Kubera Movie: తమిళ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం కుబేర.. టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ డిఫరెంట్ థ్రిల్లర్ లో నాగార్జున, రష్మిక మందన్న, జిమ్ సర్భ్, దలీప్ తాహిల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. ఈ మూవీని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ సినిమా తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. ఫిదా, లవ్ స్టోరీ లాంటి సినిమాలతో మంచి టాక్ ని సొంతం చేసుకున్న డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈసారి రూట్ మార్చారు. కాస్త కొత్తగా ఉండేలా మెసేజ్ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. అయితే ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుందని తెలిసిందే. ఇప్పుడు సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ఓ వార్త అయితే సోషల్ మీడియాలో వినిపిస్తుంది. దీనిపై కుబేర టీం స్పందించారేమో చూడాలి..
జూన్ లో ‘కుబేర ‘ రిలీజ్..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం కుబేర. ఫ్యామిలీ కథా చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. ముందుగా ప్రకటించిన జూన్ 20వ తేదీనే సినిమాను రిలీజ్ చేస్తామని తెలిపింది. అసలైతే గత ఏడాది డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు. అది కూడా పోయింది.. ముందుగా అనుకున్నట్లు షూటింగ్ ఫినిష్ కాలేదు. ఇక సమ్మర్ లో కూడా ప్లాన్ వర్కౌట్ కాలేదు. దాంతో ఈ సినిమాని జూన్ కి షిఫ్ట్ చేశారు. జూన్లో పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కాకపోవడంతో 20వ తేదీన థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు అదే తేదీన కూడా సినిమాను రిలీజ్ చెయ్యడానికి యూనిట్ రెడీగా లేరని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం పవన్ కళ్యాణ్ అని తెలుస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ కి కుబేర సినిమా పోస్ట్ పోన్ అవ్వడానికి కారణం అని ఓ వార్త ఫిల్మ్ ఇండస్ట్రీలో కోడై కూస్తుంది.
పవన్ కళ్యాణ్ దెబ్బకు మళ్లీ వెనక్కి..
కుబేర సినిమా కొన్ని కారణాలవల్ల షూటింగ్ పూర్తికాక విడుదల వాయిదా పడుతూ వచ్చింది. మొత్తానికి ఒక డేట్ ని లాక్ చేసుకుని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్స్ సన్నాహాలు చేసింది. అయితే ఆ కష్టమంతా విడుదల పోసిన పన్నీర్ గానే మారింది.. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ ఓ వార్త వినిపిస్తుంది. అసలు మ్యాటర్ ఏంటంటే.. జూన్ 12 న పవన్ కళ్యాణ్ నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ‘కుబేర’ చిత్రం నిజంగా వాయిదా పడి ఉంటే ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి రెండవ వారం కూడా ఫ్రీ గ్రౌండ్ దొరుకుతుంది. టాక్ వస్తే బయ్యర్స్ కి జాక్పాట్ తగిలినట్టే అనుకోవచ్చు. అయితే ఈ సినిమా వాయిదా పడిందా? లేదా? అనే విషయం మాత్రం తెలియదు. ఒకవేళ ఈ వార్తలు నిజం అయితే మాత్రం జూలై 10 న సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రాబోతుంది..
Also Read : బిగ్ బాస్ 9 హోస్ట్ రెమ్యూనరేషన్ పెరిగిందా..? ఎన్ని కోట్లంటే..?
స్టోరీ విషయానికొస్తే..
ఇక ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయినా ప్రతి అప్డేట్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ సినిమాపై భారీ బజ్‌ను క్రియేట్ చేశాయి. గ్లింప్స్‌లో ధనుష్ ఒక బిచ్చగాడి పాత్రలో, నాగార్జున ఒక పోలీస్ ఆఫీసర్ గా, రష్మిక మిడిల్ క్లాస్ అమ్మాయిగా కనిపించారు. ఈ సినిమా సంపద, ఆశ, నైతిక సందిగ్ధతల చుట్టూ తిరుగుతుందని, పాత్రల మధ్య ఎమోషనల్ డ్రామా హైలైట్‌గా ఉంటుందని అంటున్నారు.. మొత్తానికి ఈ సినిమాపై గట్టి నమ్మకంతోని మేకర్స్ ఉన్నారు. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..