OTT Movie : ఎంటర్టైన్మెంట్ కు కేరాఫ్ అడ్రస్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ఇప్పుడు వేదికగా మారాయి. థియేటర్లకు వెళ్లి సినిమాలను చూసేవారి సంఖ్య ఉన్నప్పటికీ, ఓటీటీ ప్లాట్ ఫామ్ ని అనుసరించే వారి సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. వీటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ గా పేరు తెచ్చుకుంది. ఇందులో నచ్చిన సినిమాలను ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొనే వీలు ఉంటుంది. అందుకే థియేటర్లకన్నా ఈ ఓటీటీ ప్లాట్ ఫామ్ కి ఆదరణ పెరుగుతోంది. అయితే ఇదివరకులా కాకుండా ఇప్పుడు అంటే 2025 జనవరి 1 నుంచి కొత్త రూల్స్ ను అమలులోకి తీస్తోంది అమెజాన్ ప్రైమ్ వీడియో. వివరాల్లోకి వెళితే…
అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ తీసుకొనేవాయికి కొత్త రూల్స్ ను ప్రవేశపెట్టింది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ని వాడే యూజర్స్ ఒక సబ్స్క్రిప్షన్ వాడితే వాటిలో లాగిన్ అయ్యే డివైసెస్ సంఖ్యను పరిమితం చేసింది. 2025 జనవరి నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రైబర్స్ ఐదు డివైజ్ ల నుండి లాగిన్ అవ్వచ్చు. రెండు టీవీలకు మాత్రమే లాగిన్ ఫెసిలిటీ ఉంటుంది. మిగతా డివైజస్ లాప్టాప్, మొబైల్ మాత్రమే యూస్ చేయవచ్చు. ఇవన్నీ కలుపుకొని ఐదు డివైస్లకు సబ్స్క్రిప్షన్ పరిమితి చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video). అదనపు యాక్సెస్ కావాలంటే యూసర్లు ప్రత్యేకంగా సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. ఈ కొత్త రూల్స్ ను ఇప్పటికే వినియోగదారులకు మెయిల్ రూపంలో సమాచారం ఇచ్చింది అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video). వీటిని ఎలా అప్ గ్రేట్ చేసుకోవాలో అన్ని వివరాలను కూడా పొందుపరిచింది. ఇక వేరొకరితో పంచుకొనే సబ్ స్క్రిప్షన్ ల సంఖ్య పరిమితి అవుతుంది. మూవీ లవర్స్ ఎక్కువగా ఓటిటి ప్లాట్ ఫామ్ పై ఆధారపడుతున్నారు.
ఇలా ప్రైమ్ వీడియో నిబంధనలు పెట్టడం వలన యూజర్స్ కి కొంచెం బాధ కలిగించే విషయమని చెప్పుకోవాలి. హాట్ స్టార్ (Hotstar) నెట్ఫ్లిక్స్ (Netflix) జి ఫైవ్ ( Zee 5) వంటి అనేక ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఇదివరకే డివైస్లలో చూసే సంఖ్యను పరిమితి చేశాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇప్పటివరకు పరిమితి చేయకుండా ఈ డివైస్ ల సంఖ్యను అలాగే ఉంచింది. అయితే ఇప్పుడు 2025 జనవరి 1 నుంచి యూసర్లు వాడే ఈ డివైస్ల సంఖ్యను తగ్గించింది. అయితే డివైస్ ల సంఖ్యను పెంచుకోవడానికి ప్రత్యేకమైన ప్లాన్లు తీసుకొచ్చింది ప్రైమ్ వీడియో. వీటితో నచ్చిన వ్యక్తులతో లాగిన్ ను పంచుకునే వీలు ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) చూసే సబ్స్క్రైబర్లకు ప్రారంభ ధర 299 రూపాయలు ఉంది. సంవత్సరానికి గాను 1499 రూపాయలు చార్జి చేస్తుంది ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ యూజర్లు కొత్త సంవత్సరంలో కొత్తగా సబ్ స్క్రిప్షన్ తీసుకుని ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులతో ఎంటర్టైన్ చేయండి.