Game Changer Collections : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్.. కొలీవుడ్ డైరెక్టర్ శంకర్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలైన మొదటి ఆట నుండే నెగటివ్ టాక్ ని దక్కించుకొని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిన విషయం తెలిసిందే.. సంక్రాంతి సెలవుల్లో విడుదలైన ఈ సినిమాకి సరైన పాజిటివ్ టాక్ వచ్చి ఉండుంటే వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేది.. ఈ మూవీ రిలీజ్ అయ్యి ఆరు రోజులు అయ్యింది. మొదటి రోజు భారీగా వసూల్ చేసిన మూవీ ఆ తర్వాత కొంచెం కొంచెం పెరుగుతూ వచ్చాయి. ఇక ఆరు రోజుల్లో ఎన్ని కోట్లు వసూల్ చేసిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రామ్ చరణ్ కెరీర్ లో ‘గేమ్ చేంజర్’ చిత్రం మూడవ వంద కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టిన సినిమాగా సరికొత్త చరిత్ర సృష్టించింది. వంద కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టి, కమర్షియల్ గా డిజాస్టర్ రేంజ్ లో నిల్చిందంటే, ఈ సినిమా రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన మూవీ గేమ్ ఛేంజర్.. జనవరి 10 న మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇవాళ థియేటర్లలోకి వచ్చిన మూవీ యావరేజ్ టాక్ ను అందుకుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ పై పబ్లిక్ రెస్పాన్స్ మిశ్రమంగా ఉంది. ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ లో కొంచెం ల్యాగ్ ఉందనే టాక్.. అలాగే అక్కడక్కడా సీన్స్ జనాల అంచనాలను మించిపోయాయి. సెకండ్ ఆఫ్ లో కొన్ని సీన్స్ హైలెట్ గా నిలిచాయి.. ఇక రామ్ చరణ్ వన్ మ్యాన్ షో గా శంకర్ చూపించారని టాక్ వినిపిస్తున్నాయి. మొత్తానికి ఒకవైపు యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఈ కలెక్షన్స్ మాత్రం బాగానే వసూల్ చేశాయి..
గేమ్ చేంజర్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా గేమ్ ఛేంజర్ మూవీ రూ. 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్టు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఇక ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రెండో రోజు రూ. 21.6 కోట్లు, మూడు రోజు రూ.17 కోట్టు, నాలుగవ రోజు రూ. 8.50 కోట్లు, ఐదవ రోజు రూ. 10.19 కోట్లు వసూలు చేసింది గేమ్ ఛేంజర్.. ఇక ఆరో రోజు గేమ్ ఛేంజర్ మూవీకి ఆశించిన వసూల్ రాబట్టలేదని తెలుస్తుంది. గేమ్ ఛేంజర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ. 3.88 కోట్లు వసూలు చేసింది. గేమ్ ఛేంజర్ ఆరు రోజుల్లో గేమ్ ఛేంజర్ మూవీ నెట్ కలెక్షన్లు రూ.110.03 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు మార్నింగ్, మాట్నీ షోల వివరాలు మాత్రమే. ఇక ఫస్ట్ షో, సెకండ్ షో కలెక్షన్స్ వివరాలు రాలేదు.. మొత్తానికి 500 కోట్లకు చేరువలో ఉంది. ఏ మాత్రం రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి. ఇక ప్రొడ్యూసర్ దిల్ రాజు తన కెరీర్ లో హైయ్యేస్ట్ బడ్జెట్ పెట్టి తీసిన సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజ్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు..