BigTV English

Kasturi Shankar: జైల్లో అల్లు అర్జున్.. బట్టలు విప్పించి.. ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి..షాకింగ్ విషయాలు బయటపెట్టిన కస్తూరి

Kasturi Shankar: జైల్లో అల్లు అర్జున్.. బట్టలు విప్పించి.. ప్రైవేట్ పార్ట్స్ చెక్ చేసి..షాకింగ్ విషయాలు బయటపెట్టిన కస్తూరి

Kasturi Shankar: సీనియర్ నటి కస్తూరి శంకర్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాలో పచ్చని చిలుకలు తోడుంటే అంటూ తల్లిదండ్రులతో కలిసి ఆడిపాడిన చిన్నది కస్తూరినే.  ఈ సినిమా  హిట్ తరువాత ఆమెకు అటు తెలుగులోనూ, ఇటు తమిళ్ లోనూ మంచి గుర్తింపును అందుకుంది.  ఆ తరువాత తెలుగులో చిలకొట్టుడు, అన్నమయ్య లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించింది. చాలాకాలం తరువాత మా టీవీలో ప్రసారమేయ్యే ఇంటింటి గృహాలక్షీ అనే సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.


ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని కొన్నేళ్లు సినిమాలకు దూరమైన కస్తూరి.. వివాదాలతో మళ్లీ ఫేమస్ అయ్యింది. ఒక డాక్టర్ ను వివాహమాడి అమెరికాకు వెళ్లిపోయిన ఆమె.. ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలోనే బిడ్డకు పాలు ఇస్తూ అర్థనగ్నంగా ఫోటోషూట్ చేసింది. ఈ ఫొటోస్ అప్పట్లో పెను సంచలనాన్ని సృష్టించాయి. అక్కడ నుంచి ఆమె వివాదాల చిట్టా మొదలయ్యింది. నిత్యం హాట్ హాట్  టాపిక్ ఏది నడిస్తే దాని మీద వ్యంగ్యాస్త్రాలు వదలడం అలవాటుగా మార్చుకుంది.

Tollywood Actors: ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి.. టాలీవుడ్ హీరోలకు కాంగ్రెస్ ఎమ్మేల్యే క్లాస్


ఇక ఆ నోటి దూల వలనే  కస్తూరి జైలుకు వెళ్లివచ్చింది. ఈ మధ్యనే ఆమె తెలుగువారిపై నోరు పారేసుకోవడంతో ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ” 300 ఏళ్ల క్రితం ఒక తమిళ రాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. కొన్నాళ్ళకు తమది తమిళజాతి అని చెప్పుకున్నారు” అంటూ మాట్లాడింది. కస్తూరి మాటలపై తెలుగువారు దుమ్మెత్తిపోశారు. ఆమెపై కేసుపెట్టి జైలుకు పంపారు. ఇటీవలే కస్తూరి బెయిల్ ద్వారా బయటకు వచ్చింది.

ఇక తాజాగా  ఒక ఇంటర్వ్యూలో ఆమె జైలు జీవితం గురించి చెప్పుకొచ్చింది. జైల్లో ఎంత ఘోరమైన జీవితాన్ని అనుభవించిందో పూసగుచ్చినట్లు తెలిపింది. ఈ మధ్య సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ కూడా జైలుకు వెళ్లిన  విషయం తెల్సిందే. జైల్లో తనకు ఏదైతే జరిగిందో.. అల్లు అర్జున్ కు కూడా అదే జరిగి ఉంటుందని కస్తూరి చెప్పడం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Mohan Babu Case : మోహన్ బాబుకు మరో షాక్… ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

” జైలు జీవితం ఒక అడ్వెంచర్. స్ట్రిప్ సెర్చ్.. అల్లు అర్జున్ గారికి కూడా కచ్చితంగా అది జరిగే ఉంటుంది. స్ట్రిప్ సెర్చ్ అంటే.. ఎలా పుట్టామో.. అలా నిలబెడతారు. లేడీస్ కు అయితే ఎద భాగం ముట్టి.. బాడీలో ఏదైనా పెట్టుకున్నామా.. ఏదైనా దాచుకున్నామా అని చెక్ చేస్తారు.   బాడీ ప్రైవేట్ పార్ట్స్ లో ఏమైనా ఉందా అని కూడా చెక్ చేస్తారు. అంటే  పట్టుకోరు.. స్క్వార్ట్స్   చేయిస్తారు. మూడుసార్లు పైకి లేచి మోకాళ్ళ మీద  కూర్చోవాలి. ఎందుకు చేయిస్తున్నారు నేటి.. లోపల ఏదైనా దాస్తే బయటకు వస్తుందేమో అని.

మాములు లైఫ్ లీడ్ చేసి లోపలకు వెళ్తేనే 100 శాతం చచ్చినట్లు ఉంటుంది. చాలా కంఫర్ట్ నుంచి దిగజారిపోయి  ఆ లైఫ్ కు వెళ్తే  ఇంకేలా ఉంటుంది. అప్పటికీ నేను మూడుసార్లు అడిగాను. ఏంటి బట్టలు అన్ని తీసెయ్యాలా.. ? అని. వారికి పోలీసులు అవును తీయ్ అని అనకుండా.. మేడమ్  ఇది ప్రాసెస్.. చేయాలి అని సాఫ్ట్ గా చెప్పారు. వాళ్లకు వీలైనంత వరకు నన్ను గౌరవంగానే అడిగారు. కానీ, నేను చేరి తీరాలి కదా.

Pawan Kalyan: పవన్ పర్యటన.. మన్యంలో అసలేం జరుగుతోంది?

అల్లు అర్జున్ గారు లోపలోకి వెళ్లే లోపు బెయిల్ వస్తుంది అని  అనుకున్నాను. జైలు కు వెళ్ళారా.. ? ప్రిజనర్ రికార్డ్ ఉంది. ఫోటో తీసి ఉంటారు. నంబర్ ఇచ్చి ఉంటారు. నాకు అదంతా జరిగింది. నన్ను ఫోటో తీశారు.. నంబర్ ఇచ్చారు.  తప్పు చేశాను లేదు అనేది తరువాత విషయం. అక్కడ ఒక గంజా అమ్మినవాడు, ఒక హత్య చేసిన వాడు.. నేను కలిసే ఉండాలి.  అలానే నేను క్వారెంటైన్ కు వెళ్ళాను” అని చెప్పుకొచ్చింది.

ఇక కస్తూరి చెప్పిన వ్యాఖ్యలు విన్నాకా.. బన్నీకి కూడా కచ్చితంగా ఇలానే చేశారా.. ? నగ్నంగా నిలబెట్టారా.. ? బన్నీ లోపలి వెళ్లకముందే బెయిల్ వచ్చింది. కాకపోతే ప్రాసెస్ లేట్ అవుతుందని నైట్ ఆయనను జైల్లోనే ఉంచారు. ఒక్కసారి లోపలి అడుగుపెడితే కచ్చితంగా కస్తూరి చెప్పినట్లే చేసి ఉంటారా.. ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉన్నాయి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×