BigTV English

OTT Movie : వరుసగా టూరిస్టులు మిస్సింగ్…. ఫహద్ ఫాజిల్ క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : వరుసగా టూరిస్టులు మిస్సింగ్…. ఫహద్ ఫాజిల్ క్రేజీ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : మలయాళం క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఓటిటి ప్లాట్ ఫామ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ సినిమాలు మంచి కంటెంట్ తో తెరమీదకు వస్తున్నాయి. మిస్టరీ, సస్పెన్స్, సైకలాజికల్, క్రైమ్ థ్రిల్లర్ జానర్ల సినిమాలను తెరకెక్కించడంలో మలయాళం ఇండస్ట్రీ మేకర్స్ చాలా ముందుంటారు. సింపుల్ స్టోరీలను ఊహించని ట్విస్టులతో తెరమీదకు తీసుకువస్తారు మలయాళం దర్శకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా కూడా అలాంటి సినిమానే. మలయాళం ఇండస్ట్రీ లో ఫహద్ ఫాజిల్ ఎంతటి విలక్షణ నటుడో అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా మూవీ గా వచ్చిన పుష్ప అందుకు నిదర్శనం. ఈ నటుడికి మలయాళం లో మంచి క్రేజ్ ఉంది. ఫహద్ ఫాజిల్ నటించిన ఒక సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్  మూవీ ఓటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఏ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.


సోనీ లివ్  (Sony Liv)

ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘బౌగెన్ విలియా‘ (Bougen viliya). ఈ మూవీ డిసెంబర్ 13 నుంచి ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులో కూడా సోనీ లివ్  (Sony Liv) లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఒక ట్రైలర్ ని కూడా రిలీజ్ చేశారు మకర్స్. ఒక క్రైమ్ లో ఇరుక్కొనే హీరోయిన్ ను హీరో కాపాడే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది.


స్టోరీ లోకి వెళితే

హీరో హీరోయిన్లు తమ పిల్లలతో సంతోషంగా జీవితం సాగిస్తూ ఉంటారు. వీరి లైఫ్ లో జరిగిన ఒక ప్రమాదం అనుకోని మలుపులు తిరుగుతుంది. ఆ ప్రమాదం తర్వాత హీరోయిన్ గతాన్ని మరిచిపోతుంది. హీరోయిన్ కి ప్రమాదం జరిగిన తర్వాత గతాన్నిమరచవపోవడంతో, కొన్ని సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ మూవీలో కేరళ కి వచ్చే టూరిస్టులు కొంతమంది కనిపించకుండా పోతారు. టూరిస్టుల మిస్సింగ్ కేసులో అనుకోకుండా హీరోయిన్ ఇరుక్కుంటుంది. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తూ డిటెక్టివ్ కొన్ని విషయాలను బయటకి తీసుకువస్తాడు. దానితోపాటు హీరో, హీరోయిన్ ను కాపాడే సన్నివేశాలతో మూవీ స్టోరీ నడుస్తుంది. అసలు ఆమె ఈ కేసులో హీరోయిన్ ఎలా ఇరుక్కుంది? ప్రమాదం తర్వాత ఆమె జీవితంలో ఏం జరిగింది? హీరో తన భార్యను ఈ కేసు నుంచి ఎలా కాపాడుకుంటాడు? అనే విషయాలుతెలుసుకోవాలంటే ఓటిటి ప్లాట్ ఫామ్ సోనీ లివ్  (Sony Liv) లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ  బౌగెన్‌విలియా (Bougen viliya) అనే మూవీని తప్పకుండా చూడాల్సిందే. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఈ సైకలాజికల్ క్రైం థ్రిల్లర్ మూవీకి అమల్ నీరథ్ దర్శకత్వం వహించాడు. ఈ ఏడాది అక్టోబర్ 17న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. మరి ఎందుకు ఆలస్యం ఫహద్ ఫాజిల్ నటించిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా ఓటిటి  ప్లాట్ ఫామ్ లో చూసేయండి.

Related News

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

OTT Movie : రియల్ కల్ట్ క్రైమ్‌… మతం పేరుతో మతిపోగోట్టే పనులు… మర్డర్ మిస్టరీతో ఊహించని టర్న్

Big Stories

×