రోలింగ్ చేశారు. టీమిండియా గెలిచిన ఆసియా కప్ 2025 ట్రోఫీని తీసుకువెళ్లిన మొహ్సిన్ నఖ్వీని ( Mohsin Naqvi) ఉద్దేశిస్తూ ఓ సంచలన వీడియో పెట్టారు హర్మన్‌ప్రీత్ కౌర్.
ఆసియా కప్ విజేతగా టీమిండియా నిలిచి దాదాపు రెండు నెలలు కావస్తోంది. అయినప్పటికీ ట్రోఫీని ఇవ్వకుండా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ నఖ్వీ కాలయాపన చేస్తున్నాడు. తన చేతుల మీదుగా టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అందుకోవాలని తిరకాసు పెడుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మహిళల వన్డే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, మొత్తం పాకిస్తాన్ పరువు తీసింది. వన్డే వరల్డ్ కప్ టైటిల్ పక్కన పెట్టుకొని, కప్పు కాఫీ తాగుతూ అదిరిపోయే ఫోజ్ ఇచ్చింది. టైటిల్ అంటే ఇది… మీలా పక్కోడి టైటిల్ దొంగిలించడం కాదు అన్న రేంజ్ లో ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చింది హర్మన్ ప్రీత్ కౌర్.
మీరు నిజంగా ఐసీసీ టోర్నమెంట్లు గెలవలేరు, మహా అంటే నా చేతిలో ఉన్న టీ కప్పు గెలుస్తారు కావచ్చు ? గెలవకపోయినా టీ కప్పునే ఐసీసీ టోర్నమెంట్ లాగా ఫీల్ అవుతారు.. లేకపోతే మా టీమ్ ఇండియాది దొంగతనం చేస్తారు అని అర్థం వచ్చేలా ఈ వీడియోను పెట్టింది హర్మన్‌ప్రీత్ కౌర్. దీంతో ఈ వీడియోను చూసిన టీమిండియా అభిమానులు తెగ కామెంట్స్ పెడుతున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ వీడియో చూసిన ఏసీసీ చైర్మన్ నఖ్వీ ఉరేసుకోవాల్సిందే అంటూ సెటైర్లు పేల్చుతున్నారు. పాకిస్తాన్ పరువు మొత్తం ఒక్క వీడియోతో మాటలు లేకుండా తీసేసిందని ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు టీమ్ ఇండియా అభిమానులు.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్స్ అద్బుతంగా ఆడిన టీమిండియా తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. దక్షిణాఫ్రికా జట్టును 52 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది టీమిండియా. గత వరల్డ్ కప్ లో ఫైనల్ లో చేసిన తప్పిదాలు పునరావృతం కాకుండా, ఈ సారి సక్సెస్ అయింది టీమిండియా. దీంతో దేశ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. ఇక ఛాంపియన్ గా నిలిచిన టీమిండియాకు రూ.39 కోట్లు ఐసీసీ, రూ.51 కోట్లు బీసీసీఐ ఇవ్వనుంది.
Harmanpreet Kaur trolls entire Pakistan 🤣❤️🔥 pic.twitter.com/LfvwAx6hB6
— News Algebra (@NewsAlgebraIND) November 3, 2025