BigTV English
Advertisement

OTT Movie : స్టాంప్ వేసి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్… మైథలాజికల్ టచ్ తో పిచ్చెక్కించే సైకో సిరీస్

OTT Movie : స్టాంప్ వేసి కిరాతకంగా చంపే సీరియల్ కిల్లర్… మైథలాజికల్ టచ్ తో పిచ్చెక్కించే సైకో సిరీస్

OTT Movie : చరణ్‌దాస్‌పూర్‌లో దారుణ హత్యలు జరుగుతుంటాయి. ఈ మర్డర్స్ ఒక పురాతన కల్ట్ తో కనెక్ట్ అయివుంటాయి. ఇద్దరు డిటెక్టివ్స్‌ దీని వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టడానికి ప్రయత్నిస్తారు. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. క్రైమ్-మిస్టరీ ఫ్యాన్స్‌కి ఇదొక గ్రిప్పింగ్ స్టోరీ. రీసెంట్ గా ఓటీటీలో ఈ సిరీస్ దూసుకుపోతోంది. ఇది మిథాలజీ, క్రైమ్, సైకలాజికల్ సస్పెన్స్‌ని మిక్స్ చేసిన ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్ ఇండియన్ థ్రిల్లర్. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో

‘Mandala Murders’ 2025లో రిలీజ్ అయిన హిందీ క్రైమ్-మిస్టరీ-థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను, గోపీ పుత్రన్ (మర్దానీ ఫేమ్) సృష్టించి, మనన్ రావత్‌తో కలిసి డైరెక్ట్ చేశారు. వాణీ కపూర్, వైభవ్ రాజ్ గుప్తా, సుర్వీన్ చావ్లా, శ్రియా పిల్గాంకర్, జమీల్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో వచ్చింది. మొత్తం 8 ఎపిసోడ్‌లతో 304 నిమిషాల రన్‌టైమ్ ఉంటుంది. IMDbలో ఈ సిరీస్ కి 7.5/10 రేటింగ్ ఉంది. ఇది 2025 జూలై 25 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చింది.


Read Also : ఏం సిరీస్ రా బాబూ… డెడ్లీ సీక్రెట్స్ దాచే భార్యల గ్యాంగ్… ఒక్కో ట్విస్ట్ కు బుర్రపాడు

స్టోరీలోకి వెళితే

ఈ సిరీస్ ఫిక్షనల్ టౌన్ అయినటువంటి చరణ్‌దాస్‌పూర్‌లో జరుగుతుంది. ఇక్కడ రిచువలిస్టిక్ మర్డర్స్ జరుగుతుంటాయి. చనిపోయిన వాళ్ళ బాడీ పార్ట్స్ కూడా మిస్సింగ్‌ అవుతుంటాయి. దీంతో కిల్లర్ కి ఎవరితోనో ఒక సీక్రెట్ లింక్ ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ కేస్‌ని సాల్వ్ చేయడానికి ఇద్దరు డిటెక్టివ్స్ ను అధికారులు నియమిస్తారు. రియా థామస్ అనే ఒక CIB ఆఫీసర్ ను, విక్రమ్ సింగ్ అనే ఒక సస్పెండెడ్ ఎక్స్-కాప్ టీమ్ అప్ అవుతారు. ఈ మర్డర్స్ కి, ఒక పురాతన కల్ట్ కి లింక్ ఉంటుంది. ఈ కల్ట్ ‘మండల’ సింబల్స్‌తో రిచువల్స్ చేస్తూ, ఒక ప్రొఫెసీని నెరవేర్చడానికి ఇలా హత్యలు చేస్తుంటుంది.

విక్రమ్ సింగ్, డిల్లీ పోలీస్ నుంచి సస్పెండ్ అయి, తన హోమ్‌టౌన్ చరణ్‌దాస్‌పూర్‌కి వస్తాడు. అక్కడ జరిగిన ఒక మర్డర్ కేస్ లో బాడీ పార్ట్స్ మిస్సింగ్, తన పాస్ట్‌తో కనెక్ట్ అయినట్లు కనిపిస్తుంది. అతను తన పాత పార్టనర్‌తో జరిగిన ట్రాజెడీని గుర్తు చేసుకుంటూ, ఈ కేస్‌లో డీప్‌గా ఇన్వాల్వ్ అవుతాడు. రియా థామస్ సిటీ నుంచి చరణ్‌దాస్‌పూర్‌కి వచ్చిన CIB ఆఫీసర్. ఈ మర్డర్స్‌లో ఒక ప్రిన్సెస్ ఐడెంటిటీ గురించి అనుమానాలు వస్తాయి. రియా తన ఫియర్స్‌ని విక్రమ్‌తో షేర్ చేస్తూ, కేస్‌లో డీప్ గా వెళ్తుంది.

ఈ కిల్లింగ్స్ వెనుక శతాబ్దాల చరిత్ర ఉంటుంది. సుర్వీన్ చావ్లా ఒక లోకల్ పొలిటీషియన్‌గా, శ్రియా పిల్గాంకర్ ఒక బ్రైడ్ లుక్‌లో ఓకల్ట్ సింబల్స్‌తో కనిపిస్తారు. వీళ్ళు ఈ కల్ట్ తో లింక్‌ లో ఉంటారు. ఈ సిరీస్ ప్రెజెంట్ డే, 7 ఇయర్స్ , 20 ఇయర్స్ , 50 ఇయర్స్ అగో టైమ్‌లైన్స్ మధ్య సీమ్‌లెస్‌గా షిఫ్ట్ అవుతుంటుంది. చివరి ఎపిసోడ్‌లో రియా, విక్రమ్ ఈ సీక్రెట్ కల్ట్ ని రన్ చేస్తున్న మాస్క్డ్ ఫిగర్ ఐడెంటిటీని రివీల్ చేస్తారు. ఆతరువాత కొన్ని భయంకరమైన సంఘటనలు జరుగుతాయి. చివరికి ఈ కల్ట్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి ? మనుషుల పార్ట్స్ ఎందుకు మాయం అవుతున్నాయి ? రియా, విక్రమ్ ఈ కేసును ఎలా ఎదుర్కుంటారు ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

OTT Movie : టెంపుల్‌లో కోనేరు మిస్టరీ… ఆ వాటర్ తాగితే పరలోకానికే… కనిపెట్టిన డాక్టర్‌కు బుర్రబద్దలయ్యే షాక్

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

OTT Movie : సైతాన్ మతంలోకి మారే నన్… నెక్స్ట్ ట్విస్టుకు గూస్ బంప్స్… గుండె ధైర్యం ఉంటేనే చూడండి

Big Stories

×