BigTV English
Advertisement

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్‌… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా

OTT Movie : ఒక మంచి ఫ్యామిలీ సినిమాని చూసి అనదించాలనుకుంటున్నారా ? అయితే రీసెంట్ గా ఒక తమిళ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
ఐయండిబిలో 7.4 రేటింగ్ పొందిన ఈ సినిమాను మిడిల్ క్లాస్ పీపుల్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఈ సినిమా విమర్శకులతో పాటు, ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నప్పటికీ, అప్పుడప్పుడూ వస్తున్న ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలు, ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటున్నాయి. సిద్ధార్థ్, శరత్‌కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని, ఆడియన్స్ ఓటీటీలో ఇంట్రెస్టింగా చూస్తున్నారు. ఈ కథ నగరంలో అద్దెకు జీవిస్తూ, సొంత ఇల్లు కొనడానికి ఇబ్బంది పడుతున్న ఒక మధ్య తరగతి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఈ సినిమా పేరు ‘3 BHK’. దర్శకుడు శ్రీ గణేష్ నిర్మించిన ఈ తమిళ చిత్రంలో సిద్ధార్థ్ , ఆర్. శరత్‌కుమార్, దేవయాని, చైత్ర, సుబ్బు పంచు, వివేక్ ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించారు. దీనికి IMDbలో 7.4 ఆకట్టుకునే రేటింగ్ ఉంది. ఈ ఏడాది జూలైలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

చెన్నైలో మధ్యతరగతి కుటుంబం నివసిస్తూ ఉంటుంది. వాసుదేవన్ (ఆర్. శరత్ కుమార్) ఒక అకౌంటెంట్ గా, భార్య శాంతి (దేవయాని) హౌస్‌వైఫ్ గా ఉంటారు. వీళ్ళకు ప్రభు అనే కొడుకు (సిద్ధార్థ్), ఆర్తి అనే కూతురు (మీతా రఘునాథ్) ఉంటుంది. ఈ కుటుంబం రెంట్ ఇళ్లలో తిరిగి తిరిగి అలసిపోయి, సొంత 3BHK ఫ్లాట్ కొనాలనే కలతో జీవిస్తుంది. కథ 2006లో మొదలై 20 ఏళ్ల పాటు సాగుతుంది. IT బూమ్, ఆర్థిక మార్పులు, చెన్నై సిటీ ఎలా మారిందో బ్యాక్‌డ్రాప్‌లో చూపిస్తారు. వాసుదేవన్ రోజూ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అపార్ట్‌మెంట్లు చూస్తూ, మేము కూడా ఒకరోజు ఇల్లు కొనుక్కుంటాం అని కలలు కంటాడు. అయితే పిల్లల చదువులు, ఖర్చులు, ఊహించని సమస్యలు వచ్చి సేవింగ్స్ అన్నీ ఖర్చవుతాయి.


Read Also : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

ప్రభు కాలేజీలో ఉండగా, ఆర్తి పెళ్లి అయ్యేటప్పుడు, ప్రతి సారీ ఇల్లు కొనే డబ్బు ఏదో ఒక సమస్య తో ఖర్చు అయిపోతుంటుంది. వాసుదేవన్ తన కోసం ఏమీ ఖర్చు పెట్టకుండా, ఫ్యామిలీ కోసం త్యాగాలు చేస్తాడు. రిటైర్మెంట్ తర్వాత కూడా జాబ్ చేస్తాడు. ప్రభు ఉద్యోగం చేసి, తండ్రి కల నెరవేర్చాలని ప్రయత్నిస్తాడు. వీళ్ళ మధ్య వచ్చే సన్నివేశాలు, ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేస్తాయి. చివర్లో ఈ కుటుంబం సొంత ఇంటి కల సాకారం చేసుకుంటుందా ? మరిన్ని సమస్యలతో వాయిదా పడుతుందా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

OTT Movie : మంత్రముగ్ధులను చేసే కథ… మెంటలెక్కించే క్లైమాక్స్.. ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌లో మిస్ అవ్వకుండా చూడాల్సిన థ్రిల్లర్లు

OTT Movie : బీహార్ రాజకీయాలు ఎంత బ్రూటల్‌గా ఉంటాయో తెలుసుకోవాలా ? అయితే ఈ వెబ్ సిరీస్‌లపై లుక్కేయండి

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

Big Stories

×