RC Unstoppable Part 2 Leak :టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా పేరు సొంతం చేసుకున్నారు ప్రభాస్(Prabhas). వయసు 40 ఏళ్లు దాటినా.. ఇంకా వివాహానికి మాత్రం నోచుకోలేదు. దీంతో తమ డార్లింగ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు? అని అభిమానులతో పాటు టాలీవుడ్ కూడా ఎదురుచూస్తోంది. ఒక రెండేళ్ల క్రితం భీమవరానికి చెందిన రాజుల అమ్మాయిని వివాహం చేసుకుంటాడనే వార్తలు వినిపించాయి. కానీ ఎందుకో అది కేవలం గాసిప్ గానే మిగిలిపోయింది. మరోవైపు ఉప్పలపాటి ప్రభాస్ నుండి గ్లోబల్ రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ కి చేరుకున్న ఈయన పెళ్లి కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ప్రభాస్ పెళ్లిపై రామ్ చరణ్ కామెంట్స్..
ఇకపోతే వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈయన.. ఇప్పటికీ పెళ్లి గురించి మాట్లాడకపోవడంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానులకు తాజాగా గుడ్ న్యూస్ చెబుతూ.. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రభాస్ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. అసలు విషయంలోకెళితే.. ప్రస్తుతం రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నందమూరి బాలయ్య(Nandamuri Balakrishna) హోస్ట్గా వ్యవహరిస్తున్న “అన్ స్టాపబుల్ సీజన్ ఫోర్ ఎపిసోడ్ 9” గెస్ట్ గా విచ్చేశారు. ఈ టాక్ షోలో భాగంగా మొదటి పార్ట్ ను విడుదల చేయగా.. రెండవ పార్ట్ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే మొదటి పార్ట్ చివర్లో విడుదల చేసిన ప్రోమోలో రెబల్ స్టార్ ప్రభాస్ తో ఫోన్ సంభాషణ ఎపిసోడ్ కే హైలెట్ గా నిలిచింది. అయితే ఇప్పుడు రెండవ పార్ట్ కు సంబంధించిన ఈ విషయం తాజాగా లీక్ అవడంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిది ఆ ఊరే..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి వెస్ట్ గోదావరి జిల్లా గణపవరం పట్టణానికి చెందినట్టు, ఈ షోలో రామ్ చరణ్ తెలిపారు. అయితే రామ్ చరణ్ ఈ విషయాన్ని పర్టికులర్ గా చెప్పలేదు కానీ, చెప్పి చెప్పనట్టు చెప్పడంతో రామ్ చరణ్ స్వయంగా ప్రభాస్ ఫ్రెండ్ కాబట్టి ఈ వ్యాఖ్యలు చేయడంతో నిజం అయి ఉండవచ్చు అని అభిమానుల సైతం ఫిక్స్ అయిపోతున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఆంధ్రప్రదేశ్లోని గణపవరం అనే ప్రాంతానికి చెందినవారు. మరి అమ్మాయి ఎలా ఉంటుంది ? ప్రభాస్ హైట్ కు తగ్గట్టుగా సరిపోతుందా? లేదా? అని అప్పుడే ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మొత్తానికైతే ఈ ఏడాది డార్లింగ్ పెళ్లి పీటలు ఎక్కడమైతే గ్యారెంటీ అని అభిమానులు సైతం ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పవచ్చు. ఏది ఏమైనా ప్రభాస్ పెళ్లి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు నోట్లో చక్కర పోసినట్టు చెప్పి అందరిని సంబరపరిచారు రామ్ చరణ్ అంటూ రాంచరణ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ చెప్పినట్టు ప్రభాస్ పెళ్లి ఎప్పుడో చూడాలి.