BigTV English

Year End 2024 : ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలు.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

Year End 2024 : ఫస్ట్ డే భారీ వసూళ్లను రాబట్టిన సినిమాలు.. కలెక్షన్స్ ఎన్ని కోట్లంటే..?

Year End 2024 : ఈ ఏడాది ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేశాయి. జనవరి నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి పండగకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ ను అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నాయి.. ఈ ఏడాది ఎన్నో హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో కొన్ని సినిమాలు మాత్రం ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ ను అందుకున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు ఫస్ట్ డే భారీ కలెక్షన్స్ అందుకున్న సినిమాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం..


పుష్ప 2..

మొదటి రోజు అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలలో తొలుత చెప్పుకోవలసిన సినిమా పుష్ప 2 ది రూల్ . అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది. మైత్రి మూవీ క్రియేషన్స్ ఆధ్వర్యంలో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే రూ. 287 కోట్లు అందుకుంది. ఇక మూడు వారాలు అవుతున్నా కలెక్షన్స్ మాత్రం తగ్గలేదు.. రూ. 1740 కోట్లను వసూల్ చేసింది. బాహుబలి 2 రికార్డులను అందుకోవడంలో చేరువలో ఉంది..


కల్కి 2898 ఏడి..

పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్లో తెరకెక్కిన భారీ బడ్జెట్ మూవీ కల్కి 2898 ఏడి. ఈ సినిమా తొలి రోజు రూ. 191 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి 2024లో తొలి రోజు అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా మొదటి ప్లేస్ లో నిలిచింది. ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో నిలిచింది.

దేవర 1…

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంభోలో తెరకెక్కిన సినిమా దేవర పార్ట్ 1. ఈ మూవీ ఎన్నో అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంచనాలకు తగ్గట్లుగానే తొలిరోజు రికార్డ్ స్థాయిలో రూ. 170 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది.. ఈ ఏడాది ఇండియాలో రిలీజ్ అయిన సినిమాల్లో టాప్ 3 లో ఈ మూవీ ఉంది.

ది గోట్..

తమిళ స్టార్ హీరో విజయ దళపతి, డైరెక్టర్ విక్రమ్ ప్రభు కాంబోలో తెరకెక్కిన సినిమా గోట్. భారీ అంచనాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. విజయ దళపతి కెరీర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ గా నిలిచింది.. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఫస్ట్ డే 105 కోట్లు రాబట్టింది..

స్త్రీ 2..

లేడీ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన స్త్రీ 2 మూవీలో శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా ఎవరు ఊహించని విధంగా తొలిరోజు రూ. 91 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి ఇండియాలో ఫస్ట్ డే అత్యధిక వసూల్ కలెక్ట్ చేసిన టాప్ 5 మూవీగా నిలిచింది..

ఇవే కాదు ఆ తర్వాత మహేష్ బాబు నటించిన గుంటూరు కారం, రజినీకాంత్ వెట్టయాన్, ఆ తర్వాత సింగం అగైన్ వంటి సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×