BigTV English

OTT Movie : దెయ్యాలు ఉన్నాయని మోసం చేసే బ్రదర్స్… శిక్ష నుంచి తప్పించుకోవడానికి అమ్మాయిల వేట

OTT Movie : దెయ్యాలు ఉన్నాయని మోసం చేసే బ్రదర్స్… శిక్ష నుంచి తప్పించుకోవడానికి అమ్మాయిల వేట

OTT Movie : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న అడ్వెంచర్ మూవీస్ అంటే చెవి కోసుకునే మూవీ లవర్స్ ఎంతో మంది ఉన్నారు. అడ్వెంచర్ సినిమాలు చాలావరకు కుటుంబ సమేతంగా చూసే విధంగానే ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక హాలీవుడ్ అడ్వెంచర్ మూవీ. ఈ మూవీ మొదటినుంచి చివరి దాకా బాగా ఎంజాయ్ చేస్తూ చూస్తారు మూవీ లవర్స్. ప్రస్తుతం ఈ మూవీ పేరేమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం.


అమెజాన్ ప్రైమ్ వీడియోలో…

ఈ హాలీవుడ్ మూవీ పేరు “ద బ్రదర్స్ గ్రిం ” (The Brothers Grim). ఈ మూవీ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇద్దరు అన్నదమ్ములు చేసే విచిత్ర సాహసాలతో ఈ సినిమా నడుస్తుంది. ఈ మూవీలో చాలా అడ్వెంచర్ సన్నివేశాలు ఉంటాయి. ఈ మూవీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే…
ఇద్దరు అన్నదమ్ములు విల్, జాక్ దయ్యాలు పడతామని అందరికీ చెబుతారు. అయితే ఒక ఊరు నుంచి వీళ్లకు ఫోన్ రాగా, మా ఊరిలో దయ్యం ఉంది వెళ్ళగొట్టాలి అని వీళ్లకు చెబుతారు. ఆ ఊరికి వీళ్లు వెళ్లి ఆ దయ్యం తో ఫైట్ చేస్తారు. అలాగే దాన్ని వెళ్లగొడతారు. నిజానికి ఇలా చెప్పి ప్రజలని మోసం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్లు ఆ ఊరిలో ముందే వీళ్ళ మనిషిని పంపించి దయ్యంలా భయపెట్టమంటారు. ఆ తర్వాత వీళ్ళకి ఆ ఊరి ప్రజలు సమాచారం ఇచ్చి దయ్యాన్ని వెళ్లగొట్టమని చెప్తారు. అందుకు వీరు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు. వీరి దినచర్య ఇలా సాగుతూ ఉంటుంది. ఒకసారి ఈ విషయం రాజుకు తెలిసి వీళ్లను తన దగ్గరికి పట్టుకు రమ్మంటాడు.

మీరు ప్రజలను మోసం చేస్తున్నందుకు మీకు మరణశిక్ష విధిస్తున్నాను అని చెప్తాడు. వీరిద్దరూ రాజుని బ్రతిమాలుకోవడంతో, రాజు వీళ్ళకు ఒక పని అప్పచెబుతాడు. నా రాజ్యంలో కొంతమంది అమ్మాయిలు మిస్ అయ్యారు. అది కూడా ఒక అడవి ప్రాంతంలో. అది ఎలా జరిగిందో తెలుసుకొని వాళ్లను నాకు అప్పజెప్తే మీకు వేసిన శిక్షను రద్దు చేస్తానని చెప్తాడు. ఈ ప్రయత్నంలో వాళ్లు ఒక అమ్మాయి సాయం తీసుకుంటారు. ఆ అమ్మాయి తండ్రిని ఒక నక్క చంపి ఉంటుంది. అలాగే ఆ అమ్మాయి చెల్లి కూడా అడవిలోనే కనిపించకుండా పోతుంది. ఈ ముగ్గురూ కలసి అడవికి వెళ్తారు. ఆ అడవిలో వీరికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురౌతాయి.  చివరికి అడవిలో ఏం జరుగుతుందో వీళ్లు కనుక్కోగలిగారా? అమ్మాయిలను తిరిగి రాజుకు అప్పగిస్తారా? హీరోయిన్ తండ్రిని ఆ నక్క ఎందుకు చంపింది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ద బ్రదర్స్ గ్రిం ” (The Brothers Grim) మూవీని తప్పకుండా చూడండి. ఈ మూవీని చూసేటప్పుడు మరో లోకంలో ఉన్నమా అనే ఫీలింగ్ కలుగుతుంది.

Related News

OTT Movie : ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తో భార్య… మెంటల్ మాస్ షాక్ ఇచ్చే భర్త… వీడు మగాడ్రా బుజ్జి

OTT Movie : హాంటెడ్ ప్లేస్ లో అమ్మాయి మిస్సింగ్… భయపెడుతూనే కితకితలు పెట్టే మలయాళ హర్రర్ మూవీ

OTT Movie : పిచ్చాసుపత్రిలో మెంటల్ ప్రయోగాలు… హిప్నటైజ్ చేసి మనుషుల మతిపోగోట్టే పాడు పనులు… నరాలు కట్టయ్యే సస్పెన్స్

OTT Movie : జోకర్ కార్డుతో జీవితం తారుమారు… భార్యాభర్తల అరాచకం మామూలుగా ఉండదు భయ్యా… తెలుగులోనే స్ట్రీమింగ్

OG Movie OTT: ఓజీ ఓటీటీ అప్డేట్.. ఎన్ని వారాల్లో వస్తుందంటే ?

OTT Movie : కిరీటం కోసం కొట్లాట… వేల ఏళ్ల పాటు వెంటాడే శాపం… మతిపోగోట్టే ఫాంటసీ థ్రిల్లర్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మహిళల్ని బలిచ్చి దిష్టి బొమ్మలుగా… ఒళ్ళు గగుర్పొడిచే సీన్స్ సామీ

OTT Movie : జాబ్ ఇస్తామని చెప్పి దిక్కుమాలిన ట్రాప్… అలాంటి అమ్మాయిలే ఈ ముఠా టార్గెట్… క్రేజీ తమిళ్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×