OTT Movie : రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాలను మూవీ లవర్స్ కసిగా చూస్తారు. ఈ సినిమాలో వచ్చే సన్నివేశాలు అలా ఉంటాయి మరి. యూత్ ఎక్కువగా ఈ సినిమాలను దాదాపు ఒంటరిగానే చూస్తారు. కొన్ని సన్నివేశాలు ఎలా ఉంటాయో మాటల్లో చెప్పలేం. ఈ సన్నివేశాల కోసమే మళ్లీ మళ్లీ సినిమాలను చూస్తూ ఉంటారు రొమాంటిక్ మూవీ లవర్స్. అటువంటి కైపెక్కించే ఒక మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఎందులో స్ట్రింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.
నెట్ ఫ్లిక్స్ (Netflix)
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ (Vicky Vidya Ka Woh Wala Video). ఈ మూవీలో త్రిప్తి దిమ్రి, మల్లికా శెరావత్ ప్రధాన పాత్రలు పోషించారు. వీళ్ళ అందాలతో కుర్ర కారుకు పిచ్చెక్కించారు. యానిమల్ సినిమాలో త్రిప్తి దిమ్రి హాట్ సీన్స్ మరవకముందే, ఈ మూవీలో బెడ్ సీన్స్ హల్చల్ చేస్తున్నాయి. బాలీవుడ్ యాక్టర్ రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ మూవీకి రాజ్ షాందియా దర్శకత్వం వహించారు. ఈ రొమాంటిక్ మూవీ డిసెంబర్ 7 నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది. భార్య భర్తల ప్రైవేట్ వీడియొ లీక్ అవ్వడంతో మూవీ స్టోరీ నడుస్తుంది.
స్టోరీలోకి వెళితే
కొత్తగా పెళ్లయిన భార్యాభర్తలు ఫస్ట్ నైట్ రోజును ఎప్పటికీ గుర్తుంచుకోవాలని మాట్లాడుకుంటారు. అయితే వీళ్లు ఏకాంతంగా గడిపే సమయాన్ని వీడియోలో భద్రపరచాలి అనుకుంటారు. అనుకున్నదే పనిగా ఏకాంత సన్నివేశాలను ఒక వీడియోలో భద్రపరుస్తారు. ఇలా భద్రపరిచిన వీడియోను అప్పుడప్పుడు చూడాలని అనుకుంటారు. ఆ తర్వాత ఆ ఇంట్లోకి కొంతమంది దొంగలు పడతారు. కొన్ని వస్తువులతో పాటు రికార్డు చేసిన వీడియోని కూడా తీసుకొని దొంగలు వెళ్ళిపోతారు. వీడియో ఉన్న వస్తువు దొంగతనం జరిగిందని తెలుసుకున్న ఈ భార్యాభర్తలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఆ సిడి ఎక్కడ బయటపడి తమ పరువు పోతుందని బాధపడుతూ ఉంటారు. వీళ్లు ఆ వీడియో ఉన్న వస్తువును వెతకడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. వీళ్ళు చేసే ప్రయత్నాలు కొన్ని నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. అయితే చివరికి ఈ వీడియో వీళ్లకు దొరికిందా? ఈ వీడియోని బయట వాళ్ళు ఎవరైనా చూశారా? పోలీసులకు వీళ్ళు ఏమైనా సమాచారం ఇచ్చారా? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఓటిటి ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’ (Vicky Vidya Ka Woh Wala Video) మూవీని తప్పకుండా చూడాల్సిందే. మల్లికా శెరావత్, త్రిప్తి దిమ్రి నటించిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. వీళ్ళు అందాలతో మతి పోగొట్టారు. మరి ఎందుకు ఆలస్యం ఎవరూ లేనప్పుడు ఒంటరిగా ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి.