OTT Movie : ఈ మధ్య హారర్ ఎలిమెంట్స్ తో సినిమాలను, డిఫరెంట్ గా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్. ఈ ప్రయత్నంలో భాగంగా థియేటర్లలో రిలీజ్ అయిన ‘జరణ్’ అనే హారర్ థ్రిల్లర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మరాఠీ సినిమా ఊహించని ట్విస్టులతో మతి పోగొడుతోంది. చేతబడులతో సాగే ఈ సినిమా ఆడియన్స్ కు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ ఏడాది జూన్ 6న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, రెండు నెలల తరువాత ఆగస్ట్ 8 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చింది. మరాఠీ భాషలో మాత్రమే స్ట్రీమింగ్ లో ఉన్న ఈ సినిమా, ప్రస్తుతం తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ తో ట్రెండింగ్ అవుతోంది. ఇది ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
హృషికేష్ గుప్త దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జరణ్’. ఇందులో అమృతా సుభాష్, అనితా డేట్ కెల్కర్, కిశోర్ ఖడమ్, జ్యోతి మల్షే, అయానీ జోష్ కీలక పాత్రలు పోషించారు. అనీజ్ బాజ్మి ప్రొడక్షన్స్, ఎ అండ్ ఎన్ సినిమాస్ ఎల్‌ఎల్పీ, ఏ3 ఈవెంట్స్ అండ్ మీడియా సర్వీసెస్ ఈ సినిమాను నిర్మించాయి. 2025 జూన్ 6న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, ఆగస్ట్ 8 నుంచి జీ5 ఓటీటీలో మరాఠీ భాషలో రిలీజ్ అయింది. నవంబర్ 7 నుంచి తెలుగులో కూడా అందుబాటులోకి వచ్చింది.
రాధ అనే ఒక మహిళ, భర్త శేఖర్ యాక్సిడెంట్‌లో చనిపోయినట్టు భావిస్తుంది. ఆమె తన కూతురు సయీతో కలిసి, ఒక మారుమూల విలేజ్‌లోని పూర్వీకుల ఇంటికి వెళ్తుంది. అక్కడ ఆమెకు ఒక పాత బొమ్మ దొరుకుతుంది. దీంతో ఆమెలో ఉన్న అనుమానం మరింత పెరుగుతుంది. చిన్నప్పటి నుంచి రాధకు గంగుటి అనే ఒక పొరుగింటి మహిళ, బ్లాక్ మ్యాజిక్ చేసి శాపం పెట్టిందని భయం. ఆమె చిన్నప్పుడు మంత్రాలు, డార్క్ రిచ్యువల్స్ చేసి రాధకు హాని చేసిందని నమ్ముతుంటుంది. ఇప్పుడు మళ్లీ ఆ ఇంట్లో వింత సంఘటనలు స్టార్ట్ అవుతాయి. అక్కడ నీడలు కదలడం, భయంకరమైన కలలు వస్తాయి. ఇప్పుడు ఆమె కూతురు సయీ కూడా విచిత్రంగా బిహేవ్ చేస్తుంది.
Read Also : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ
రాధకు గంగుటి శాపం తనపైనా, కూతురుపైనా పడిందని భయం పెరిగిపోతుంది. ఆ తరువాత డాక్టర్ రష్మి పాండిత్ అనే సైకాలజిస్ట్ ఆమెకు ట్రీట్ మెంట్ చేస్తుంది. కానీ అప్పటికే రాధ మానసికంగా కుంగిపోతుంది. ఇక క్లైమాక్స్ ట్విస్టులకు ఆడియన్స్ కి మతిపోతుంది. ఆ ట్విస్టులు ఏమిటి ? నిజంగానే చేతబడులు జరిగాయా ? దెయ్యాలు రాధని హంట్ చేస్తాయా ? రాధ భర్త నిజంగానే చనిపోయాడా ? ఈ కథ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ హారర్ థ్రిల్లర్ మరాఠీ సినిమాను చూసి తెలుసుకోండి.