BigTV English

OTT Movie : ఈ షెడ్ లో ఉన్న వాంపైర్ చేసే పని చూస్తే గుండె గుభేల్… గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : ఈ షెడ్ లో ఉన్న వాంపైర్ చేసే పని చూస్తే గుండె గుభేల్… గూస్ బంప్స్ తెప్పించే హారర్ థ్రిల్లర్

OTT Movie : హర్రర్ సినిమాలను చూసేటప్పుడు వచ్చే థ్రిల్ మాటల్లో చెప్పలేము. ఈ సినిమాలను చూస్తున్నంత సేపు వాటిలో వచ్చే కొన్ని సన్నివేశాలు వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఇటువంటి సినిమాలను ఒంటరిగా చూడాలంటే పైప్రాణాలు పైకెళ్ళిపోతాయి. గుస్బమ్స్ తెప్పించే ఒక హర్రర్ మిస్టరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేమిటి? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో? వివరాల్లోకి వెళితే…


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video)

ఈ హర్రర్ మిస్టరీ మూవీ పేరు ‘ది షెడ్‘ (The shed). ఈ మూవీలో ఒక షెడ్లో వాంపైర్ దాక్కుంటుంది. దానివల్ల హీరో పడే ఇబ్బందులతో మూవీ స్టోరీ రన్ అవుతుంది. ఈ హర్రర్ మూవీలో కొన్ని సీన్స్ వెన్నులో వణుకు పుట్టిస్తాయి. ఈ హర్రర్ మిస్టరీ మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

హీరో చదువుకుంటూ తన తాతతో కలిసి ఉంటాడు. ఇతనికి రాక్సీ అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. అదే స్కూల్లో డోమర్ అనే రౌడీ బ్యాచ్ హీరోని ఎప్పుడు ఏడిపిస్తూ ఉంటారు. హీరో పిరికిగా ఉండటంతో హీరోయిన్ ఆ రౌడీ బ్యాచ్ లో చేరిపోతుంది. హీరో ఇంటి పక్కనే ఒక షెడ్ ఉంటుంది. సూర్యకిరణాలు పడుతూ ఉండటంతో వాంపైర్ ఆ షెడ్ లో దాక్కుంటుంది. అందులో చప్పుడు రావడంతో హీరో కుక్కని వదులుతాడు. ఆ కుక్కని రెండు ముక్కలు చేసి పడేస్తుంది. భయపడి తన తాతకు చెప్తాడు హీరో. ఆ ముసలి వ్యక్తిని కూడా ఆ షెడ్ లోకి లాక్కొని వెళ్ళిపోతుంది వాంపైర్. హీరో తన తాత చనిపోయినందుకు బాధపడుతూ ఉంటాడు. ఈ విషయం తన ఫ్రెండ్ కు చెప్తాడు. అయితే ఆ రౌడీ బ్యాచ్ ను దీనికి ఆహారంగా వేసేద్దామని హీరో ఫ్రెండ్ అంటాడు. హీరో ఇంటి పక్కన ఒక వ్యక్తి మిస్ అయినట్టు పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తుంది. తనకేం తెలియదన్నట్టు హీరో చెప్తాడు. స్కూల్లో డోమర్ కి హీరోకి మధ్య గొడవ జరుగుతుంది. హీరోని వెంబడిస్తూ డోమర్ ఇంటి దగ్గరికి వస్తాడు.

అయితే ఆషెడ్ లోకి వెళ్లడంతో అతడు వాంపైర్ కి బలైపోతాడు. అలాగే హీరో ఫ్రెండ్, పోలీస్ ఆఫీసర్ తో సహా వాంపైర్ చంపేస్తుంది. అక్కడికి హీరోయిన్ రాక్సీ కూడా వస్తుంది. హీరోయిన్ కి జరిగిన విషయం అంతా చెప్తాడు హీరో. చీకటి పడుతుండటంతో ఇంట్లో అన్ని బంధించుకొని ఉంటారు వీళ్ళిద్దరూ. చివరికి ఆ వాంపైర్ చేతిలో వీళ్ళిద్దరూ బలవుతారా? ఇంతకీ ఆ వాంపైర్ ఎవరు? ఆ వెంపైర్ ఇంకెంతమంది ప్రాణాలను బలి తీసుకుంటుంది? అనే విషయాలను తెలుసుకోవాలంటే ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది షెడ్’ (The shed) హర్రర్ మిస్టరీ మూవీని చూడాల్సిందే.

Related News

OTT Movie : మంత్రగత్తె పెట్టే శాపం … ఊహించని ట్విస్టులు, తట్టుకోలేని భయాలు … క్లైమాక్స్ కూడా మరో లెవల్ సామీ

OTT Movie : స్టోరీ అంతా రాణీగారి డైమెండ్ చుట్టూనే … దిమ్మతిరిగే ట్విస్ట్లు, కన్నింగ్ ఐడియాలతో ఓటీటీ షేక్

OTT Movie : కొండక్కి కంగారు పెట్టే దెయ్యాలు … చలి, జ్వరం వచ్చే సీన్స్ … అమ్మాయిలను దారుణంగా …

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

Big Stories

×