Bigg Boss 9 Telugu: బుల్లితెర టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ కు రోజు రోజుకి ఆదరణ పెరుగుతుంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో మరికొన్ని వారాల్లో ముగింపు పలకనుంది. ఈ క్రమంలో ఈ షోలు డబల్ ఎలిమినేషన్ పై సర్వత్ర చర్చలు జరుగుతున్నాయి.. తొమ్మిదవ వారం ఒక్కరు మాత్రమే అవసరం చేసి బయటకు రావాల్సి ఉండేది. ఫోక్ సింగర్ రామ్ రాథోడ్ స్వచ్ఛందంగా ఎలిమినేట్ అయ్యి బయటకు రావడంతో డబల్ ఎలిమినేషన్ అయింది.. శనివారం ఎపిసోడ్లో రామ్ బయటికి రాగా.. ఆదివారం తక్కువ ఓటింగ్ తో సాయి శ్రీనివాస్ ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు. అయితే ఈయన హౌస్ లో ఉన్నంతకాలం పెద్దగా పెర్ఫార్మన్స్ చేయలేదు కానీ రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే సంపాదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకీ సాయి ఎన్ని లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నాడు ఒకసారి చూసేద్దాం..
బిగ్ బాస్ తొమ్మిదో వారం సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసాడు.. భరణి, సాయి డేంజర్ జోన్లోకి రాగా సాయి అతి తక్కువ ఓటింగ్ తో హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. సాయి శ్రీనివాస్ హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి ఇప్పటి వరకు తనదైన మార్కు ని క్రియేట్ చేసుకోవడం లో విఫలం అయ్యాడు. మొదటినుంచి ఆటతీరులో తన ప్రతిభను కనబడుచలేకపోయాడు. ఎటువంటి టాస్కులు అయినా సొంత నిర్ణయాలు తీసుకోలేక వెనక్కి ఉండిపోయాడు. దాంతో జనాలు ఆయననే హౌస్ లో ఉంచడం కరెక్ట్ కాదు అని ఓట్లు వెయ్యలేదు అలా బయటకు వచ్చేసారు.. హౌస్ లో ఉన్నంత కాలం పెద్దగా పెర్ఫార్మన్స్ ఇవ్వకపోయిన రెమ్యూనరేషన్ మాత్రం గట్టిగానే సంపాదించాడు.. నాలుగు వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు సాయి శ్రీనివాస్ దాదాపుగా 8 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ తీసుకున్నాడట. అంటే వారానికి రెండు లక్షలు.. పెద్దగా పస లేకపోయినా కూడా హౌస్ లో ఉన్నంతవరకు బాగానే కొట్టేసాడు అని అందరు అనుకుంటున్నారు.
Also Read : పవన్ సాయి కాపురంలో చిచ్చు పెట్టింది ఆమెనే.. ఇన్నాళ్లకు బయటపడ్డ నిజం..
9 వారాలు పూర్తి అయిన బిగ్ బాస్ లో పదోవారంపై అప్పుడే ఆసక్తి నెలకొంది. ఈవారం నామినేషన్ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు కానీ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేది ఎవరో అని సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు నమోదైన ఓటింగ్ ప్రకారం చూస్తే దివ్య రీతు చౌదరి లిస్ట్ లో ఉన్నారు. రీతుతో పోలిస్తే అప్పుడప్పుడు దివ్య ఫైర్ బ్రాండ్ లాగా రెచ్చిపోతుంది. ఏదైనా కరెక్ట్ గా లేకపోతే వారిపై విజ్రూంభిస్తుంది. రీతు మాత్రం ఎంతసేపు పులిహోర కలిపే పనిలోనే ఉంటుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఓటింగ్ మాట పక్కన పెడితే ఈ వారం హౌస్ నుంచి రీతు బయటకు వచ్చే అవకాశం ఉందని నెట్టింట ప్రచారంలో ఉంది. ఏది ఏమైనా సరే ఈరోజు జరిగే నామినేషన్స్ లో ఎవరు ఏంటో తెలిసిపోతుంది..