E-Paper
Advertisement

Mystery Thriller OTT : హనీమూన్ కు వెళ్లిన జంట మర్డర్… అపరిచితుడి ఎంట్రీతో ఆగం ట్విస్ట్

Mystery Thriller OTT : హనీమూన్ కు వెళ్లిన జంట మర్డర్… అపరిచితుడి ఎంట్రీతో ఆగం ట్విస్ట్
Advertisement

Mystery Thriller OTT : క్రైమ్ థ్రిల్లర్‌లను ప్రేక్షకులు ఇప్పుడు తెగ చూసేస్తున్నారు. ట్విస్ట్‌లతో ఫుల్ ఎంగేజింగ్ గా ఉంటున్నాయి ఈ సిరీస్ లు. ఇక తెలుగులో కూడా ఈ జోనర్ సిరీస్ లు ఉత్కంఠభరితమైన మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రాధికా శరత్‌కుమార్, సాయి కుమార్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటించిన ఒక వెబ్ సిరీస్, ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు థ్రిల్లర్ ఆడియన్స్ ని కూడా కట్టిపడేసింది. కొత్తగా పెళ్ళైన ఒక జంట హత్య చుట్టూ ఈ సిరీస్ తిరుగుతుంది. ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఇంటెన్స్ గా ఉంటుంది.  దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …

ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే

2022లో విడుదలైన ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘గాలివాన’ (Gaalivaana). ఇది BBC ఒరిజినల్ సిరీస్ ‘వన్ ఆఫ్ అస్’ (One of Us) కు రీమేక్. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో వహించిన ఈ వెబ్ సిరీస్ లో రాధికా శరత్‌కుమార్, సాయి కుమార్, చాందిని చౌదరి, చైతన్య కృష్ణ, నందినీ రాయ్ ప్రధాన పాత్రలు పోషించారు. మొత్తం 7 ఎపిసోడ్‌లు ఉన్న ఈ సిరీస్ ZEE5 ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇయండిబిలో ఇది 6.5/10 రేటింగ్ పొందింది.

Advertisement

Read Also :  తెల్లారితే పెళ్లి… నైట్ కి నైట్ వధూవరులు జంప్… కడుపుబ్బా నవ్వించే కామెడీ మూవీ

స్టోరీ ఏమిటంటే

అజయ్, గీత చాలా కాలం నుంచి ప్రేమలో ఉంటారు. ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయినా పెళ్లి కూడా చేసుకుంటారు. ఇక హనీమూన్ కూడా విజయవంతంగా జరుపుకుని ఇంటికి తిరిగి వస్తారు. అంత బాగుందనుకున్న తరుణంలో ఈ కొత్త జంట దారుణంగా హత్యకు గురవుతారు. అదే రోజు రాత్రి ఒక ప్రమాదంలో గాయపడిన ఒక వ్యక్తి, ఆ జంట ఉంటున్న ఇంటికి వస్తాడు. అతను ఆ జంటను చంపిన హంతకుడని ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. అయితే మరుసటి రోజు ఉదయం ఆ హంతకుడు కూడా శవమై కనిపిస్తాడు. అసలు ఆ జంటను అతను ఎందుకు చంపాడు? ఆ హంతకుడిని చంపింది ఎవరు? ఈ క్రమంలో ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న రహస్యాలు ఎలా బయటపడ్డాయి అనేదే ఈ సిరీస్ కథ. థ్రిల్లర్ ఫ్యాన్స్ కి ఈ సిరీస్ వర్త్ వాచ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతీ ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్లు వస్తూనే ఉంటాయి.

Tags

Related News

మనుషుల్ని చీమల్లా మార్చే వైరస్… వణుకు పుట్టించే కొరియన్‌ జాంబీ థ్రిల్లర్‌

సింగిల్‌ లైఫ్‌ ఎంజాయ్‌ చేద్దామనుకుంటే… ప్రేమ, పెళ్లి గోలతో కొత్త చిక్కులు… ఓటీటీలోకి రొమాంటిక్‌ కామెడీ

సామాన్యులపై జరిగే దోపిడీని కళ్లకు కట్టిన క్రైమ్‌ థ్రిల్లర్‌… పోలీస్ వ్యవస్థ బాగోతం బట్టబయలు

న్యాయంపై నమ్మకం పోయిన లాయర్‌… ఓ అనుమానాస్పద మరణంతో మారిన కథ… క్రైమ్‌ థ్రిల్లర్‌ స్ట్రీమింగ్

చిన్న వయసులోనే పెద్ద టార్గెట్‌… హాకీ కోసం ఇంత కష్టమా భయ్యా… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్‌ డాక్యుమెంటరీ

చిన్న స్థాయి నుంచి మ్యూజిక్‌ సెన్సేషన్‌గా… కోట్లాది హృదయాలను గెలిచిన సింగర్ స్టోరీ

జైలు నుంచి వచ్చి మాఫియా సామ్రాజ్యాన్ని నిర్మించే డాన్‌… నాలుగో సీజన్‌ రచ్చ రచ్చ

కొత్త ఇంట్లో అడుగుపెట్టిన ఫ్యామిలీ… గోడల వెనుక దాగిన భయంకరమైన రహస్యం… వెన్నులో వణుకు పుట్టించే హారర్‌ థ్రిల్లర్‌

Big Stories

Advertisement
×