BigTV English

OTT Movie : వరుస హత్యలతో పోలీసులకే సవాల్ విసిరే సైకో కిల్లర్…. మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్ మూవీ

OTT Movie : వరుస హత్యలతో పోలీసులకే సవాల్ విసిరే సైకో కిల్లర్…. మెంటలెక్కించే మలయాళం థ్రిల్లర్ మూవీ

OTT Movie : మలయాళం నుంచి వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు ఇప్పుడు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఒకప్పుడు ఈ సినిమాలను మన ప్రేక్షకులు పెద్దగా చూసేవాళ్ళు కాదు. ఈమధ్య మలయాళం ఇండస్ట్రీ నుంచి మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. వీటిలో సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాయి. అటువంటి ట్విస్ట్ లతో సాగిపోయే ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.


హాట్ స్టార్ (hotstar)

ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘21 గ్రామ్స్‘ (21 grams). 18 మార్చి 2022న థియేటర్‌లలో విడుదలైన ఈ మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీకి బిబిన్ కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అనూప్ మీనన్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఇందులో రెంజీ పనికర్, లియోనా లిషోయ్, అను మోహన్, అజి జాన్, చందునాథ్ జి నాయర్, రంజిత్ ప్రముఖ పాత్రలు పోషించారు. వరుసగా జరుగుతున్న హత్యలను ఛేదించే క్రమంలో ఒక పోలీస్ ఆఫీసర్ ఈ కేసును ఇన్వెస్టిగెట్ చేస్తాడు. ఈ మూవీ విమర్శకుల నుండి సానుకూల ప్రశంసలు అందుకుంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ (hotstar) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

నందన్ అనే పోలీస్ ఆఫీసర్ అంజలి మర్డర్ కేస్ ను ఇన్వెస్టిగేషన్ చేస్తాడు. ఈ కేసుకు సంబంధించి అందరిని కలుసుకుంటాడు నందన్. కొంతమంది వ్యక్తులపై అనుమానం వచ్చినా, ఆధారాల కోసం పోలీస్ ఆఫీసర్ వెతుకుతూ ఉంటాడు. అయితే అనుమానం వస్తున్న కొంతమంది వ్యక్తులు వరుసగా చనిపోతూ ఉంటారు. వీళ్ళను ఎవరు చంపుతున్నారో తెలియక సతమతమవుతాడు ఇన్స్పెక్టర్. అంజలికి మార్టిన్ అనే ఒక బ్రదర్ ఉంటాడు. మార్టిన్ కు అంజలి ఒక వీడియో కాల్ చేసి ఉంటుంది. అందులో ఆమె హాస్పిటల్లో కొన్ని రహస్యాలు తనకు తెలుసని మార్టిన్ తో చెప్తుంది. వాటికి సంబంధించిన ఫైల్స్ తన దగ్గర ఉన్నాయని, ఈ విషయం హాస్పిటల్ వాళ్లకు తెలిసిపోయిందని, నన్ను వాళ్ళు చంపడానికి చూస్తున్నారని ఆ వీడియో కాల్ లో ఉంటుంది. అదే రోజు ఆమెను గుర్తుతెలియని వ్యక్తులు చంపేస్తారు.

మార్టిన్ విదేశాల నుంచి వచ్చాక అతన్ని కూడా చంపేస్తా రు. పోలీస్ ఆఫీసర్ నందన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇదంతా చేస్తుందని గ్రహిస్తాడు. అయితే హాస్పిటల్ మేనేజ్మెంట్ హెడ్ ని కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తి  చంపేస్తాడు. వీళ్ళను చంపుతున్న వ్యక్తి కోసం పోలీస్ ఆఫీసర్ వేట కొనసాగిస్తాడు. ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్ దిమ్మతిరిగే విషయాలు వెలుగులోకి తెస్తాడు. చివరికి ఆ పోలీస్ ఆఫీసర్, ఆ క్రిమినల్ ని పట్టుకుంటాడా? అంజలిని ఎందుకు చంపారు? వరుసహత్యలను ఎవరు చేస్తున్నారు? ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే హాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ’21 గ్రామ్స్’ (21 grams) అనే ఈ  సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను చూడాల్సిందే.

Tags

Related News

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Big Stories

×