OTT Movie : ఫ్యామిలీ ఫీల్ గుడ్ స్టోరీలను ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. ఈ సినిమాలు మంచి కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తాయి. తండ్రి, కొడుకుల లవ్ స్టోరీ తో మంచి మెసేజ్ ఇచ్చే ఒక ఫ్యామిలీ డ్రామా మూవీ, ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
ఈ ఫీల్ గుడ్ మూవీ పేరు ‘లైక్ ఫాదర్ లైక్ సన్‘ (Like father like son). ఈ జపనీస్ మూవీకి హిరోకాజు కొరే దర్శకత్వం వహించారు. ఇందులో మసహరు ఫుకుయామా తన మొదటి తండ్రి పాత్రలో నటించాడు. ఈ మూవీ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కూడా ప్రదర్శించబడింది. 2013 శాన్ సెబాస్టియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో, టీవీ ఆడియన్స్ అవార్డును పొందింది. ఈ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతుంది.
స్టోరీ లోకి వెళితే
హీరో తన ఉద్యోగాన్ని ఎక్కువగా ప్రేమిస్తుంటాడు. ఇలా కుటుంబంతో కూడా టైమ్ స్పెండ్ చేసే సమయం కూడా తక్కువగా ఉంటుంది. ఒకరోజు కొడుకుని స్కూల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళ్లి, పని ఐపోగానే అటుగా ఉద్యోగానికి వెళ్తాడు. హీరోకి కొడుకు పుట్టిన హాస్పిటల్ నుంచి ఒక ఫోన్ వస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళాక డాక్టర్లు మతిపోయే విషయాన్ని ఒకటి చెప్తారు. అదేమంటే ఇప్పుడు ఉన్న కొడుకు వేరే వాళ్ళ అబ్బాయి అని, పిల్లలు పుట్టినప్పుడు నర్సు ఇద్దరిని మార్చేసిందని చెప్తాడు. ఈ విషయం విని చాలా బాధపడతాడు హీరో. డిఎన్ఏ టెస్టులకు కూడా సిద్ధమవుతాడు. మరో ఫ్యామిలీ అక్కడికి వచ్చి, కొద్ది కొద్దిగా పిల్లల్ని అలవాటు చేసుకుని మార్చుకుందామని డిసైడ్ అవుతారు. ఒకరి పిల్లల్ని మరొకరితో కొద్దిరోజులు ఉండాలని పిల్లలతో చెప్పి మార్చుకుంటారు. అయితే హీరో దగ్గర డబ్బు బాగా ఉంటుంది కానీ, కొడుకుతో సమయం తక్కువగా గడుపుతాడు. మరో ఫ్యామిలీకి డబ్బు అంతగా ఉండకపోయినా, ముగ్గురు పిల్లలతో అతడు చాలా హ్యాపీగా ఉంటాడు.
ఈ క్రమంలో హీరో ఒక ఆలోచన చేస్తాడు. తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి, అతనికి డబ్బు ఇచ్చి తన కొడుకుని కూడా నా దగ్గరే పెట్టుకోవాలని ఆలోచిస్తాడు. అయితే ఆ ఫ్యామిలీ అందుకు ఒప్పుకోదు. తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే, పిల్లల్ని సంతోషంగా ఎలా పెంచాలో నాకు తెలిసి అంటూ తగేసి చెప్తాడు. మరోవైపు కొడుకు కూడా వాళ్లతో చాలా హ్యాపీగా ఉంటాడు. సొంత కొడుకు కూడా తన దగ్గర కన్నా, వాళ్లతోనే హ్యాపీగా ఉంటాడు. ఇది చూసి హీరో చాలా బాధపడతాడు. చివరికి హీరో దగ్గరకి సొంత కొడుకు వస్తాడా? పిల్లలు ఎవరి దగ్గర ఉండటానికి ఇష్టపడతారు? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ఫ్యామిలీ డ్రామా మూవీని మిస్ కాకుండా చూడండి.