Araku Tribals Protest: ఆంధ్రా ఊటి అరకులో గిరజనులు ఉరితాళ్లతో నిరసనలు తెలుపుతున్నారు. తమకు జీవనాధారమైన భూమిపై అటవీ శాఖ పెత్తనంపై తిరుగుబాటు చేస్తున్నారు. అరకు లోయలో మాడగడ వ్యూ పాయింట్ అందాలు, అక్కడ సంపదపై అటవీ శాఖ అధికారులు తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తుండడంపై.. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాడగడ వ్యూ పాయుంట్ నుంచి చూస్తే మేఘాలు భూమి కింద ఉన్నట్లు కనిపిస్తుంటాయి.
అరకు వెళ్లే టూరిస్టులు ఖచ్చితంగా మాడ గడ వ్యూపాయింట్ సందర్శిస్తేనే.. పర్యటన పూర్తయినట్లు భావిస్తారు. అలాంటి చోటును అటవీ శాఖ తమ సొంత అంటోంది. అయితే పూర్వికుల నుండి వంశపార్యపరంగా అక్కడ ఉంటున్న ఆ భూమి మాదేనని గిరిజనులు అంటున్నారు. అటవీ రెవెన్యూ శాఖల తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ.. గిరిజనులు ఉరితాళ్లతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆరు వందల కుటుంబాలకు జీవన ఆధారమైన మాడగడ వ్యూ పాయింట్ అటవీ శాఖ స్వాధీనం చేసుకుని.. కేవలం 15 మందికి ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారని గిరిజనులు వాపోతున్నారు.
అల్లూరి జిల్లా కలెక్టర్ స్పందించకపోతే మాడగడకు టూరిస్టులను రానివ్వమని గిరిజనులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కొన్ని టూరిస్ట్ వాహనాలను అడ్డుకోవడంతో, పర్యాటక రంగంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
Also Read: తాగి డ్రైవింగ్ చేసేవాళ్లంతా టెర్రరిస్టులే సజ్జనార్ సంచలనం
గిరిజనుల డిమాండ్లు నెరవేరకపోతే, రోడ్డు మూసివేత, టూరిస్టుల అడ్డుకోవడం వంటి చర్యలు తీవ్రతరం అవుతాయని హెచ్చరికలు వినిపిస్తున్నాయి.
అరకు పర్యాటక ఆర్థిక వ్యవస్థలో మాడగడ కీలకం. ఏటా లక్షలాది మంది టూరిస్టులు ఇక్కడికి వస్తారు. గిరిజనుల ఆందోళన కొనసాగితే, టూరిజం రంగం భారీగా నష్టపోనుంది. ఈ సమస్యకు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థానిక గిరిజనులతో చర్చలు జ
రపాలని నిపుణులు సూచిస్తున్నారు.