OTT Movie : లీగల్ డ్రామాలు అంటే ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది ఆడియన్స్ కు. కోర్టు రూమ్ లో జరిగే వాదోపవాదనలు ఒక ఎత్తైతే, జరిగే నేరం, దాని ఇన్వెస్టిగేషన్ మరో ఎత్తు. ఇలాంటి లీగల్ డ్రామాలకు ట్విస్టులు యాడ్ అయితే ఇదే కదా అల్టిమేట్ సినిమా అని ఫీల్ అవుతారు ఆడియన్స్. అలాంటి ఓ అద్భుతమైన లీగల్ డ్రామా గత రెండు వారాలుగా ఓటీటీలో ట్రెండ్ అవుతుండడం విశేషం. మరి ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం పదండి.
తనూజా పుట్టాస్వామి, ప్రియాంకా రౌరి, వీర్ రెడ్డి, ఢిల్లీ గణేశన్, గిరిధర్, దయానంద్ రెడ్డి, లీల సామ్సన్ ప్రధాన పాత్రల్లో నటించిన కోర్ట్ రూమ్ డ్రామా ‘లీగల్లీ వీర్’. ఈ సినిమాకి రవి గోగుల దర్శకత్వం వహించగా, సిల్వర్ కాస్ట్ బ్యానర్ పై శాంతమ్మ మలికిరెడ్డి నిర్మించారు. గత ఏడాది డిసెంబర్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అక్టోబర్ 9 నుంచి పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లయన్స్‌గేట్ ప్లేలో ‘లీగల్లీ వీర్’ మూవీ అందుబాటులో ఉంది. రిలీజ్ అయిన దగ్గర్నుంచే ఈ మూవీ టాప్ 5 ట్రెండింగ్ ఒకటిగా నిలవడం విశేషం. ఈ చిత్రం లయన్స్‌గేట్ ప్లేలో తెలుగు, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరో గుడ్ న్యూస్ ఏంటంటే డిసెంబర్ 10 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి రాబోతోంది.
ఈ సినిమా హీరో వీర్ రెడ్డి రియల్ లైఫ్ లో వృత్తిరీత్యా లాయర్. అందుకే లీగల్ థ్రిల్లర్ సినిమా చేయాలని భావించిన ఆయన, ఈ సినిమాలో హీరోగా నటించారు. మలికిరెడ్డి వీర్ రెడ్డి తన తండ్రికి నివాళిగా తెరకెక్కించిన ఈ చిత్రంలో కోర్టు సన్నివేశాలను రియల్ లైఫ్ లో ఎలా ఉంటాయో అలా చూపించడం గమనార్హం. ఒక మర్డర్ మిస్టరీ తో పాటు తండ్రి కొడుకుల సెంటిమెంట్, ఇండియా వచ్చిన ఒక ఎన్నారైకి ఎదురైన కష్టాలు ఈ సినిమాలో మెయిన్ పాయింట్స్.
Read Also : 8000 లీటర్ల బ్లడీ బ్లడ్ బాత్… బ్రూటల్ క్లైమాక్స్ మావా… గుండె ధైర్యం ఉంటేనే ఈ హర్రర్ మూవీని చూడండి
స్టోరీలోకి వెళ్తే… వీర్ రాఘవ అమెరికన్ బిజినెస్ మ్యాన్. అతని భార్య ప్రియా యాక్సిడెంట్‌లో చనిపోతుంది. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన వీర్, దాని నుంచి బయట పడడానికి ఇండియాకి వచ్చి, తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేస్తాడు. ఇక్కడే లాయర్ గా కొత్తగా కెరీర్ ను స్టార్ట్ చేస్తాడు. అయితే అతను తీసుకున్న ఓ మర్డర్ కేసు సెన్సేషనల్ గా మారుతుంది. జూనియర్ లాయర్ మర్డర్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వంటి షాకులతో ఈ కేస్ కఠినంగా ఉంటుంది. మరి పోలీసులు, పొలిటీషియన్స్ కలిసి ఈ కేసులో ఇరికించిన అమాయకున్ని వీర్ నిర్దోషిగా ఎలా నిరూపించాడు అన్నదే స్టోరీ.