OTT Movie : ఒకప్పుడు మలయాళం సినిమాలంటే మమ్ముట్టి, మోహన్ లాల్ పేర్లే వినిపించేవి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ హీరోల ముఖాలను మాత్రమే గుర్తు పట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు చాలా మంది టాలెంట్ ఆర్టిస్ట్ లు మలయాళం ఇండస్ట్రీలో ఉన్నారు. ఇప్పుడు వీళ్లందరి స్టైల్ ని మనవాళ్ళు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ మలయాళం హీరోలలో కుంచాకో బోబన్ వైవిధ్యమైన సినిమాలనే ఎంచుకుంటున్నాడు. ఈ హీరో సినిమాలను చూడటానికి ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ హీరో నయనతారతో కలసి నటించిన ఒక సినిమా, సస్పెన్స్ తో ఆడియన్స్ మైండ్ ని మడత పెడుతుంది. ఈ కథ ఒక పిల్లవాడి మర్డర్ స్టోరీలు వింటూ, ఒక పోలీసు ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ తో నడుస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘నిజల్’ (Nizhal) 2021లో వచ్చిన మలయాళం మిస్టరీ థ్రిల్లర్ సినిమా. అప్పూ ఎన్. భట్టతీరి దీనికి మొదటి సారిగా దర్శకత్వం వహించారు. ముఖ్య పాత్రల్లో కుంచాకో బోబన్, నయన తార, ఇజిన్ హాష్, రోనీ డేవిడ్, సైజు కురుప్, దివ్య ప్రభా ఉన్నారు. 1 గంట 32 నిమిషాలు ఉన్న ఈ సినిమా ఐయండిబిలో 6.3/10 రేటింగ్ పొందింది. 2021 ఏప్రిల్ 30న ఈ సినిమా ahaలో విడుదల అయింది.
జాన్ (కుంచాకో బోబన్) అనే పోలీసు ఆఫీసర్ కి ఒక పెద్ద ప్రమాదం జరుగుతుంది. దీంతో అతను శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతుంటాడు. అతను హాస్పిటల్‌లో రికవర్ అవుతుంటే, నితిన్ అనే 10 ఏళ్ల పిల్లవాడిని కలుస్తాడు. నితిన్ చాలా ఇంటెలిజెంట్, మర్డర్ స్టోరీలు చెప్పడానికి ఇష్టపడతాడు. జాన్ మొదట నితిన్ మాటలు ఆసక్తిగా వింటాడు. నితిన్ చెప్పే స్టోరీలు రియల్ మర్డర్ కేసులు లాగా ఉంటాయి. జాన్ ఈ స్టోరీలు వాస్తవమా, కలలా అని డౌట్ పడతాడు. జాన్ హాస్పిటల్‌లో ఆ పిల్లాడి స్టోరీలు విని గందరగోళంలో పడతాడు. జాన్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. అయినా కూడా అతను నితిన్ స్టోరీలు మరిచిపోలేక పోతాడు.
Read Also : ఓటీటీలో గత్తర లేపుతున్న 1 గంట 52 నిమిషాల థ్రిల్లర్ డ్రామా… క్షణక్షణం ఉత్కంఠ… IMDb లో 7.1 రేటింగ్