KTR on Maheshwar reddy: అసెంబ్లీలో రైతు భరోసా అంశంపై చర్చ సందర్భంగా బీఆర్ఎస్-బీజేపీ సభ్యుల మధ్య మాటలు తారాస్థాయికి చేరాయి. ఆవేశానికి లోనైన కేటీఆర్.. సాగు భూమిని వ్యాపారంగా చూస్తారా అంటూ మండిపడ్డారు. గ్రామాల్లో ఐటీ చెల్లింపులు చేస్తున్నవారు ఉన్నారన్నారు. రైతులకు పాన్ కార్డు ఉన్నాయన్నారు.
ఇలాంటి ప్రాతిపదికన తీసుకుంటే వారికి రైతు బంధు కట్ అయ్యే అవకాశముందన్నారు. ఈ క్రమంలో బీజేపీని లాగారు. బడా వ్యాపారవేత్తలంతా సొమ్ములు ఎగొట్టి, బ్యాంకులను లూఠీ చేసి పారిపోయారని, వారిని పట్టుకోరు, అడిగేవారు లేరన్నారు. రైతులు ఖనాజా మింగేసినట్టు చూస్తున్నారని మాట్లాడారు.
అప్పులు ఎగొట్టి బ్యాంకులను నిండా ముంచేసినా ప్రభుత్వాలు నోరు మెదపలేదన్నారు కేటీఆర్. వెంటనే బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకున్నారు. కేటీఆర్ పదేపదే బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడడంపై మండిపడ్డారు. అన్నింటిపై చర్చించేందుకు తాము సిద్ధమేనన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలపై బయటపెట్టే ప్రయత్నం చేశారు.
బీఆర్ఎస్ హయాంలో సివిల్ సప్లైలో అతిపెద్ద స్కామ్ జరగలేదా? రైస్ మిల్లల్ల దగ్గర వేల కోట్ల రూపాయలు బియ్యం ప్రొక్యూర్‌మెంట్ చేయలేదా? బీఆర్ఎస్ స్కామ్‌ల గురించి మాట్లాడుదామంటే తాము సిద్ధమేనన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు దేశంలో అతి పెద్ద స్కామ్ అని అన్నారు.
ALSO READ: రైతు భరోసాపై చర్చ.. కేటీఆర్ మాటలపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం
ఇంకో వారం సమావేశాలను ఆయన పెంచమన్నారు, మరో వారం పెంచాలని కోరారు బీజేపీ సభ్యుడు. ఎందుకంటే వారికి వారమే సమయం ఉందట, దీనిపైనా చర్చకు సిద్ధమేనన్నారు. కేంద్రం గురించి అన్యాయంగా మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. ఆయన ఫ్రస్టేషన్‌లో ఉండడంతో తాను ఎక్కువగా మాట్లాడలేనన్నారు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.