OTT Movie : రొమాంటిక్ సినిమాలకు ఉన్న ఫాలోయింగ్ ఎక్కువే. అందులోనూ హాలీవుడ్ రొమాంటిక్ సినిమాలలో కాస్త మసాలా ఘాటు కూడా ఎక్కువే ఉంటుంది. ఈ జానర్ లో వచ్చిన ఒక మూవీ పార్తెనోప్ అనే అమ్మాయి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన అందంతో అందరి మతి పోగొడుతుంటుంది. తనని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే. అలాంటి అందాన్ని ఆమె ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చే స్తుంటుంది. చివరికి ఆమె జీవితం ఎలా ముగుస్తుందనేదే ఈ స్టోరీ. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే. .
“Parthenope” 2024లో వచ్చిన ఇటాలియన్-ఫ్రెంచ్ రొమాంటిక్ ఫిల్మ్. పావోలో సొరెంటినో దర్శకత్వంలో సెలెస్టే డల్లా పోర్టా, స్టెఫానియా సాండ్రెల్లి, గ్యారీ ఓల్డ్‌మన్, సిల్వియో ఓర్లాండో మెయిన్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా 136 నిమిషాల రన్ టైమ్ తో ఐయండిబిలో 6.6/10 రేటింగ్ పొందింది. ఈ మూవీ ఇండియాలో థియేటర్స్ రిలీజ్ లేదు. అయితే నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
ఒక రిచ్ ఫ్యామిలీలో పార్తెనోప్ అనే అమ్మాయి పుడుతుంది. ఆమె పేరుకి అర్థం సముద్రంలో పాటలతో మత్తెక్కించే అందగత్తె అని వస్తుంది. అందుకు తగ్గట్టే 18 ఏళ్లు వచ్చేసరికి సూపర్ గార్జియస్ అవుతుంది. ఆమె అందం చూస్తే అందరూ మంత్రముగ్ధులు అయిపోతుంటారు. ఆమె బ్రదర్ రైమాండో కూడా ఆమె మీద ఆబ్సెషన్ పడతాడు. ఫ్రెండ్ సాండ్రినో కూడా ఆమెని క్రష్ చేస్తాడు. పార్తెనోప్ ఆంథ్రపాలజీ స్టడీ చేస్తుంస్తుంటుంది. ప్రొఫెసర్ మారోట్టా ఆమెకి గైడ్ అవుతాడు. ఆమె లైఫ్‌లో లవ్, రొమాన్స్, ఫ్రెండ్‌షిప్ ఎక్స్‌ప్లోర్ చేస్తుంది. కానీ ఆమె బ్యూటీ ఒక కర్స్ లాగా మారుతుంది. అందరూ ఆమె బాడీ మీద ఫోకస్ చేస్తారు. రియల్ ఎమోషన్స్ మిస్ అవుతాయి.
Read Also : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం
పార్తెనోప్ యాక్టింగ్ ట్రై చేస్తుంది. కమోర్రా అనే గ్యాంగ్‌స్టర్‌తో అఫైర్ పెట్టుకుంటుంది. ఇంతలో కొన్ని ట్రాజీడీలు వస్తాయి. ఆమె బ్రదర్ రైమాండో సూసైడ్ చేసుకుంటాడు. ఇది పార్తెనోప్‌ని పూర్తిగా బ్రేక్ చేస్తుంది. ఆమె లైఫ్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అందం టెంపరరీ అని, నిజమైన హ్యాపీనెస్ సెల్ఫ్ డిస్కవరీలో ఉందని రియలైజ్ చేసుకుంటుంది. లైఫ్ అంతా అందాన్ని ఎవరికి పడితే వాళ్ళకి అర్పించి, చివరికి పార్తెనోప్ వేదాంత ధోరణికి వస్తుంది. ఈ కథ ఇలా ముగిసి పోతుంది.