Bigg Boss Seetha : బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఈ షోలో పాల్గొన్న వారు బయటకు వచ్చిన తర్వాత అదే జోరును మెయింటైన్ చేస్తున్నారు. అయితే కొందరు సినిమా అవకాశాలు అందుకుంటే మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో బిజీ అవుతున్నారు. అయితే ఈ ఏడాది సీజన్ 8 పూర్తి అయ్యింది. ఈ సీజన్ కు విన్నర్ గా కన్నడ స్టార్ నిఖిల్ విన్నర్ అయ్యాడు. గౌతమ్ కృష్ణ రన్నర్ అయ్యాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండొచ్చిన వారికి సహజంగానే బయట నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది. దీనిలో భాగంగా బిగ్‌బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ కూడా బాగా పాపులర్ అయ్యారు. అందులో యూట్యూబర్ కుర్రాక్ సీత కూడా ఉంది. ఈమె సినిమాల సంగతి ఏమో గాని సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది. రోజు రోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ సినిమాలు చేస్తుంది.. సోషల్ మీడియాలో ఎంత బిజీగా ఉంటుందో చెప్పనక్కర్లేదు.. తాజాగా ఆమె లేటెస్ట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఆ ఫోటోలు క్షణాల్లో వైరల్ గా మారుతున్నాయి.
రాయలసీమ ముద్దు బిడ్డ కిర్రాక్ సీత తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కావడంతో ఆమె హైదరాబాద్ లో సెటిల్ అయ్యింది. చదువులో టాపర్ అయిన సీతకి కూచిపూడి, భరతనాట్యంలోనూ ప్రావీణ్యం ఉంది. తన తల్లిదండ్రులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో సీత చిన్నప్పటి నుంచి తన పాకెట్ మనీని తనే సంపాదించుకున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా యూట్యూబర్ గా బాగానే పాపులర్ అయ్యింది. ఆ తర్వాత షార్ట్ ఫీలిమ్స్ కూడా చేసిందట. అలా చిన్నప్పటి నుంచే సొంత కాళ్ల మీద నిలబడటం అలవాటు చేసుకుంది. ఆ తర్వాత సినిమాల్లో ట్రై చేసింధి..
మొదటి సినిమాగా ఆనంద్ దేవరకొండ – వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా వచ్చిన బేబీ సినిమాలో హీరోయిన్‌ను చెడగొట్టి ఆమెను చెడు వ్యసనాలకు బానిసను చేసే మోడ్రన్ అమ్మాయి రోల్ లో అద్భుతంగా నటించింది కిర్రాక్ సీత. యూట్యూబ్ మహత్యమో ఏమో కానీ సీత ఏం మాట్లాడినా బోల్డ్‌గా ఉంటుంది. ఏ విషయంపై అయినా కుండబద్ధలు కొట్టినట్లుగా మాట్లాడం ఆమె స్టైల్.. బేబీ సినిమాలో పాత్ర తర్వాత ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తున్న తనను కొందరు అబ్బాయిలు ఫాలో అయ్యారని సీత ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. ఆ సినిమాలో తన క్యారెక్టర్ చూసిన జనం తనను రేప్ చేస్తామంటూ బెదిరించారని.. తన ఫ్రెండ్స్ పోలీసులకు ఫిర్యాదు చేయమన్నారని కానీ తాను అలా చేయలేదని సీత తెలిపారు. ఆ మధ్య క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడింది. ఓ అబ్బాయిని ఐదేళ్ల పాటు ఎంతో గాఢంగా ప్రేమించగా.. ఆ వ్యక్తి దూరం కావడంతో మానసికంగా కృంగిపోయినట్లు బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు బయట పెట్టింది.. ఇక ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఈమె అందాలను చూసి ఏ డైరెక్టర్ అయిన అవకాశాలు ఇస్తారేమో చూడాలి..