OTT Movie : కన్నడ ఇండస్ట్రీ నుంచి మరో సస్పెన్స్ థ్రిల్లర్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. PRK ప్రొడక్షన్స్ లో దివంగత పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని నిర్మించారు. 1990ల నాటి స్టైల్ లో ఈ కథ ఉంటుంది. పదిహేను సంవత్సరాల క్రితం, కదంబ రాజవంశానికి చెందిన నిధిని వెలికితీసే క్రమంలో జరిగే సంఘటనలు, నమ్మకాలు, అతీత శక్తుల ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఇందులో ఏఐ యానిమేటెడ్ వెర్షన్ లో పునీత్ రాజ్‌కుమార్ ని చూపిస్తారు. దీంతో ఈ సిరీస్ ని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
దేవరాజ్ పూజారి దర్శకత్వంలో వచ్చిన ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు “మారిగల్లు” (Maarigallu). ఇందులో ప్రవీణ్ తేజ్, రంగయణ రఘు, గోపాలకృష్ణ దేశ్‌పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2025 అక్టోబర్ 31న ZEE5లో విడుదల అయింది. అయితే ఈ సిరీస్ ప్రస్తుతం తెలుగులో అందుబాటులో లేదు. ఇది కేవలం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది.
మారిగళ్ళు గ్రామంలో దట్ట అడవులు ఉంటాయి. ఇక్కడ మారి అనే దేవత ఉన్నట్లు చరిత్ర చెప్తుంది. ఈ ప్రాంతంలో కడంబ రాజవంశానికి చెందిన పురాతన ఖజానా దాచబడి ఉందని పురాణాలు చెబుతాయి. ఈ నిధికి ఆ దేవత కాపలా ఉన్నట్లు ప్రచారంలో ఉంటుంది. ఇక కథలో వరద అనే వ్యక్తి, ఈ నిధి కోసం ప్రయత్నిస్తూ ఒక పాత శాసనాన్ని కనుగొంటాడు. ఇది కడంబ రాజు మయూర శర్మకు చెందిన ఖజానా మార్గానికి క్లూ గా ఉంటుంది. వరద తన స్నేహితులు, కుటుంబంతో ఈ రహస్యాన్ని పంచుకుంటాడు. మొదట ఇది సంతోషకరమైన అడ్వెంచర్‌లా అనిపిస్తుంది.
Read Also : ఇన్ సెక్యూర్ అబ్బాయికి ఇద్దరమ్మాయిలతో… కితకితలు పెట్టే తమిళ కామెడీ మూవీ