BigTV English

Horror Series In OTT : వామ్మో.. గజ గజ వణికించే హారర్ సీన్స్.. రాత్రి చూస్తే ఇక అంతే..

Horror Series In OTT : వామ్మో.. గజ గజ వణికించే హారర్ సీన్స్.. రాత్రి చూస్తే ఇక అంతే..

Horror Series In OTT : ఇటీవల కాలంలో సినిమాల కన్నా ఎక్కువగా ఓటీటీ లో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ బాగా ఫెమస్ అవుతున్నాయి. ఎన్నో షోలు ఇప్పుడు తిరిగి వస్తున్నాయి. ఈసారి ఓటీటీ ఆడియెన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గతంలో బాగా పాపులర్ అయిన శక్తిమాన్ సీరియల్ ఇప్పుడు మళ్లీ రాబోతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. సోనీ టీవీ పాపులర్ షో సీఐడీ, దూరదర్శన్ షో ఫౌజీ కూడా మళ్లీ వస్తున్నాయి. తాజాగా ది జీ హారర్ షో కూడా జీ5 రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ గతంలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ రాబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పటి నుంచి ఈ సిరీస్ ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.


పాత ఒక కొత్త అన్నట్లు గతంలో వచ్చిన సినిమా లు, సీరియల్స్ ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. ఇక 1990 ల్లో టీవీ ప్రేక్షకులను అలరించిన ఎన్నో షోస్ మళ్లీ వరుస కడుతున్నాయి. మనల్ని మళ్లీ ఆ రోజుల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. అలాంటిదే ది హారర్ షో.. ఈ షో మళ్లీ రాబోతున్నట్లు జీ 5 ఇటీవల ప్రకటించింది. భయం ముగిసిపోవడం లేదు.. మొదలవుతోంది.. సిద్ధంగా ఉండండి అనే క్యాప్షన్ తో ఓ చిన్న టీజర్ ను ఇటీవల జీ5 ఓటీటీ తన ఎక్స్ అకౌంట్ ద్వారా ప్రకటించింది.. ది జీ హారర్ షో జీ5 ఓటీటీ లో త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది. ఈ షో స్ట్రీమింగ్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారని సమాచారం.

ఈ హారర్ షో జీ లో 1993 నుంచి 2002 వరకు సక్సెస్ ఫుల్ టాక్ తో ప్రసారం అయ్యింది. అప్పటి లో ఎక్కువ మంది తిలకించిన ఈ షో మొత్తంగా 350 ఎపిసోడ్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇండియన్ హారర్ సినిమాకు కేరాఫ్ అయిన ది రామ్సే బ్రదర్స్.. ఈ జీ హారర్ షోని ప్రజెంట్ చేశారు. ఇందులో భాగంగా కొందరు భయానక వ్యక్తులు, నమ్మలేని నిజాలు, అలాగే శాపానికి గురైన ఇళ్ల గురించి కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ షోలో ఒక్కో ఎపిసోడ్ ఒక్కో భయంకరమైన మైన సన్నివేశాలను చూపించారు. ఇక అజిత్ సింగ్, ఉత్తమ్ సింగ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత వణుకు పుట్టిస్తుంది. ఈ ది జీ హారర్ షో హిందీలో టెలికాస్ట్ అయింది. చిన్న చిన్న హారర్ కథల సమూహంగా ఈ సిరీస్ ను అందించారు. వణుకు పుట్టించే కొత్త సన్నివేశాల ను ఈ సిరీస్ లో చూపించారు. ఈ షో వచ్చి దాదాపు 22 ఏళ్లకు పైగానే అయ్యింది. ఈ సారి రాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి భయానక సన్నివేశాలను చూపిస్తుందో చూడాలి..  గతంలో గ్రాఫిక్స్ కు సంబందించిన ఎఫెక్ట్స్ లేవు.. ఇప్పుడేమో సరికొత్త టెక్నాలజీ తో పాటుగా ఏఐ కూడా అందుబాటులోకి రావడంతో విజువల్స్ బాగుండే అవకాశం ఉందని తెలుస్తుంది..


Tags

Related News

Ghaati OTT : అనుష్కకు ఘోర అవమానం… 20 రోజుల్లో జీరో థియేటర్స్

Junior Movie: ఓటీటీలోకి జూనియర్ మూవీ..ఆ రోజే స్ట్రీమింగ్!

OTT Movie : టెర్రరిస్టులకే టెర్రర్ పుట్టించే ఆడపులి… ప్రతీ 5 నిమిషాలకో ట్విస్ట్… నరాలు కట్ అయ్యే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : షార్క్‌లను దేవతలుగా భావించే సైకో… ఆడవాళ్లను బలిచ్చి దిక్కుమాలిన పని… గ్రిప్పింగ్ సర్వైవల్ హారర్ థ్రిల్లర్

OTT Movie : తల్లీకూతుర్లు ఇద్దరితో ఒక్కడే… ఐఎమ్‌డీబీలో రేటింగ్ 9.1… తెలుగు మూవీనే మావా

OTT Movie : రోబోని కూడా వదలకుండా ఆటగాడి అరాచకం… అదిచ్చే షాక్ కు మైండ్ బ్లాంక్

OTT Movie : మనుషులకు తెలియకుండా మాయదారి పనులు… ఫ్యూచర్లో ఏఐ ఇంత డేంజర్ స్టంట్స్ చేస్తుందా మావా ?

OTT Movie : బాడీ బిల్డర్ తో ఆ పాడు పని… ఈ నలుగురు ఆడవాళ్ళూ అరాచకం మావా… సింగిల్ గా చూడాల్సిన మూవీ

Big Stories

×