OTT Movie : ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కువగా సినిమాలు చూస్తుంటారు మూవీ లవర్స్. వీటిలో కొన్ని సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. అటువంటి సినిమాలు ఒక మెసేజ్ ని కూడా ఇస్తాయి. ఒక పెళ్లయిన మహిళ ఇంట్లో ఎదుర్కొనే సమస్యలతో చనిపోవాలనుకుంటుంది. ఈమెకు మరొక అమ్మాయి తోడుగా నిలుస్తుంది. డిఫరెంట్ కంటెంట్ తో వచ్చిన ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
రెండు ఓటిటిలలో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే బెంగాలీ మూవీ పేరు ‘క్రిస్ క్రాస్‘(Criss cross). ఈ మూవీ ఇద్దరు అమ్మాయిల చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటిటి ఫ్లాట్ ఫామ్ హోచొయి (hoichoi), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
ఐరా, రోహన్ ఇద్దరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఐరా వర్క్ బిజీలో ఎక్కువగా ఉంటుంది. రోహన్ ఏ పని పాట లేకుండా ఇంటి దగ్గరే ఉంటాడు. పెళ్లి వయసు దాటిపోతూ ఉండటంతో ఇంట్లో వాళ్ళు ఐరాని పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఐరా బిజీగా ఉండటంతో పెళ్లి వాయిదా వేస్తూ వస్తుంది. ఎలాగైనా ఈసారి పెళ్లి చేయాలని ఇంట్లో పెద్దలు నిర్ణయించుకుంటారు. పెళ్లి డేట్ అనౌన్స్ చేయడానికి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేస్తారు. అయితే ఐరా కి ఒక సమస్య వస్తుంది. జాబ్ చేసే కంపెనీలో, జీవితంలో సక్సెస్ సాధించిన ఒక మహిళ గురించి ఆర్టికల్ రాయమంటారు. ఐరా చాలా మంది పేరున్న మహిళలను వెతుకుతుంది. వాళ్లలో తనకి ఎవరూ అంతలా మంచిగా అనిపించరు. ఇలా వెతుకుతున్న క్రమంలో రూపా అనే మహిళ ఒక బిల్డింగ్ నుంచి దూకటానికి సిద్ధంగా ఉంటుంది. ఇది గమనించిన ఐరా ఆమె దగ్గరికి వెళ్లి విషయం తెలుసుకుంటుంది. రూప మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ గా ఉంటుంది. భర్తకి పిల్లలు పుట్టే భాగ్యం ఉండదు. ఎంత ప్రయత్నించినా అతను అందులో చాలా వీక్ గా ఉంటాడు. మరోవైపు ఇంట్లో మరిది తనతో గడపమని ఒత్తిడి చేస్తుంటాడు.
ఈ క్రమంలో రూపకి క్యాన్సర్ ఉందని తెలుస్తుంది. మూడు నెలల కన్నా ఎక్కువగా బతకదని డాక్టర్లు రూపతో చెప్తారు. ఇంటికి వచ్చిన రూపని మరిది రెచ్చగొడుతూ ఉంటాడు. కోపంతో ఊగిపోయిన రూప మరిదిని బాగా కొడుతుంది. ఇంట్లో వాళ్ళు అందరూ మరిదికి సపోర్ట్ చేస్తారు. ఈ సన్నాసులతోనా నేను ఇన్ని రోజులు ఉన్నది అనుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది రూప. ఈ క్రమంలో చనిపోవడానికి సిద్ధపడుతుంది. రూప స్టోరీ ఐరా విన్న తర్వాత, మూడు నెలలు నీకోసం హ్యాపీగా బ్రతుకు అంటూ మోటివేషన్ చేస్తుంది. చివరికి రూప సూసైడ్ ఆలోచన విరమించుకుంటుందా? ఐరా తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘క్రిస్ క్రాస్'( Criss cross) అనే ఈ బెంగాలీ మూవీని చూడాల్సిందే.