E-Paper
Advertisement

Malayalam Thrillers OTT : హాట్ స్టార్ లో ఉన్న 5 బెస్ట్ మలయాళం థ్రిల్లర్స్… ఇందులో మీరెన్ని చూశారు ?

Malayalam Thrillers OTT : హాట్ స్టార్ లో ఉన్న 5 బెస్ట్ మలయాళం థ్రిల్లర్స్… ఇందులో మీరెన్ని చూశారు ?
Advertisement

Malayalam Thrillers OTT : ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌లలో జియో హాట్‌స్టార్ సౌత్ సినిమాలకు బాగా ప్రసిద్ధి చెందింది. క్రైమ్ థ్రిల్లర్‌లు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అత్యంత ప్రజాదరణ పొందిన జోనర్ లో ఒకటిగా నిలిచిపోతున్నాయి. ఈ సినిమాలు అందించే థ్రిల్ హిందీ సినిమాలకు మించి ఉంటోంది. ఇక మలయాళం థ్రిల్లర్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. వీటికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు తయ్యా రైనారు. ఇప్పుడు జియో హాట్‌స్టార్‌లో టాప్ ట్రెండింగ్ లో ఉన్న 5 మలయాళ థ్రిల్లర్స్ గురించి తెలుసుకుందాం.

‘రోంత్’ (Ronth)

షాహి కబీర్ దర్శకత్వం వహించిన మలయాళ సినిమా, ఒక హత్య రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నించే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరుగుతుంది. దిలీష్ పోతన్, రోషన్ మాథ్యూ వంటి నటులు రోనంత్‌లో కీలక పాత్రలు పోషించారు. జియో హాట్‌స్టార్‌లో అందుబాటులో ఉన్న ఈ సినిమా క్లైమాక్స్ వరకు కట్టిపడేస్తుంది.

‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys)

Advertisement

ఇది జియో హాట్‌స్టార్‌లో ఎక్కువ వ్యూస్ తో నడుస్తున్న సర్వైవల్ థ్రిల్లర్. సౌబిన్ షాహిర్ నటించిన ఈ చిత్రం, స్నేహితులలో ఒకరి ప్రాణాలను కాపాడటానికి కష్టపడే నిజ జీవిత సంఘటన ఆధారంగా రూపొందింది. 2024లో వచ్చిన ఈ సినిమా పరవ ఫిల్మ్స్ బ్యానర్‌పై సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ నిర్మించగా, చిదంబరం దర్శకత్వం వహించాడు. సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి ఎస్. పొదువల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2024 ఫిబ్రవరి 22న థియేటర్లలో విడుదలై ఏప్రిల్ 5 నుండి జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను తెలుగులో మైత్రి మూవీ మేకర్స్ విడుదల చేసింది. ఇక రెండువందల కోట్లకు పైగా కలెక్షన్లు సృష్టించి మలయాళ ఇండస్ట్రీలో రికార్డులు బద్దలు కొట్టింది.

‘లోక చాప్టర్ 1 – చంద్ర’ (Lokah Chapter 1- Chandra)

గత సంవత్సరం వచ్చిన ఈ సూపర్ హీరో సినిమా, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 300 కోట్లకు పైగా కలెక్షన్లు సృష్టించి రికార్డులను తిరగరాసింది. నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం దేశీయంగా, అంతర్జాతీయంగా గట్టి కలెక్షన్లను సాధించింది. ఇది జియో హాట్‌స్టార్ లో తప్పక చూడవలసిన చిత్రంగా మారింది.

‘పడక్కలం’ (Padakkalam)

Advertisement

మలయాళంలో సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌లను చసే వాళ్ళు కూడా, పడక్కలం వంటి ఫాంటసీ కామెడీలను కూడా ఆదరించారు. ఇది ప్రేక్షకులను బాగా అలరించింది కూడా. ఒక కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఈ కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ తర్వాత ఇది ఒక సంచలనాన్ని సృష్టించింది.

‘తుడరం’ (Thudaram)

సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన ఈ సినిమా అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్లలో ఒకటిగా నిలిచిపోయింది. ‘దృశ్యం’ తరహాలో మరోసారి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇది థియేటర్లలోనే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో కూడా తప్పక చూడవలసిన చిత్రంగా మిగిలిపోయింది.

Read Also :  హనీమూన్ కు వెళ్లిన జంట మర్డర్… అపరిచితుడి ఎంట్రీతో ఆగం ట్విస్ట్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×