Sarangapani Jathakam OTT: గతంలో సినిమాల్లో కమెడియన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రియదర్శి. జబర్దస్త్ వేణు డైరెక్టర్ గా తీసిన మొదటి సినిమా బలగంలో హీరోగా నటించారు ప్రియదర్శి. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోకుండా.. హీరోగా పలు సినిమాల్లో నటించే అవకాశాలను అందుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్తున్నాడు.. సినిమాలు మాత్రమే కాదు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి టాక్ ని సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రియదర్శి పంట పండింది. నాని నిర్మించిన కోర్టు మూవీలో నటించాడు. ఆ మూవీ భారీ అందుకోవడంతో ఆ తర్వాత సారంగపాణి జాతకం సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. ఈ మూవీ మిక్స్డ్ డిటాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించింది.. ఈ మూవీ సడెన్ గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇక ఆలస్యం ఎందుకు ఏ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుందో ఓ లుక్ వేద్దాం పదండీ..
ఓటీటీ డీటెయిల్స్..
ప్రియదర్శి హీరోగా, రూపా కొడవాయూర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ చిత్రం సారంగపాణి జాతకం. ఈ చిత్రం ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే సడన్‌గా డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చి అందరినీ ఆశ్చర్య పరిచింది.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ , శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణ ప్రసాద్ కాంబినేషన్‌లో ‘జెంటిల్ మన్, సమ్మోహనం’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రాల తర్వాత ముచ్చటగా మూడవ చిత్రంగా ఈ మూవీ వచ్చింది.. మొదటినుంచి భారీ అంచనాలనే క్రియేట్ చేసుకున్న ఈ మూవీ థియేటర్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ కామెడీ వర్కౌట్ అవ్వడంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఇక ఈ మూవీ తాజాగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది. తెలుగుతో పాటు ఇతర సౌత్ భాషల్లోనూ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో సినిమా మిస్సయిన వారు, కాలక్షేపం కోసం ఈ సారంగపాణి జాతకం సినిమాను ఇక్కడ చూసి ఎంజాయ్ చెయ్యండి.
Also Read : పవన్ మూవీ ఎఫెక్ట్.. మరోసారి ‘కుబేర’ వాయిదా..?
ఈ మూవీ స్టోరీ విషయానికొస్తే..
టైటిల్ కు తగ్గట్లుగానే ఈ మూవీ స్టోరీ ఉంటుందని అర్థమవుతుంది. చిన్నప్పటి నుంచి అతనికి జాతకాలంటే పిచ్చి ఉన్న సారంగపాణి తను సెల్స్ మెన్‌గా పనిచేసే కార్ షోరూమ్ మేనేజర్ మైథిలి తో ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి, ఇద్దరూ పెళ్ళి చేసుకుందాం అనుకుంటారు. ఆ సమయంలో సారంగ చేయి చూసిన జిగేశ్వర్ అతని జాతకంలో ఓ చిక్కుముడి ఉందని చెబుతాడు.. దీంతో సారంగపాణి పెళ్లిని వాయిదా వేసుకుంటాడు. ఆ తర్వాత మైధిలితో పెళ్లిని పీటల వరకు తీసుకెళ్తాడా..? లేదా జాతకాల పిచ్చితో ఆపేస్తాడా అన్నది మిగతా స్టోరీ.. థియేటర్లలో పెద్దగా ఆకట్టుకొని ఈ సినిమా ఇక్కడైనా మంచి వ్యూస్ నేను రాబడుతుందేమో చూడాలి..