OTT Movie : ప్రేమ కథలు కొన్ని చాలా డిఫెరెంట్ గా ఉంటాయి. ఎంతో అద్భుతమైన ప్రేమికులుగా కొంత మంది కనబడతారు. కానీ వింత కారణాలతో విడిపోతంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ఒక రొమాంటిక్ జంట చుట్టూ తిరుగుతుంది. ప్రియురాలు కొత్త బాయ్ ఫ్రెండ్, కొత్త అడ్వెంచర్ కోసం న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. పాత ప్రియుడి చావుకి కారణం అవుతుంది. అయితే ఈ ఎమోషనల్ డ్రామా అందరికీ నచ్చకపోవచ్చు. రష్యన్ సినిమా ఫ్యాన్స్‌కి గుడ్ ఛాయిస్. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
“Anybody Seen My Girl?” 2020లో వచ్చిన రష్యన్ రొమాంటిక్ మూవీ. అంజెలీనా నికోనోవా దర్శకత్వంలో అన్నా చిపోవ్‌స్కాయా, అలెక్సాండర్ గోర్చిలిన్, విక్టోరియా ఇసాకోవా, యూరా బోరిసోవ్ మెయిన్ రోల్స్ లో నటించారు. 100 నిమిషాల రన్ టైమ్ తో ఈ సినిమా
ఐయండిబిలో 5.3/10 రేటింగ్ ని పొందింది. రష్యాలో 2021 ఫిబ్రవరి 4న రిలీజ్ అయిన ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.
హీరోయిన్ కిరా, హీరో సెర్గీ ఇద్దరూ సినిమా లవర్స్. సినిమాలు చూసి డిస్కస్ చేస్తూ, పార్టీలు, ఫెస్టివల్స్‌లో తిరుగుతూ ఉంటారు. వాళ్ల లవ్ స్టోరీ సూపర్ చాలా ప్యాషనేట్, రొమాంటిక్. అందరూ పర్ఫెక్ట్ కపుల్ అని అనుకునేవాళ్లు. మొదట ఫ్లాష్‌బ్యాక్‌లో వాళ్ల హ్యాపీ డేస్ చూపిస్తారు. కిరా చాలా ఇండిపెండెంట్ అమ్మాయి, సెర్గీ కూడా ఆర్టిస్టిక్ టైప్. వాళ్లు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ సడన్ ట్విస్ట్ వస్తుంది. కిరా న్యూ అడ్వెంచర్ కోసం టౌన్ వదిలేసి వెళ్లిపోతుంది. న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. న్యూ జాబ్, న్యూ బాయ్‌ఫ్రెండ్ తో సమయం గడుపుతుంది. కొత్తదనం కోసం ఆరాటపడుతుంది.
Read Also : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ
ఈ షాకింగ్ ట్విస్ట్ తో సెర్గీ షాక్ అయి డిప్రెషన్‌లో పడతాడు. కానీ కిరా మాత్రం హ్యాపీ లైఫ్ గడుపుతుంది. తర్వాత సెర్గీ సడన్‌గా ఆమె కోసం వెతుకుతూ చనిపోతాడు. కిరా దూరంగా ఉన్నా న్యూస్ విని షాక్ అవుతుంది. ఏళ్ల తర్వాత కూడా సెర్గీ మెమరీస్ వెంటాడతాయి. ఆమె న్యూ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇన్నర్‌గా రిగ్రెట్ అవుతుంది. గ్రీఫ్ ఫుల్ “నేను అతన్ని లవ్ చేశానా? ఎందుకు వదిలేశాను?” అని సెల్ఫ్ డౌట్ లో పడుతుంది. చివరికి కిరా రియలైజ్ చేసుకుంటుంది. సెర్గీతోనే ట్రూ లవ్ అని అనుకుంటుంది. కానీ ఇప్పుడు అతను ఈ లోకంలోనే లేడు. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ ని ఆలోచనల్లో పడేస్తుంది.