OTT Movie : ఓటీటీ సంస్థలు సరికొత్త స్టోరీలతో ఆడియన్స్ ని బుట్టలో వేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా ఈ టివి విన్ లో ప్రతి వారం ఒక షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది షార్ట్ ఫిల్మ్ లకు కేరాఫ్ అడ్రెస్ గా మారుతోంది. వీటిలో థ్రిల్లర్ నుంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ దాకా అన్ని జానర్లలో ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఒక కామెడీ థ్రిల్లర్ సినిమా ఈ రోజు రిలీజ్ కానుంది. దీని పేరు ఏమిటి ? కథ ఎలా ఉంటుంది ? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
‘ది మాస్క్’ (The Mask) కొత్తపల్లి సురేష్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ లో రావణ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. కథగాని పిక్చర్స్ బ్యానర్ లో దీనిని నిర్మించారు. ఇది ఈటివి విన్ లో 2025 అక్టోబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.
హీరో ఒక ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటాడు. అతనికి అందులో వస్తున్న సంపాదన ఏ మాత్రం సరిపోదు. ఓ పక్క ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, మరోవైపు ఆర్థిక సమస్యలు అతన్ని నిరాశలో ముంచుతాయి. దీంతో అతను ఈ కష్టాల నుంచి బయట పడాలనుకుంటాడు. అందుకు గాను ఒక దొంగతనం చేయడానికి ప్లాన్ వేస్తాడు. తప్పించు కోవడానికి తేలికగా ఉండే ఒక ముసలి దంపతులు ఉండే ఇంటిని ఎంచుకుంటాడు. ఇక అనుకున్నదే తడవు, ఆ ఇంట్లోకి వెళ్ళి దొంగతనం చేయాలనకుంటాడు. అక్కడికి వెళ్ళాక స్టోరీ మొత్తం మారిపోతుంది.
Read Also : బాక్సర్ కు బుర్ర బద్దలయ్యే షాక్… అమ్మాయి రాకతో జీవితం అతలాకుతలం… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్