Param Sundari on OTT : జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘పరం సుందరి’ ఓటీటీలోకి వచ్చేసింది. దాదాపు యాభై కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వంద కోట్ల మార్క్ కు చేరింది. నెల రోజుల తరువాత డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఒక ప్రముఖ ఓటీటీ సంస్థ సొంతం చేసుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా రెంటల్ బేసిస్ విధానంపై అందుబాటులోకి వచ్చింది. రూ.349 రెంట్ పే చేసి మూవీని చూడొచ్చు. ఈ సినిమాని ఏ ఓటీటీలో చూడవచ్చు ? కథ ఏమిటి ? అనే విషయాలను కూడా తెలుసు కుందాం పదండి.
‘పరం సుందరి’ అనే హిందీ రొమాంటిక్ సినిమా తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కింది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, సంజయ్ కపూర్, మన్జోట్ సింగ్, ఇనాయత్ వర్మా ప్రధాన పాత్రల్లో నటించారు. 2025 ఆగస్టు 29న థియేటర్లలో వచ్చిన ఈ సినిమా, అక్టోబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఢిల్లీలో ఉండే పరం అనే అబ్బాయి బాగా రిచ్. తండ్రి డబ్బుతో జల్సాలు చేస్తుంటాడు. అయితే ఏదైనా సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటాడు. ఒక డేటింగ్ యాప్ లో భారీగా డబ్బు ఇన్వెస్ట్ చేయాలనుకుంటాడు. దీనికి అతని తండ్రి ఒక కండిషన్ పెడతాడు. ఈ సమయంలోనే ఒక మ్యాచ్ మేకింగ్ యాప్ లో సుందరి అనే కేరళ అమ్మాయిని చూస్తాడు. సుందరి కేరళలో ఒక చిన్న హోమ్‌స్టే బిజినెస్ నడుపుతుంటుంది. ఆమెను కలవడానికి పరం డిల్లీ నుంచి కేరళకు వెళ్తాడు. మొదట వాళ్ల మధ్య కల్చర్ తేడాలు, ఫన్నీ గొడవలు వస్తాయి. కానీ కలిసి టైమ్ స్పెండ్ చేస్తూ, వాళ్లు ఒకరినొకరు ఇష్టపడతారు.
Read Also : లాటరీ డబ్బుతో అమ్మాయిలతో జల్సా… నరాలు జివ్వుమనే సీన్స్… ఒంటరిగా చూడాల్సిన మూవీ
పరం, సుందరి మధ్య ప్రేమ, కేరళ అందాలతో మొదలవుతుంది. సుందరికి తల్లిదండ్రులు లేకపోవడంతో ఆమె బంధువులు పెళ్లి బాధ్యతను తీసుకుంటారు. ఆమె కేరళ సాంప్రదాయాన్ని ఎక్కువగా ఫాలో అవుతుంటుంది. పరం నార్త్ నుంచి వచ్చినవాడు కావడంతో సుందరి ఫ్యామిలీకి వీళ్ళ ప్రేమ మీద కొన్ని అనుమానాలు కూడా వస్తాయి. కథ ఇక ఎమోషనల్ మూమెంట్స్‌తో నడుస్తుంది. ఇక వీళ్ళు కల్చర్ తేడాలను అర్థం చేసుకుంటారు. ఈ సమయంలో ఒక షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆమెకు బంధువులు వేరొకరితో పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. మరోవైపు ఈ డేటింగ్ యాప్ కి, తండ్రి చేసే ఇన్వెస్ట్మెంట్ కి, సుందరి ప్రేమకి ఒకదానికొకటి ముడిపడి ఉంటుంది. చివరికి వీళ్ళ ప్రేమ సక్సెస్ అవుతుందా ? పరం తండ్రి పెట్టిన కండిషన్ ఏమిటి ? ఇది వీళ్ళ ప్రేమకి లింక్ ఎలా అవుతుంది ? సుందరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.