OTT Movie : మర్డర్ మిస్టరీ, రిచ్ హౌస్‌వైవ్స్ సీక్రెట్స్, పొలిటికల్ క్లాష్‌లతో తెరకెక్కిన ఒక థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఓటీటీలో టాప్ లేపుతోంది. రీసెంట్ గా వచ్చిన ఈ సిరీస్ లో హైలైట్ ట్విస్టులు ఎన్నో ఉన్నాయి. ఇందులో కొంతమంది ధనిక మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడతారు. ఆ తరువాత వీళ్ళు చేసే రచ్చ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పడానికి కూడా కష్టంగానే ఉంటుంది. వీళ్ళు చేసే పనులను స్టోరీలో తెలుసుకుందాం పదండి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
నెట్‌ఫ్లిక్స్‌లో
‘The Hunting Wives’ 2025లో విడుదలైన అమెరికన్ డ్రామా-థ్రిల్లర్ టీవీ సిరీస్. 2021లో మే కాబ్ రచించిన నవల ఆధారంగా రెబెక్కా పెర్రీ కట్టర్ దీనిని సృష్టించారు. ఇది స్టార్జ్ కోసం మొదట తీసినా, లయన్స్‌గేట్, స్టార్జ్ విడిపోవడంతో నెట్‌ఫ్లిక్స్‌లో 2025 జూలై 21న 8 ఎపిసోడ్‌లతో ప్రీమియర్ అయింది. ఇందులో బ్రిటనీ స్నో, మాలిన్ ఆకర్‌మన్, డెర్మాట్ మల్రోనీ, జైమీ రే న్యూమాన్, క్రిస్సీ మెట్జ్, కేటీ లోవ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ సైకలాజికల్ థ్రిల్లర్, సోప్ ఒపెరా, సోషల్ కామెంటరీ థీమ్స్‌తో కూడిన ఒక ఫాస్ట్-పేస్డ్ మర్డర్ మిస్టరీ. IMDbలో 6.5/10, Rotten Tomatoesలో 75% రేటింగ్ ఇది కలిగి ఉంది.
Read Also : తప్ప తాగి పబ్లిక్ టాయ్ లెట్ లో గుండె పగిలే పని… ఆ సీన్స్ కు గూస్ బంప్స్… కలలోనూ వెంటాడే కొరియన్ కథ
స్టోరీలోకి వెళితే
సోఫీ ఒక మాజీ పొలిటికల్ ప్రొఫెషనల్. తన భర్త గ్రాహం, 7 ఏళ్ల కొడుకు జాక్ తో కలిసి మసాచుసెట్స్ నుంచి ఈస్ట్ టెక్సాస్‌లోని ఫిక్షనల్ టౌన్ మేపుల్ బ్రూక్‌కి మారుతుంది. గ్రాహం ఆర్కిటెక్ట్‌గా ధనవంతుడైన ఒక ఆయిల్ మాగ్నెట్. గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న జెడ్ బ్యాంక్స్ కోసం కొత్త హెడ్‌క్వార్టర్స్ డిజైన్ చేయడానికి వర్క్ తీసుకుంటాడు. సోఫీ ఈ కొత్త రిచ్, కన్సర్వేటివ్ టౌన్‌లో సోషల్ యాంగ్జైటీతో స్ట్రగుల్ చేస్తూ, ఒంటరిగా ఫీల్ అవుతుంతుంది. సోఫీ ఒక NRA ఫండ్‌రైజర్ ఈవెంట్‌లో జెడ్ బ్యాంక్స్ భార్య అయిన మార్గో బ్యాంక్స్ ను కలుస్తుంది. మార్గో “హంటింగ్ వైవ్స్” అనే ఎలైట్ గ్రూప్‌కి లీడర్. ఇందులో కాలీ, జిల్, మోనే, టేలర్ వంటి రిచ్ హౌస్‌వైవ్స్ ఉంటారు. ఈ గ్రూప్ హార్డ్-పార్టీయింగ్, రిపబ్లికన్-సపోర్టింగ్, యాంటీ-అబార్షన్, యాంటీ-ఇమ్మిగ్రెంట్ వంటి వాటిని పాటిస్తుంటుంది. మార్గో తన గ్లామరస్ సెడక్టివ్ వరల్డ్‌లోకి సోఫీని లాగుతుంది. ఇక లేట్-నైట్ వైల్డ్ పార్టీలతో సోఫీ జీవితం ఒక రోలర్‌కోస్టర్ అవుతుంది.
సిరీస్ ఒక ఫ్లాష్-ఫార్వర్డ్‌తో మొదలవుతుంది. ఒక బ్లాండ్ మహిళ అడవిలో షూటింగ్‌లో చనిపోతుంది. సోఫీ మార్గోతో ఎమోషనల్‌గా ఇన్వాల్వ్ అవుతుంది. అంతేకాకుండా తనతో ఎఫ్ఫైర్ కూడా పెట్టుకుంటుంది. ఇది కాలీకి జెలసీ కలిగిస్తుంది, ఎందుకంటే కాలీ మార్గోని లవ్ చేస్తుంటుంది. జిల్ కొడుకు బ్రాడ్ ఒక బాస్కెట్‌బాల్ ప్లేయర్, తన తల్లితో వింత ఎమోషనల్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. అబ్బీ అనే లో-క్లాస్ అమ్మాయితో డేటింగ్ చేస్తుంటాడు. దీన్ని జిల్, అబ్బీ తల్లి వ్యతిరేకిస్తారు.
మొదటి మూడు ఎపిసోడ్‌లలో, ఒక టీనేజ్ అమ్మాయి (అబ్బీ) అడవిలో మర్డర్ అవుతుంది. సోఫీ సస్పెక్ట్ అవుతుంది. డిటెక్టివ్ సలాజర్ ఇన్వెస్టిగేషన్ మొదలెడుతుంది. సోఫీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. మార్గోతో ఆమె ఒబ్సెషన్, హంటింగ్ వైవ్స్ సీక్రెట్స్, జెడ్ పొలిటికల్ క్యాంపెయిన్, కుంభకోణాలు, ఎఫైర్స్, జెలసీలతో కథ ట్విస్ట్‌లతో నడుస్తుంది. అబ్బీని చంపింది ఎవరు ? సోఫీ ఇందులో నుంచి బయటపడుతుందా ? ఈ కథలో వచ్చే ట్విస్టులు ఏమిటి ? అనే విషయాలను ఈ సిరీస్ ను చూసి తెలుసుకోండి.