Bigg Boss 8 Telugu Latest Episode Highlights: బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే వీక్‌కు చేరుకుంది. ఫైనల్స్‌కు ఇంకా కొన్నిరోజులే ఉండడంతో కంటెస్టెంట్స్‌లో గొడవలు ఏమీ లేవు. వారంతా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఈ కొన్నిరోజులు తృప్తిగా గడపాలని అనుకుంటున్నారు. ఇక ప్రతీ సీజన్‌లో లాగానే ఈ సీజన్‌లో కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలను ముందుగానే చూపించి, వారి జర్నీ గురించి గొప్పగా మాట్లాడి అందరినీ హ్యాపీ చేయనున్నారు బిగ్ బాస్. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో గౌతమ్, అవినాష్ జర్నీ వీడియోలు చూపించగా వారు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. వారికి ఓటు వేస్తున్న ప్రేక్షకులు సైతం ఇది చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఒంటరి పోరాటం
ముందుగా గౌతమ్‌ను తన జర్నీ వీడియో చూపించడానికి గార్డెన్ ఏరియాలోకి పిలిపించారు బిగ్ బాస్. అక్కడ తను ఆడిన టాస్కులు అన్నింటికి సంబంధించిన వస్తువులను పెట్టారు. అవన్నీ చూసి బిగ్ బాస్ 8లో తన జర్నీని మరొకసారి గుర్తుచేసుకున్నాడు గౌతమ్. తాను మెగా చీఫ్ అయిన వారాన్ని కూడా గుర్తుచేసుకొని సంతోషంగా ఫీలయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 7 తర్వాత సీజన్ 8లో తనకు ఛాన్స్ రావడం అనేది తనకు సెకండ్ ఛాన్స్‌గా భావిస్తున్నానని, దానిని తాను పూర్తిస్థాయిలో వినియోగించుకునే ప్రయత్నం చేశానని తెలిపాడు. ఆ తర్వాత తన జర్నీ వీడియో చూసుకున్నాడు. అందులో తను యష్మీతో చేసిన ఫ్లర్టింగ్‌లో, ప్రతీ టాస్క్‌లో చేసిన ఒంటరి పోరాటం, ఎమోషనల్ అయిన మూమెంట్స్ అన్నీ ఉన్నాయి.
Also Read: గౌతమ్‌కు గెలుపు శాతం ఎంతంటే.?
మర్యాద దక్కింది
తనకు చిన్నప్పటి నుండి మర్యాద అనేది దొరకలేదు, ఇప్పుడు తనకు ఓటు వేసి ఫైనల్స్ వరకు తీసుకొచ్చిన ఆడియన్స్‌ను చూస్తుంటే వారి దగ్గర నుండి మర్యాద సంపాదించుకున్నానని గర్వంగా ఫీలయ్యాడు. బిగ్ బాస్ 8లోకి వచ్చే ముందు తన తల్లిని గర్వపడేలా చేస్తానని చెప్పి వచ్చానని, నిజంగానే తను గర్వపడేలా చేశానని సంతోషం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత హౌస్‌లోకి వచ్చి తను జర్నీ వీడియోలు చూసుకుందంతా కంటెస్టెంట్స్‌తో షేర్ చేసుకున్నాడు. ఆ తర్వాత అవినాష్‌కు తన జర్నీ వీడియో చూసుకునే అవకాశం దక్కింది. అక్కడే ఆల్బమ్‌లో ఉన్న తన ఫోటోలు చూసుకొని ఎమోషనల్ అయ్యాడు అవినాష్. ముఖ్యంగా అనుతో ఉన్న ఫోటోను తనకు ఇచ్చేయమని రిక్వెస్ట్ చేసుకున్నాడు.
రోహిణి కోసమే
అవినాష్ అంటే అసలైన ఎంటర్‌టైనర్ అని చాలామంది ప్రేక్షకులు అంటూనే ఉన్నారు. ఇక బిగ్ బాస్ కూడా మొదటిసారి అవినాష్ ఎంటర్‌టైన్మెంట్ గురించి తన స్టైల్‌లో పొగిడారు. దీంతో అవినాష్ చాలా సంతోషించారు. తన జర్నీ వీడియోలో ముందుగా తను, రోహిణి, టేస్టీ తేజ చేసిన అల్లరి గురించి చూపించారు. ఆ తర్వాత కంటెస్టెంట్స్‌తో పడిన గొడవలు, ఫైనలిస్ట్ అయిన మూమెంట్ చూపించారు. వీడియో చూసిన తర్వాత తనది మామూలుగా ఎవరితో గొడవపడే స్వభావం కాదని, కానీ తన ఫ్రెండ్ కోసం తాను నిలబడ్డానని చెప్తూ రోహిణిని గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు అవినాష్. టాప్ 5కు చేరుకున్నందుకు మరోసారి సంతోషం వ్యక్తం చేశాడు.