Baby John: ఈరోజుల్లో ఒక సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. రెండోరోజుకే అది సూపర్ హిట్ అని, రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సాధించిందని కొత్త కొత్త పోస్టర్లు రిలీజ్ చేస్తుంటారు మేకర్స్. ఆ పోస్టర్స్‌ను ప్రేక్షకులు ఆశ్చర్యంగా చూస్తుంటారు. మూవీ ఎవ్వరికీ నచ్చకపోయినా ఆ రేంజ్‌లో కలెక్షన్స్ ఎలా వచ్చాయా అని కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇప్పటికే చాలా సినిమాల విషయంలో అలా జరిగింది. తాజాగా ‘బేబి జాన్’ విషయంలో కూడా అదే జరిగింది. ‘బేబి జాన్’ సినిమాకు చాలావరకు డిశాస్టర్ టాక్ లభించింది. అయినా కూడా మేకర్స్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా తమ సినిమాను తాము పొగడడమే పనిగా పెట్టుకున్నారు. ఇదంతా చూసిన ప్రేక్షకులు.. మేకర్స్‌కు ఇంకా బుద్ధి రాలేదని ఫీల్ అవుతున్నారు.
ఓపెనింగ్ డే కలెక్షన్స్
డిసెంబర్ 25న భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘బేబి జాన్’. వరుణ్ ధావన్ (Varun Dhawan) హీరోగా నటించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించాడు అట్లీ. తమిళంలో అట్లీ దర్శకత్వం వహించిన ‘తేరీ’ సినిమాకు ‘బేబి జాన్’ రీమేక్‌గా తెరకెక్కింది. ఈ మూవీ ఎలాగైనా హిట్ అవ్వాలని మేకర్స్ అంతా కలిసి చాలానే కష్టపడ్డారు. దేశవ్యాప్తంగా తిరుగుతూ ప్రమోషన్స్ చేశారు. వరుణ్ ధావన్, అట్లీతో పాటు ఇందులో హీరోయిన్స్‌గా నటించిన కీర్తి సురేశ్, వామికా గబ్బి కూడా దాదాపు ప్రతీ ప్రమోషన్‌లో పాల్గొన్నారు. అయినా కూడా ఈ సినిమాకు మొదటిరోజు కేవలం రూ. 10.75 కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఈ మాత్రం కలెక్షన్స్ మేకర్స్‌ను చాలా హ్యాపీ చేసినట్టున్నాయి.
Also Read: హాలీవుడ్ కాదు.. బాలీవుడ్ బ్యూటీనే.. మహేష్ పక్కన అమెరికా కోడలు ఫిక్స్.. ?
మేకర్స్ సంతోషం
మామూలుగా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రూ.10.75 కోట్లు రావడం అంత డిశాస్టర్‌కు దారితీయదు. కానీ క్రిస్మస్ లాంటి హాలిడే రోజున విడుదలయ్యింది కాబట్టి ఈ సినిమా మరిన్ని ఎక్కువ కలెక్షన్స్ సాధించి ఉంటే అప్పుడు సూపర్ హిట్‌గా నిలిచేది. అన్ని రకాలుగా చూస్తే.. ఈ ఓపెనింగ్ కలెక్షన్స్ చాలా తక్కువే. అయినా కూడా వీటి గురించే చాలా గొప్పగా చెప్పుకున్నారు మేకర్స్. కోవిడ్ తర్వాత ఏ రీమేక్ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో ఓపెనింగ్ కలెక్షన్స్ రాలేదని సంతోషం వ్యక్తం చేశారు. వారు ఏం చెప్పినా కూడా చాలామంది ప్రేక్షకులను ‘బేబి జాన్’ మెప్పించలేకపోయిందనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది.
డిశాస్టర్ లక్షణాలు
ఓపెనింగ్ డే కలెక్షన్సే తక్కువగా ఉన్నాయంటే ‘బేబి జాన్’ (Baby John) రెండో రోజు కలెక్షన్స్ మరింత పడిపోయాయి. దాదాపు 60 శాతం కలెక్షన్స్ తగ్గాయి. రెండో రోజు ఈ సినిమా కేవలం రూ.4.50 కోట్లను మాత్రమే కలెక్ట్ చేసింది. అంటే ఇప్పటివరకు ‘బేబి జాన్’కు మొత్తం రూ.15.25 నెట్ కలెక్షన్స్ మాత్రమే వచ్చాయి. ఇక మూడో రోజు విషయానికొస్తే.. ఈ సినిమాకు టికెట్ సేల్స్ కూడా చాలావరకు తగ్గిపోయాయని తెలుస్తోంది. వీకెండ్ ప్రేక్షకుల సంఖ్య పెరిగితే కలెక్షన్స్ కూడా కాస్తవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.