BigTV English

Kiara Advani : ఒక్క పోస్ట్ తో అడ్డంగా బుక్కయిన కియారా.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

Kiara Advani : ఒక్క పోస్ట్ తో అడ్డంగా బుక్కయిన కియారా.. ఆడేసుకుంటున్న నెటిజన్స్..

Kiara Advani : బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు పరిచయమే.. గతంలో కొన్ని సినిమాలు చేసింది. ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్లను షురూ చేశారు మేకర్స్. అందులో భాగంగానే ఇటీవల అమెరికాలో బిగ్ ఈవెంట్ నిర్వహించగా.. ‘ధోప్’ అనే పాటను కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ ‘ధోప్’ పాటలో హీరో హీరోయిన్లు చేసిన డాన్స్ మూమెంట్స్ పై ట్రోలింగ్ నడుస్తోంది.. దీనిపై ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో నెటిజన్స్ ఓ రేంజులో ఆడేసుకుంటున్నారు. ఆ పోస్ట్ లో ఏముందంటే..


గేమ్ ఛేంజర్ మూవీ నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన ‘ధోప్’ పాటకు సంబంధించిన ప్రాక్టీస్ సెషన్ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో “ఈ ధోప్ సాంగ్ ను డైరెక్టర్ శంకర్ చాలా గొప్పగా సినిమాను చూపిస్తున్నారు. ఓ మూవీ సాంగ్ కోసం ఫస్ట్ టైమ్ 13 రోజులు షూటింగ్ లో పాల్గొన్నాము. ఇక సెట్ లో ఉన్నప్పుడు నేను డిస్నీల్యాండ్ లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యాను. జానీ మాస్టర్ స్టెప్స్ కంపోజ్ చాలా బాగుంది. అయన నెంబర్ వన్.. ఆయన కంపోజ్ చేసిన పాటలు ఎంతగా హిట్ అయ్యాయో అందరికి తెలిసిందే.. ఇక రామ్ చరణ్ తో కలిసి డాన్స్ చేయడం అంటే కచ్చితంగా ఫన్ గా ఉంటుంది” అంటూ పోస్ట్ చేసింది. అయితే ఇందులో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ తో పాటు జానీ మాస్టర్ ని ట్యాగ్ చేసింది.. ఆ పోస్ట్ వైరల్ అవ్వడంతో దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఒక వ్యక్తిని తన పోస్టులో ట్యాగ్ చేయడంతో ఆమెపై మండిపడుతున్నారు. లైంగిక ఆరోపణలతో జైలుకెళ్లిన జానీ మాస్టర్ నుంచి తాను ఎంత నేర్చుకుందో తెలియజేస్తూ పోస్ట్ చేసింది చూడండి అంటూ కామెంట్స్ చెయ్యడంతో కియారా అలెర్ట్ అయ్యింది. దాంతో ఆ పోస్ట్ లో జానీ మాస్టర్ పేరును తీసేసింది. కానీ ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదని తెలుస్తుంది. ఇప్పుడు జైలుకు వెళ్ళబోతున్న వ్యక్తి గురించి ఇలాంటి మాట్లాడటం తప్పు అని హిత బోద చేస్తున్నారు. ఇక మాస్టర్ కు నార్త్ వరకు అన్ని సినిమాల్లోనూ సాంగ్స్ లో తన మార్క్ చూపిస్తున్నారు.. మాస్టర్ డ్యాన్స్ స్టెప్స్ కు ఫ్యాన్స్ ఎక్కువే.. ఇప్పటివరకు మాస్టర్ ‘స్త్రీ 2’లో ‘ఆయీ నాయ్’ అనే పాటకు, ‘బేబీ జాన్’లో ‘నైన్ మాటక్క’ సాంగ్ కు కొరియోగ్రఫీ అందించారు. గతంలో ‘పుష్ప: ది రైజ్’, ‘బీస్ట్’లో ‘అరబిక్ కుతు’ సాంగ్ కి , ‘జైలర్’లో ‘కావాలయ్యా’ పాటకు, ‘అఖియాన్ బాతోన్ మే ఐసా ఉల్ఝా జియా’ పాటలకు డ్యాన్స్ కంపోజ్ చేశారు. గతంలో ఆయన ఎన్ని హిట్ సాంగ్స్ ఇచ్చినా కూడా ఇటీవల ఆయన పై వస్తున్న ఆరోపణలతో చాలా మంది ఆయనను దూరం పెట్టినట్లు తెలుస్తుంది. ఇక తాజాగా మాస్టర్ పై వచ్చిన లైంగిక ఆరోపణలు నిజం అని పోలీసులు చార్జ్ షీట్ లో పేర్కొన్నారు. ఇక ఆయనను మళ్లీ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి.


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×