BigTV English
Advertisement

Indian Railway: షాకింగ్.. గుట్కా మరకలు క్లీన్ చేసేందుకు రైల్వే ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?

Indian Railway: షాకింగ్.. గుట్కా మరకలు క్లీన్ చేసేందుకు రైల్వే ఏడాదికి అన్ని కోట్లు ఖర్చు చేస్తుందా?

వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల శుభ్రత పాటించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున అవగాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ‘స్వచ్ఛ భారత్’ లాంటి కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా చేపడుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు శుభ్రతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తోంది. దేశంలోనే అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థలో ఒకటైన భారతీయ రైల్వే కూడా శుభ్రత మీద ప్రయాణీకులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైల్వే ప్రాంగణాల్లో చెత్త వేయడం, గుట్కా నమిలి ఉమ్మడం లాంటి పనులు చేయకూడదని పదే పదే అవగాహన కల్పిస్తోంది. రైల్వే పరిసరాల్లో చెత్త వేసినా, గుట్కా నమిలి ఉమ్మినా జరిమానాలు విధిస్తామని హెచ్చరిస్తుంది. అయినా, జనాలు ఇప్పటికీ మారడం లేదు. ఎవరేం చెప్పినా, తమ పని తాము చేసుకుపోతున్నారు. రైల్వే స్టేషన్లలో ఎక్కడ పడితే అక్కడ గుట్కా నమిలి ఉమ్మేస్తున్నారు.


గుట్కామరకలను తొలగించేందుకు కోట్లు ఖర్చు!    

గుట్కా బాబులు చేసే పని భారతీయ రైల్వేకు భారంగా మారుతోంది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసి, ఆ మరకలను తొలగిస్తోంది. ప్రతి ఏటా దేశ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైల్వే ప్రాంగణాలు, రైళ్లలో గుట్కా మరకలు తొలగించేందుకు రూ. 1200 కోట్లు ఖర్చు చేస్తోంది. దక్షిణాది రాష్ట్రాలతో పోల్చితే, ఉత్తరాది రాష్ట్రాల్లో గుట్కా నమిలి ఉమ్మే పరిస్థితి ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యూపీ, బీహార్, మధ్య ప్రదేశ్, ఒడిషా లాంటి  రాష్ట్రాల్లో గుట్కా నమిలి ఉమ్మే పద్దతి చాలా ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణ రైళ్ల నుంచి మొదలుకొని, అత్యాధునిక వందేభారత్ రైళ్ల వరకు ఎక్కడ పడితే అక్కడ గుట్కా నమిలి ఉమ్ముతున్నారు. అవగాహన కల్పించినా, జరిమానాలు విధించినా, మనుషులు మారడం లేదు.

నిజానికి వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రతను కాపాడుకునే విషయంలో కోవిడ్-19 తర్వాత ప్రజల్లో కొంత అవగాహన ఏర్పడింది. చెత్తను చెత్త కుండీల్లో వేయడం, ఇంట్లోని చెత్తను మున్సిపల్ వాహనాల్లో వేయడం లాంటివి చేస్తున్నారు. కానీ, గుట్కా బాబులు మాత్రం తమ పద్దతి మార్చుకోవడం లేదు. ప్రపంచం ఎటైనా పోనీ.. తమ దారి తమదే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో గుట్కా నమిలే వారి విషయంలో మరింత కఠిన చర్యలు తీసుకోవాలని రైల్వే ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రైల్వే స్టేషన్లలో, స్టేషన్ ప్రాంగణాల్లో స్పిటర్ కియోస్క్‌ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినప్పికీ, ఆ ప్రయత్నం ఎందుకో ముందుకు సాగలేదు. ఇప్పటికైనా గుట్కా బాబులను కట్టడి చేయాలని, లేకపోతే రైల్వే పరుపు తీస్తారని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ఖర్చుతో 10 వందేభారత్ రైళ్లు తేవచ్చు!

ప్రతి ఏటా గుట్కా మరకలు తొలగించేందుకు భారతీయ రైల్వే చేస్తున్న ఖర్చు రూ. 1200 కోట్లు కేటాయిస్తే, ఆ డబ్బుతో సంవత్సరానికి 10 కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొంత మంది వ్యక్తులు చేసే చెత్త పని కారణంగా పెద్ద మొత్తంలో ప్రజా ధనం వృథా అవుతుందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుట్కా తినేవారిని రైళ్లలో ప్రయాణించకుండా నిషేధించడం మంచిదంటున్నారు.

Read Also: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

Related News

Karnataka Tour: కర్ణాటకలోని..ఈ ప్రదేశాలు చూడటానికి రెండు కళ్లు సరిపోవు !

US flight crisis: అమెరికాలో ఒక్కసారిగా రద్దైన 1,460 ఫ్లైట్లు.. ఇబ్బందుల్లో వేలమంది ప్రయాణికులు

Train PNR Status: ఇంటర్నెట్ లేకున్నా ట్రైన్ PNR స్టేటస్ తెలుసుకోవచ్చు, ఎలాగంటే?

AP Family Tour: ఫ్యామిలీ టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఏపీలోని ఈ ప్లేస్‌‌లపై ఓ లుక్కేయండి !

Assam Temple darshan: రూ.7వేలకే అస్సాం పవిత్ర యాత్ర.. కామాఖ్య, ఉమానంద ఆలయ దర్శనం ప్యాకేజ్ వివరాలు

Vande Bharat Trains: వందే భారత్ చూసి విదేశీయులే ఆశ్చర్యపోతున్నారు.. మోడీ కీలక వ్యాఖ్యలు!

Northeast India Tour: ఇండియాలోనే చూపు తిప్పుకోలేని అందాలు.. దీని ముందు వరల్డ్ టూర్ వేస్ట్ !

Big Stories

×