Sridevi Drama company Promo: బుల్లితెరపై ఎన్నో రకాల షోలు ప్రసారమవుతున్నాయి. అందులో కొన్ని జనాల్లోని టాలెంట్ ని బయటికి తీస్తుంటే, మరికొన్ని మాత్రమే ప్రేక్షకులను ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నాయి.. అలాంటి వాటిలో శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ఒకటి. ఈ షో ఈటీవీలో ప్రసారమవుతుంది.. యాంకర్ గా రష్మీ గౌతమ్ వ్యవహరించగా, జడ్జిగా ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. కామెడీకి కేరాఫ్ గా మారిన ఈ విషయంలో ఈమధ్య ఎమోషనల్ గా కట్టిపడేసే సీన్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించే సీన్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం వస్తుంది సందేహం లేదు. అందుకేనేమో ఈ షో రేటింగ్ కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ ప్రోమో ని విడుదల చేశారు. కొన్ని గంటల క్రితం విడుదలైన ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రతి షోలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా స్పెషల్ డేస్ కి సంబంధించిన ఎపిసోడ్లైతే ప్రేక్షకులను ఎంతగా అలరిస్తున్నయో చెప్పనక్కర్లేదు.. ఈమధ్య పోటీపడి మరి ఎంటర్టైన్మెంట్ షోలు డిఫరెంట్ థిమ్ లతో ముందుకు వస్తున్నాయి. ప్రత్యేకమైన రోజులకు సంబంధించిన ఎపిసోడ్లను చాలా అందంగా చూపిస్తున్నారు. తాజాగా నవంబర్ 14 చిల్డ్రన్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీలో పిల్లలతో ఎపిసోడ్ని చేశారు.. దానికి సంబంధించిన ప్రోమోని మల్లెమాల రిలీజ్ చేసింది. ప్రస్తుతం ఆ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్దల మీద పంచులు వేసినట్లే ఆ షోలో హైపర్ ఆది కూడా పిల్లలపై పంచులు వేసాడు. అందులో ఉన్న కుర్రాడు మాత్రం ఆదికి చెమటలు పట్టించేసాడు. నువ్వెంత అంటే నువ్వెంత అని అతనికి నోట మాట రాకుండా చేశాడు. ఇది మాత్రం ఆ ప్రోమో కి హైలెట్ గా నిలిచింది. పిల్లలతో ఎంతగా కమెడియన్లు ఆడుకోవాలని చూసినా కాని రివర్స్ పంచులు వాళ్ళకే పడడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిలిచిస్తున్నాయి.. ప్రోమో మాత్రం అదిరిపోయింది అని చెప్పాలి.
Also Read : జాక్ పాట్ కొట్టేసాడే.. అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్..?
ప్రోమో మొత్తం సరదాగా పిల్లల ఆటలతో పాటలతో గడిచింది.. సెలబ్రిటీలు తమ పిల్లలతో రావడం ఎపిసోడ్ కి హైలైట్ గా నిల్వనుంది.. సీరియల్ యాక్టర్స్, కమెడియన్లు తమ పిల్లలతో సందడి చేశారు. తండ్రులను మించిన రేంజ్ లో పిల్లలు పంచులు వర్షం కురిపించారు.. ఆదిలాంటి కమెడియన్ ని తొక్కి పడేసారు అంటే మామూలు విషయం కాదు. ఈ ప్రోమో అంతా బాగానే సాగింది కానీ చివర్లు మాత్రం తాగుబోతు రమేష్ అందరినీ ఏడ్పించేసాడు. తన కూతుర్నే స్టేజ్ మీదకు పిలిచి సర్ప్రైజ్ గిఫ్ట్ ని ఇచ్చాడు. ఆ తర్వాత మాట్లాడుతూ తిను నాకు స్పెషల్ అని అన్నాడు. నా మెసేజ్ కడుపులో ఉన్నప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి వెంటనే అబార్షన్ చేయించుకోమన్నారు.. కానీ మేము ప్రాణాలతో రిస్క్ తీసుకొని మరి మా పాపని చూడాలని అనుకున్నాము.. అందుకే నా పాప ఇంట్లో అందరికీ స్పెషల్ అని కన్నీళ్లు పెట్టుకున్నాడు.. దాంతో సెట్ లో ఉన్న అందరూ కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. మొత్తానికి ప్రోమో అయితే కాస్త కామెడీగా, కూసంత ఎమోషనల్ గా బాగానే ఆకట్టుకుంది.. మరి ఎపిసోడ్ ఎలా ఉంటుందో చూడాలి..