IND VS SA: ఆస్ట్రేలియా టూర్ ముగించుకొని ఇండియాకు చేరుకున్న టీమిండియా, మళ్లీ టెస్టులకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా ( India vs South Africa ) మధ్య టెస్ట్ సిరీస్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే షెడ్యూల్ ఖరారు అయింది. ప్లేయర్లను కూడా ప్రకటించేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. శుభమాన్ గిల్ కెప్టెన్సీలోనే ఈ టోర్నమెంట్ ఆడనుంది టీమిండియా.
టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st Test) మధ్య మరో నాలుగు రోజుల్లో టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ రెండు జట్ల మధ్య కేవలం రెండు టెస్టులు మాత్రమే జరగనున్నాయి. నవంబర్ 14వ తేదీన మొదటి టెస్ట్ కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా ( Eden Gardens, Kolkata ) జరగనుంది. ఎప్పటి లాగే ఉదయం 9:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక నవంబర్ 22వ తేదీన ఈ రెండు దశ మధ్య రెండో టెస్టు గౌహతి వేదికగా ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే టెస్ట్ సిరీస్ జియో హాట్ స్టార్ లో ఉచితంగానే చూడవచ్చు అలాగే స్టార్ స్పోర్ట్స్ లో కూడా ప్రసారాలు వస్తాయి. రెండు టెస్టుల సిరీస్ పూర్తయిన తర్వాత వెంటనే వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య 3 వన్డేలు జరగనున్నాయి. నవంబర్ 30వ తేదీన మొదటి వన్డే రాంచి వేదికగా జరుగుతుంది. అలాగే డిసెంబర్ మూడో తేదీన రాయపూర్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండో వన్డే ఉంటుంది. ఇక డిసెంబర్ 6వ తేదీన విశాఖపట్నం వేదికగా మూడవ వన్డే నిర్వహిస్తారు.
ఈ టోర్నమెంట్ పూర్తయిన తర్వాత రెండు జట్ల మధ్య ఐదు టీ20ల మ్యాచ్ లు కూడా జరగనున్నాయి. టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం దక్షిణాఫ్రికా తో ఈ టూర్ సెట్ చేసింది బిసిసిఐ. టి20 వరల్డ్ కప్ మన ఇండియాలో జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దక్షిణాఫ్రికా తో జరిగే టి20 లు సూర్య కుమార్ యాదవ్ సేన కు ప్లస్ అవుతాయి. ఇక ఈ టోర్నమెంట్ డిసెంబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 19వ తేదీ వరకు కొనసాగుతుంది. టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య రికార్డులు పరిశీలిస్తే, ఇప్పటివరకు రెండు జట్ల మధ్య 16 సిరీస్ లు జరిగాయి. ఇందులో 8సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించింది. నాలుగుసార్లు టీం మీడియా గెలిచింది. మరో నాలుగు సిరీస్ లు డ్రా అయ్యాయి.
Also Read: IPL 2026: క్లాసెన్ కోసం కావ్య పాప స్కెచ్.. SRHలోకి హెట్‌మైర్, ఐపీఎల్ 2026 రిటెన్షన్ ఎప్పుడంటే?
టీమిండియా : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (కీపర్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అక్సర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి.