OTT Movies : ఓటీటిలోకి ఎన్నో రకాల కంటెంట్ మూవీలను మనం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా హారర్ సినిమాలు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఆ తర్వాత బోల్డ్ కంటెంట్ సినిమాలు రిలీజ్ అవుతుంటారు. అయితే ఎలాంటి కంటెంట్ సినిమాలు వచ్చిన కూడా ఇక్కడ మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి. మలయాళ సినిమాలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో అందరికి తెలుసు. గత ఏడాది, ఈ ఏడాది రిలీజ్ అవుతున్న ప్రతి మూవీ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా మంజు వారియర్ చేసిన ఓ మూవీ ఓటీటిలో స్ట్రీమింగ్ అవుతుంది. పిల్లలతో చూడటం కష్టమే అంటున్నారు. మరి ఆ మూవీ పేరేంటి? ఎక్కడ చూడొచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
ఫుటేజ్ మూవీలో మంజు వారియర్‌తో పాటు విశాఖ్ నాయర్, గాయత్రి అశోక్ కీలక పాత్రలు పోషించారు. ఈ ముగ్గురి పాత్రల నేపథ్యంలోనే సినిమా కథ మొత్తం సాగుతుంది. ఫుటేజ్ మూవీకి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ప్రజెంటర్ గా వ్యవహరించాడు.. ఇక అన్వేషిప్పిన్ కండేతుమ్, అంజమ్ పాథిరా, అండ్రాయిడ్ కుంజప్పన్‌తో పాటు మలయాళంలో పలు సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన సైజు శ్రీధరన్ ఫుటేజ్ మూవీకి దర్శకత్వం వహించాడు.. ఇదే ఆయన మొదటి సినిమా కావడం విశేషం.. మంజు వారియర్ యాక్టింగ్, ఫౌండ్ ఫుటేజ్ టెక్నిక్‌తో పాటు కాన్సెప్ట్ బాగుందంటూ కామెంట్స్ వినిపించాయి. విశాఖ్, గాయత్రి లవ్ స్టోరీలో బోల్డ్, లిప్‌లాక్ సీన్స్ ఎక్కువగా ఉండటంపై ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి విమర్శలు అందుకుంది. గత ఏడాది అక్టోబర్ 18న ఫుటేజ్ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఇప్పటికి ట్రెండ్ అవుతూనే ఉంది.
స్టోరీ విషయానికొస్తే..
ఈ ఫుటేజ్ మూవీ మొత్తం వీడియో రికార్డింగ్ ఫార్మేట్ లో సాగుతుంది.. ఈరోజు సినిమా కథ కొత్తగా ఉంటుంది. లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటికే పరిమితమవుతారు. విశాఖ్, గాయత్రి యూట్యూబర్స్ లివింగ్‌రిలేషన్ లో ఉంటారు. వాళ్ళు ఉంటున్న అపార్ట్మెంట్లో ఒక మహిళ ఒంటరిగా ఉంటుంది. ఎక్కువగా ఎవరితోనో కలవదు. అయితే ఆ మహిళ అలా ఒంటరిగా ఉండడానికి కారణం ఏదైనా ఉందా అనేది యూట్యూబ్ ద్వారా ఈ ప్రపంచానికి తెలియచేయాలని ఈ జంట అనుకుంటారు. ఆ తర్వాత ఆమెనుండి ఇన్ఫర్మేషన్ రాబట్టి యూట్యూబ్లో ప్రసారం చేస్తారా లేక ఏవైనా కారణాలు ఎదురయ్యి మధ్యలోనే వీళ్ళు ఆగిపోతారు అన్నది ఈ సినిమాలోనే చూడాలి. ఏది ఏమైనా కూడా ఈ సినిమాలో బోల్డ్ సీన్లు ఎక్కువగా ఉండటంతో కొంతవరకు విమర్శలు కూడా అందుకుందనే చెప్పాలి.. మహిళ ఫ్లాట్‌లోకి సీక్రెట్‌గా ఎంటర్ అవుతారు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి? ఆ ఫ్లాట్ నుంచి వారు ప్రాణాలతో బయటపడ్డారా లేదా అన్నదే ఈ మూవీ కథ.. ఒకరి పర్మిషన్ లేకుండా వాళ్ళ జీవితంలోకి ఎంటర్ అవ్వడం తప్పు అని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ మెసేజ్ ని అందించాడు.