Game Changer:రాజమౌళి(Rajamouli)దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR) సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు రామ్ చరణ్ (Ram Charan). ప్రస్తుతం ఆయన సోలో హీరోగా ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ ఎస్.శంకర్ (S.Shankar)దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ (Game Changer)సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిసెంబర్లోనే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలవల్ల వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా గ్రాండ్ గా అమెరికాలో నిర్వహించనున్నారు. ఇప్పటికే అమెరికాలోని డల్లాస్ లో జరిగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రామ్ చరణ్ తో పాటు చిత్ర బృందం మొత్తం అమెరికా వెళ్ళింది. అతిథులుగా ప్రముఖ డైరెక్టర్స్ సుకుమార్(Sukumar), బుచ్చిబాబు(Bucchibabu)కూడా హాజరు కాబోతున్నారు. రామ్ చరణ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో డల్లాస్ లో జరుగుతుండగా.. ఆ ప్రాంతం మొత్తం తెలుగువారితో, మెగా అభిమానులతో సందడిగా మారనుంది.
ఆంధ్రాలో గ్రాండ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ గా డీసీఎం..
ఇకపోతే ఇప్పటివరకు ప్రమోషన్స్ విషయంలో కానీ షూటింగ్ విషయంలో కానీ నత్త నడకన సాగిన ఈ సినిమా.. ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో మాత్రం వేగం పుంజుకోబోతోంది. అమెరికాలో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ఆగిపోకుండా.. జనవరి 4వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DCM Pawan Kalyan) ముఖ్యఅతిథిగా మరో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. దీనికోసం దిల్ రాజు(Dilraju) కూడా ఇప్పటికే పగడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరొకవైపు మెగా అభిమానులు ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించబోతున్నారు.
250 అడుగుల భారీ రామ్ చరణ్ కటౌట్..
గేమ్ ఛేంజర్ సినిమా విడుదల సందర్భంగా అత్యంత భారీ కటౌట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఏకంగా 250 అడుగుల రామ్ చరణ్ కటౌట్ ని లాంఛ్ చేయడానికి మెగా అభిమానులు సిద్ధం అయిపోయారు. విజయవాడలోని బృందావన్ కాలనీ, వజ్ర గ్రౌండ్స్ లో రామ్ చరణ్ 250 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 29 సాయంత్రం 4:00 గంటలకు ఒక ఈవెంట్ లాగా జరిపి.. ఈ కటౌట్ ని లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈ కటౌట్ అత్యంత ఎత్తైన కటౌట్ గా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించబోతోంది.
యష్, సూర్య కటౌట్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ..
ఇకపోతే ఇప్పటివరకు హీరో యష్ అభిమానులు కే.జిఎఫ్ చిత్రం కోసం 217 అడుగుల కటౌట్ ను లాంచ్ చేయగా.. ఆ తర్వాత సూర్య ఎం.జి.కే చిత్రం కోసం ఆయన అభిమానులు 215 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్ చేస్తూ రాంచరణ్ కటౌట్ సరికొత్త చరిత్ర సృష్టించబోతోంది. ఏది ఏమైనా మెగా అభిమానులు తలుచుకుంటే ఏ రికార్డ్స్ అయినా బద్దలు కొట్టాల్సిందే అంటూ మరోసారి నిరూపిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా.. ఇందులో కియారా అద్వానీ (Kiara advani)హీరోయిన్గా నటిస్తోంది.