E-Paper
Advertisement

Mythological Thriller OTT : IMDbలో 9 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ కోసం రైళ్లు ఆగిపోయాయి… ప్రధానమంత్రి ర్యాలీని రద్దు చేశారన్న విషయం తెలుసా ?

Mythological Thriller OTT : IMDbలో 9 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ కోసం రైళ్లు ఆగిపోయాయి… ప్రధానమంత్రి ర్యాలీని రద్దు చేశారన్న విషయం తెలుసా ?
Advertisement

Mythological Thriller OTT : ఇప్పుడంటే ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ట్రెండింగ్ మూవీస్ తెలుస్తున్నాయి. ఒకప్పుడు ఓటీటీలు అందుబాటులో లేని టైమ్ లో టీవీలు రాజ్యం ఏలాయి. అప్పట్లో టీవీ సీరియల్స్ కు ఇప్పుడు సిరీస్ లకు ఉన్నదానికంటే ఎక్కువగానే క్రేజ్ ఉండేది. నచ్చిన సీరియల్ వస్తుందంటే చాలు ప్రజలు అన్నీ పక్కన పడేసి, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చూసేవారు. దేశం మొత్తాన్ని షేక్ చేసిన అలాంటి ఒక సీరియల్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

ఇప్పటి తరం ఆడియన్స్ ను “పంచాయత్,” “గుల్లక్,” “ది ఫ్యామిలీ మ్యాన్”, “పాతాళ్ లోక్” వంటి కొత్త వెబ్ సిరీస్‌ లు ఆకర్షిస్తున్నాయి, కానీ 90లలో దేశంలోని ప్రతీ మూలన మారుమ్రోగిన ఒక టీవీ షో ఉంది. COVID-19 మహమ్మారి సమయంలో రీరిలీజ్ చేస్తే బుర్రపాడు రెస్పాన్స్ దక్కింది దానికి. టెలివిజన్ సీరియల్స్ ప్రపంచంలో దీనికే IMDbలో 9 రేటింగ్‌ ఉండడం విశేషం. మనం ఇప్పుడు దూరదర్శన్ పాపులర్ సీరియల్ “రామాయణం” గురించి మాట్లాడుతున్నాము. ఇది కేవలం ఒక టీవీ షో కాదు. దాని సృష్టికర్త రామానంద్ సాగర్‌ను అమరత్వంలోకి తెచ్చిన సీరియల్.

Advertisement

రామానంద్ సాగర్ ఇప్పుడు మన మధ్య లేకపోయినా, “రామాయణం” అనే పేరు ప్రస్తావించినప్పుడల్లా ఆయన ఫేస్ గుర్తుకు వస్తుంది. దూరదర్శన్ ప్రసిద్ధ టీవీ సీరియల్ “రామాయణం” మొదటిసారి 1987 జనవరి 25న ప్రసారం అయింది. చివరి ఎపిసోడ్ 1988 జూలై 31న వచ్చింది. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు దూరదర్శన్‌లో ప్రసారం అయ్యేది. మొత్తం 78 ఎపిసోడ్‌లుగా నడిచింది. రామానంద్ సాగర్ రచన, నిర్మాణం, దర్శకత్వం వహించిన ఈ సీరియల్ మహర్షి వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందింది. ఇందులో శ్రీరాముడి జీవితం, వనవాసం, సీత అపహరణ, రావణుడితో అతని యుద్ధం, చివరికి అయోధ్యకు తిరిగి రావడం, పట్టాభిషేకం వంటి అంశాలను అద్భుతంగా చూపించారు. ఈ సీరియల్ ధర్మం, సత్యం, త్యాగం, గౌరవం అనే ఆదర్శాలను ప్రతి ఇంటికి తీసుకువచ్చింది. ఇందులో అరుణ్ గోవిల్ శ్రీరాముడిగా, దీపిక చిఖాలియా సీతగా, సునీల్ లాహిరి లక్ష్మణుడిగా, దారా సింగ్ హనుమంతుడిగా, అరవింద్ త్రివేది రావణుడి పాత్రలో నటించారు. ‘రామాయణం’ కేవలం ఒక టీవీ షో మాత్రమే కాదు, భారతీయ టెలివిజన్ చరిత్రలో ఒక బిగ్గెస్ట్ మైలురాయిగా మారింది.

Read Also : పెళ్లయ్యాక భార్య అమ్మాయి కాదని తెలిస్తే… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ భయ్యా

రాజీవ్ గాంధీ ర్యాలీ రద్దు

Advertisement

“రామాయణం” దాని సృష్టి నుండి ప్రసారం వరకు ఈ సీరియల్ ప్రయాణం అద్భుతం. ఈ కార్యక్రమం టెలివిజన్‌ లో ప్రదర్శితం అయినప్పుడు, ప్రతి ఇంటిలోనూ టీవీ ఉండేది కాదు. అయినప్పటికీ, ప్రతి ఆదివారం ఉదయం శ్రీరాముని దైవిక కార్యాలను వీక్షించడానికి ప్రజలు ఆ టైమ్ లో ఒకే దగ్గర గుమిగూడేవారు. వీధులు ఖాళీగా మారేవి. పండుగ వాతావరణం కంపించేది. “రామాయణం” ప్రభావం సాధారణ ప్రజలకు మాత్రమే పరిమితం కాలేదు. ఇది దేశ రాజకీయాలు, పరిపాలనపై కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది. టాక్ ప్రకారం, మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ “రామాయణం” కారణంగా తన ర్యాలీలలో ఒకదాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. ఓ ఇంటర్వ్యూలో రామానంద్ సాగర్ కుమారుడు ప్రేమ్ సాగర్, ఉత్తరప్రదేశ్‌లో రాజీవ్ గాంధీ ర్యాలీ ఆదివారం ఉదయం 9 గంటలకు జరగాల్సి ఉందని గుర్తుచేసుకున్నాడు. అయితే, “రామాయణం” అదే సమయంలో ప్రసారం అవుతుందని తెలుసుకున్న తర్వాత, ఆ సమయంలో ఎవరూ హాజరు కాలేరని నమ్మి ర్యాలీని రద్దు చేసుకున్నాడని సమాచారం.

రామాయణం పట్ల ఉన్న క్రేజ్ ఎంత తీవ్రంగా ఉండేదంటే దాని ప్రభావం రైల్వేలపై కూడా కనిపించింది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ రైల్వే స్టేషన్‌లో ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు రైళ్లు ఆలస్యంగా నడిచేవి. రైల్వే ఉద్యోగులు, ప్రయాణీకులు స్టేషన్‌లోని వెయిటింగ్ రూమ్‌లో టీవీలో కలిసి రామాయణం చూసేవారని వెల్లడైంది. ఆసక్తికరంగా ఆ టీవీని రైల్వే సిబ్బంది విరాళాల ద్వారా కొన్నారట.

Tags

Related News

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

పిల్లల కోసం అండర్‌వరల్డ్‌ను షేక్ చేసిన తల్లి… క్షణక్షణం నెయిల్ బైటింగ్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×