OTT Movies : డిసెంబర్ చివరి వారం క్రిస్మస్ కానుకగా థియేటర్లలో సినిమాలు విడుదల అవుతున్నాయి. అంతగా చెప్పుకొనే పెద్ద సినిమాలు ఏవి లేవు.. మోహన్ లాల్ ‘బరోజ్’, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మాక్స్, ఎర్రచీర, డ్రింకర్ సాయి, అటు హిందీలో కీర్తి సురేష్ నటించిన బేబీ జాన్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు పోటీ పడుతున్నాయి.. వచ్చే ఏడాది జనవరిలో భారీ బడ్జెట్ మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి.. ముఖ్యంగా బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్, రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నారు. అందులో ఎక్కువ మంది గేమ్ ఛేంజర్ సంక్రాంతి విన్నర్ అవుతుందని అంటున్నారు. మరి బాక్సాఫీస్ ను ఏ మూవీ షేక్ చేస్తుందో చూడాలి..
ప్రస్తుతం థియేటర్లలో ఇంకా పుష్ప 2 మూవీ కొనసాగుతుంది.. మూడు వారాలు అవుతున్నా కలెక్షన్స్ తగ్గలేదు. రీసెంట్ గా మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కాని ఏ ఒక్కటి అంతగా టాక్ ను సొంతం చేసుకోలేకపోయాయి. ఇక ఓటీటీ రిలీజ్ అవుతున్న సినిమాలను చూస్తే.. ఈ వారం 20 సినిమాలు రిలీజ్ అవ్వగా, రెండు వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. మరి ఓటీటీలో ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఎక్కడ చూడాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
అమెజాన్ ప్రైమ్..
చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 24
గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 25
జంప్ స్టార్ట్ మై హార్ట్ (స్పానిష్ సిరీస్) – డిసెంబర్ 25
థానారా (మలయాళ సినిమా) – డిసెంబర్ 27
యువర్ ఫాల్ట్ (స్పానిష్ మూవీ) – డిసెంబర్ 27
పార్టీ టిల్ డై (హిందీ సిరీస్) – డిసెంబర్ 24 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)
హాట్‌స్టార్..
డాక్టర్ హూ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 25
బఘీరా (హిందీ డబ్బింగ్ సినిమా) – డిసెంబర్ 25
నెట్‌ఫ్లిక్స్..
యువర్ ఫ్రెండ్, నటా బర్గేట్జ్ (ఇంగ్లీష్ సినిమా) – డిసెంబర్ 24
ఆరిజిన్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 25
ఆస్ట్రాయిడ్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 25
స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) – డిసెంబర్ 26
భూల్ భులయ్యా 3 (హిందీ సినిమా) – డిసెంబర్ 27
సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) – డిసెంబర్ 27
మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ సిరీస్) – డిసెంబర్ 28
జీ5..
ఖోజ్: పర్చైన్ కే ఉస్ పర్ (హిందీ సినిమా) – డిసెంబర్ 27
జియో సినిమా..
డాక్టర్స్ (హిందీ సిరీస్) – డిసెంబర్ 27
సురక్ష (భోజ్‌పురి మూవీ) – డిసెంబర్ 27
మనోరమ మ్యాక్స్..
పంచాయత్ జెట్టీ (మలయాళ సినిమా) – డిసెంబర్ 24
ఐ యామ్ కథలన్ (మలయాళ మూవీ) – డిసెంబర్ 25
డిస్కవరీ ప్లస్..
హ్యారీపోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్ (ఇంగ్లీష్ సిరీస్) – డిసెంబర్ 27
లయన్స్ గేట్ ప్లే..
మదర్స్ ఇన్‌స్టింక్ట్ (ఇంగ్లీష్ మూవీ) – డిసెంబర్ 27
మూవీ లవర్స్ కు పండగనే చెప్పాలి.. ఈ వారం ఏకంగా 22 సినిమాలు ఓటీటీలోకి విడుదల అవుతున్నాయి. అందులో ‘సొర్గవాసల్’, ‘భూల్ భులయ్యా 3’, ‘గ్లాడియేటర్ 2’ మాత్రమే కాస్త చెప్పుకోదగ్గ సినిమాలు.. మీకు నచ్చిన సినిమాను మీరు చూసి ఎంజాయ్ చెయ్యండి..