OTT Movie : మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమాలకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సినిమాలను మూవీ లవర్స్ ఎక్కువగా ఇష్టపడుతున్నారు. చక్కని కథాంశంతో తెర ముందుకు తీసుకువస్తున్నారు దర్శకులు. మలయాళం నుంచి ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలే వస్తున్నాయి. థియేటర్లలో సందడి చేసిన ఒక సస్పెన్స్ మూవీ ప్రస్తుతం ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఆ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు ‘రజిని‘ (Rajini). ఈ మూవీలో సన్నివేశాలు, ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. కిల్లర్ ఎవరో తెలుసుకోవడానికి పోలీసులు చేసే ప్రయత్నం తో మూవీ స్టోరీ నడుస్తుంది. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీ లోకి వెళితే
అభిజిత్, గౌరీ అనే భార్య భర్తలు ఒక కారులో ప్రయాణం చేస్తుండగా, పెట్రోల్ అయిపోవడంతో కారు ఆగిపోతుంది. గౌరీని కారులోనే ఉంచి అభిజిత్ పెట్రోల్ బంక్ కు వెళ్లి పెట్రోల్ తీసుకొని వస్తుండగా, అభిజిత్ ని ఒక అమ్మాయి చంపుతూ ఉంటుంది. ఇది చూసిన గౌరీ స్పృహ తప్పి పడిపోతుంది. అక్కడ వెళుతున్న కొంతమంది గౌరీని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు. అభిజిత్ ఎలా చనిపోయాడో పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతారు. గౌరీని హాస్పిటల్ కి తీసుకువచ్చిన వాళ్లను ఎంక్వయిరీ చేస్తాడు. అయితే వాళ్లు ఒక అమ్మాయి చంపుతూ వెళ్ళిపోయిందని చెప్తారు. ఆమె ఎవరో కనుక్కోవడానికి ఇన్స్పెక్టర్ ప్రయత్నిస్తాడు. పెట్రోల్ బంక్ లో సీసీ ఫుటేజ్ చూశాక, ఆటో నడిపే వ్యక్తి అతనికి లిఫ్ట్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో ఒక అమ్మాయి కూడా ఉంటుంది. ఆటో డ్రైవర్ని విచారించగా ఆమె ఎవరో తెలియదని, అప్పుడప్పుడు నా ఆటో ఎక్కుతూ ఉంటుందని చెప్తాడు. ఆమె ఎవరో కనుక్కోవాలని అభిజిత్ ఫ్రెండ్ నవీన్ ప్రయత్నిస్తాడు. గౌరీని ఒక అమ్మాయి ఫాలో అవుతుండడం చూస్తాడు.
ఆమె ఎవరో కనుక్కోవాలనే ప్రయత్నంలో కొన్ని విషయాలు బయటికి వస్తాయి. అమ్మాయి ఎవరో కాదు ఒక ట్రాన్స్ జెండర్. ఒకప్పుడు రజిని తన అన్నతో ప్రయాణం చేస్తుండగా, అభిజిత్ కి వీళ్ళిద్దరితో ఒకసారి గొడవ అవుతుంది. ఈ గొడవలో రజిని అన్నని అభిజిత్ తోయడంతో అతడు లారీ కింద పడి చనిపోతాడు. ఆ తర్వాత ఆ కేసును రజినిపైనే తోయడంతో ఆమె మానసిక వేదనకు గురవుతుంది. లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత అమ్మాయిగా మారి వీరిని చంపడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రయత్నంలో అభిజిత్ ని చంపుతుంది. ఆ తర్వాత గౌరీని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చివరికి రజిని, గౌరీని చంపుతుందా? పోలీసులు రజినిని అరెస్ట్ చేస్తారా? రజిని చివరికి ఏమవుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీని తప్పకుండా చూడండి.